top of page
Search

అల్లుడు మర్యాదలు

murthydeviv
6 days ago
3 min read

పూర్వం రోజుల్లో అల్లుళ్లకు చేసే మర్యాదలు విచిత్రంగా ఉండేవి. అల్లుడు గారు పండగకి వస్తున్నారు ఆంటే ఇంట్లో హడావిడి మొదలు అయ్యేది.


అరోజుల్లో జాయింట్ ఫ్యామిలీస్ కదా, ఒకే పండగకి అందరు అల్లుళ్లు రాలేక పోవచ్చు..


ముందుగా పండగకి అల్లుడిని పంపమని వియ్యంకుడికి ఉత్తరం రాయాలి. వినాయక చవితి మొదలుకుని సంక్రాంతి వరకు ఈ ఉత్తరాలు వెళ్తూ వుంటాయి.


ఉగాదికి కొత్త అల్లుడు గారు రాలేరు. పాత అల్లుళ్ళు అయితే ఆ పండగ కి కూడా ఉత్తరం వెళ్తుంది.


ముందుగా అక్కయ్యలు ని నాన్నగారు కానీ అన్నయ్య గాని వెళ్ళి తీసుకుని వస్తే

పండగ కి బావగార్లు వచ్చే వారు.


సంక్రాంతి గాని దీపావళి అయితే ఎక్కువగా హడావిడి ఉంటుంది..దీపావళి ముందు రోజున తలంట్లు, నరకుడిని చంపటానికి కాకర పువ్వొత్తులు కాల్చటం , కొంచెం సరదాగా వుండే బావగార్లు అయితే కాకర పువ్వొత్తుల తో నవ్వుల పువ్వొత్తులు కూడా వెలుగుతాయి..


ఉదయం పూట పలహారాలు కూడా పూరీ కూర, ఇడ్లీ సాంబార్ , ఇలా ఘనంగా వుంటాయి.


ఆ రోజుల్లో కొన్ని పీటలకు నాలుగు వైపుల వెండి పూలు ఉండేవి. ఆ పీటలు అల్లుళ్లకు

స్పెషల్ గా వేసే వారు.

ఇంక వెండి విస్తరి కంచాలు అల్లుళ్ళ కి స్పెషల్, పక్కనే ఒక చిన్న వెండి ప్లేట్ పిండివంటలు కి , మంచి నీళ్లకు కూడా వెండి చెంబు, గ్లాసులు.


పలహారం కూడా జనరల్ గా వెండి ప్లేట్ లోనే పెట్టే వారు, నాకు ఇప్పటికీ విచిత్రం అనిపించే ది కాఫీ కూడా వెండి గ్లాస్ లోనే , పాపము బావగారు ఎలా తాగుతారో

అనీ నేను టెన్షన్ పడే దాన్ని.


మా కజిన్ సిస్టర్ భర్త ఏదో పెద్ద ఉద్యోగం చేసే వారు. అయన నిర్మొహమాటం గా

చెప్పే వారు వెండి గ్లాస్ లో వద్దు అనీ.


మా అన్నయ్య మామగారు పోలీస్ డిపార్ట్మెంట్ లో జాబ్ బెజవాడ లో వుండే వారు.


మేము ఎవరము వెళ్లినా ఆ పోలీస్ జవాన్లు వెంబడి వచ్చేవారు. సినిమాకి వెళ్ళితే ఇంటర్వేల్ లో కూల్ డ్రింక్స్ అవీ తెచ్చి ఇచ్చే వారు మాకు చాలా మొహమాటం గా ఉండేది.


అసలు అన్నయ్య సంగతి ఎలా వున్నా మా చిన్న అన్నయ్య ఆ మర్యాద లకు చాలా త్రిల్ ఫీల్ అయ్యే వాడు.


ఇప్పటికీ ఆ కబుర్లు చెప్తూ ఉంటాడు. ఇంక మా వారు పండగ కి వస్తాను అంటూ

ఒక టెలిగ్రామ్ ఇచ్చే వారు.


పండగ రోజు ఏ మధ్యాహ్నం కో వచ్చే వారు . మేము అందరం జోక్స్ వేసే వాళ్లము


పనివాడి చేత తలంటీ మిస్ అయ్యారు అంటూ , కబుర్లు చెప్తూ సిగరెట్ తాగుతూ కాఫీ కూడా చల్ల గానే తాగే వారు , సో వెండి గ్లాస్ లో ఇచ్చినా పర్వాలేదు అనుకునే వాళ్లము.


ఇంక పెళ్లి మూడు నిద్ర లలో తలంట్ల వారం అనీ ఉండేది. ఆరోజు వచ్చిన చుట్టాలు పెళ్లి దంపతులకు ఆందరికీ తలంట్లు పోసి కొత్త బట్టలు పెట్టి పాయసం చేసే వారు


ఆ పాయసం కూడా వెండి గిన్నెల్లో ఇచ్చే వారు.. భోజనం అయ్యాక తమలపాకులు కూడా సన్నగా చీల్చి సున్నమ్ రాసి వెండి పళ్లెం లో పెట్టీ ఇచ్చే వారు.


ఇందులో ఏ మర్యాద లోపం అయినా మర్యాద సరిగ్గా చేయ లేదు అనీ అలకలు కూడా సాగేవి.


చాలా మంది ఆడపిల్లలు పెళ్లిళ్లు అయ్యాక మా పెద్ద అన్నయ్య పెళ్ళికి మా కజిన్స్ తో అందరము సరదాగా అలుగుదాము అనుకుంటూ మేజు వాణి కి వెళ్లకుండా విడిదిలో

మిగతా వాళ్లతో కార్డ్స్ ఆడుతూ కూర్చున్నాము.


ఇంత లో మా బాబాయి గారు వచ్చారు, ఏమిటీ మీరు అలిగారా అంటూ ఒక చూపు చూసారు. అంతే అందరము లేచి ఏం లేదు ఈ కార్డ్స్ వాళ్ల కోసం ఆగాము అంటూ బయలు దేరాము.


ఆ రోజుల్లో అలాంటి డిసెప్లిన్ ఉండేది పెద్దవాళ్ళు ఒక్క చూపు చూస్తే చాలు.

మా అన్నయ్య మామగారు మాత్రం మా అందరికీ ఏవో చిన్న గిఫ్ట్స్ ఇచ్చారు.

కొండవీటి ఛాంతాడు లాగా అంత మంది కజిన్స్ కి ఏమిస్తారు.


ఇప్పుడు మా అల్లుళ్లు కి పండగ కి ఊర్లోనే కాబట్టి రమ్మని ఫోన్ చేయండి అంటే మావారికి చెప్తే నీవు చెయ్యి ఎవరయితే ఏముంది అంటారు.

ఇంక భోజనం దగ్గర కొంచెం మర్యాద గా ఏదయినా వడ్డిద్దా ము అంటే పెద్ద అల్లుడు తెలుగులో రెండో అల్లుడు ఇంగ్లీష్ లో చెప్తారు we will help our selves అనీ సమాధానం చెప్తారు.


ఇంక మా అమ్మాయిలు అయితే ఇవేం పూర్వం రోజులు కాదు మర్యాదలకు అంటూ నన్నే బెదిరిస్తారు.

అలా దీపావళి కీ దసరా లో సంక్రాంతి లో ఒక రోజు కలిసి భోజనాలు చేయటం అలవాటు అయిపోయింది


ఈ సారి అయితే దీపావళి రోజు వంట మనిషి డుమ్మా సో వంట అంతా చేసే టప్పటికే అలిసిపో యా ను..

ఇంక ఎలాగూ వాళ్ళ కీ స్పెషల్ గా వడ్డించే పని లేదు. అందుకే బఫే లాగా టేబుల్ మీద పెట్టీ తినేయండి అన్నాను.


ఇంక ఆందరికీ హ్యాపీ

ఇప్పుడు వెండి విస్తర్లు అందరికీ పెట్టినా మిగతా అన్నీ రక రకాలుగా వున్న క్రాకరీ. లో సర్వ్ చేయటం ఫ్యాషన్ కదా


అదీ అప్పటికీ ఇప్పటికీ తేడా మనం మర్యాద చేద్దాం అన్నా వాళ్ళు ఒప్పుకోరు

 
 
 

Recent Posts

See All
వన భోజనం

కార్తీక మాసం అనగానే కొంత నొస్టాలజియా వుంటుంది , ఎవరి కయినా , అందరూ వాళ్ళ చిన్నప్పటి రోజులు తల్చుకుంటూ వుంటారు. నాకు అయితే దీపావళి వెళ్ళి కార్తీక మాసం వచ్చినప్పటి నుండీ మా పుట్టింట్ల

 
 
 
నాగుల చవితి

బినాగుల చవితి ఏమిటి? నాగుల షష్ఠి అనవచ్చు కదా !చవితి ఏమిటి? భూమి లోపల నివసించే నాగదేవతలను (సర్పాలను) ఆరాధించే పండుగ నాగుల చవితి. కార్తిక మాస శుక్ల పక్ష చవితి నాడు (కొన్ని ప్రాంతాలలో శ్రావణ శుక్ల చవి

 
 
 
ప్రయాణం

దీపావళి తర్వాత వరుస పండగలు మన భక్తి ఈ మధ్య పండగ హడావిడి, భాయ్ దూజ్ అని ఇద్దరు అమ్మాయిలు కలిసి తమ్ముడి కీ మర్యాద లు వారం రోజులు నుండి హడావిడి గా గడిచి పోయింది. మధ్యలో మా అబ్బాయి పిల్లలు మేజర్లు అయి

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page