లలిత గీతాలు
- murthydeviv
- Jul 29
- 2 min read
ఎన్నో సినిమా పాటలు , గురించి కబుర్లు చెప్పుకున్నాము కదా కొన్ని కబుర్లు లలిత గీతాలు గురించి కూడా చెప్పుకుందాం ఆ నిపించింది..
ఒక నెల రోజులు క్రితం నుంచీ మెల్లగా చదువుతూ వున్న విశ్వనాధ గారి ఏకవీర నవల నత్త నడక నడుస్తున్నా మధ్యలో ఆయన పాట కన్నె కాటుక కళ్ళు గుర్తు వచ్చింది. అరోజుల్లో బాగా పాడేదాన్ని అనుకుంటూ సరే కనీసం విందాము అని యూ ట్యూబ్ లో వెతికాను . మేము పాడిన రాగం కాకపోయినా ఏదో రాగం లో పాట అయితే వున్నది.
ఆ రోజుల్లో భావ గీతాలు , అన్నా భా సరిగ్గా పల్కక పొతే ఇబ్బంది అని లలిత సంగీతం అనే వాళ్లము.
రేడియో లో ఒక అరగంట ఈ ప్రోగ్రాం ఉండేది , ఎక్కువగా రావు బాలసరస్వతి గారు , శ్రీరంగం గోపాల రత్నం, వింజమూరి సీతా, అనసూయ గార్లు చిత్త రంజన్ , ఎమ్ ఎస్ రామారావు గారు, పాడిన పాటలు పెట్టే వారు.
స్కూల్ డేస్ లో లంచ్ కి యింటికి వస్తూ ఉంటే నల్లని వాడా నే గొల్ల పిల్ల నోయి అనే పాట రేడియోలో వస్తూ ఉండేది.
మాఇంట్లో పిల్లలకి ట్యూషన్ చెప్పటానికి ఒక ఆస్థాన మాస్టర్ గారు ఒకరు ఉండేవారు. ఆయనకు ఎక్కువగా డ్రామాలు వేయించటం , వేయటం మీద ఇంటరెస్ట్ , కానీ ఉద్యోగం చేయటం తప్పదు కదా.
మాస్టర్ గారి భార్య బాగా పాటలు పాడే వారు , ఎస్ రాజేశ్వర రావు గారి పాటలు ఎక్కువగా పాడే వారు.
ఆవిడ దగ్గర మొదట గా ఈ లలిత గీతాలు వినటం , ఆవిడ పాట పాడుమా కృష్ణా పలుకు తేనెలు ఒలు కునటుల
పాట తేనె లు వలికి నట్లే పాడే వారు . ఓహో విభావరి కూడా ఆవిడ పాడితేనే విన్నాను. మాస్టర్ గారు లెక్కలు చెప్తే ఆవిడ ఈ పాటలు నేర్పుతూ వుండే వారు.
ఆరోజుల్లో ఈ యూ ట్యూబ్ లు లేవు గ్రామఫోన్ రికార్డులు కొంచెం వున్న త కుటుంబాలు లోనే ఉండేవి.
పాట నేర్చుకోవాలి అంటే రేడియో లో వస్తున్నప్పుడు రాసుకుని నేర్చుకోవాలి.
మాస్టర్ గారి భార్య ఎక్కడ నేర్చుకుందో తెలియదు కానీ మాకు మాత్రం నేర్పే వారు.
ఆ తర్వాత కాలేజీ లో ఉద్యోగం చేసిన కొన్ని రోజుల్లో ఈ లలిత గీతాలు ఎంకి పాటలు చాలా మంది కవులు రాసిన పాటలు గురించి తెలిసింది.
ఆ రోజుల్లో నలుగురం కలసినా బోలెడు కొత్త కొత్త పాటలు పాడుకుంటూ , నేర్చుకుంటూ వుండే వాళ్లము.
అలా నేర్చుకున్న ఎన్నో పాటలు ఏన్నో సభల్లో గెట్ టు గె డెర్స్ లో పాడా ను.
అడవి బాపిరాజు , బసవ రాజు గారు ఎన్నో పాటలు వున్నాయి, కొనకళ్ల గారి కూడా చాలా పాటలు వున్నా
కొన్ని ఘంటసాల గారు రికార్డు లో పాడినవి మాత్రమే ఎక్కువగా ప్రాచుర్యం పొందాయి.
బసవరాజు గారు వి రెండు కవితా సంపుటా లు వున్నాయిట , ఆకాశ వాణిలో స్వరాజ్య లక్ష్మీ పెండ్లిఅనే పాట స్వరాజ్యం వచ్చినప్పుడు , రాసి వుంటారు.ఆ పాట తరుచూ రేడియోలో వచ్చేది. కొల్లాయి గట్టితనేమి , గాంధీ గారి మీద రాసినది. టంగుటూరి సూర్య కుమారి గారు పాడిన ఒంటిగా ఊయల లూ గితివా అనే పాట , దీపావళి మీద ఒక పాట,
నాగుల చవితి కి నాగేంద్ర అనే భక్తి పాటలు రాశారు . ఇవ్వన్నీ ఇప్పుడు యూ ట్యూబ్ లో వున్నాయి..
నాకు మాత్రం వంటిగా ఊయల పాట, ఈ మావి పై నుండీ అనే కోకిల పాట తెలుసు.
అడవి బాపిరాజు గారి వి చాలా పాటలు నవలలు వున్నాయి.నా లైబ్రరీ లో ఆయన బుక్స్ చాలా వున్నాయి. చారిత్రక నవలలు, సాంఘిక నవలలు చాలా చదివాను. ఇప్పుడు అయితే ఓపిక లేదు. హిమ బిందు ఎందుకో ఆరోజుల్లో చదివితే చాలా నచ్చింది. మా పాప కి ఆ పేరు కూడా పెట్టాను. బాపిరాజు గారివి చాలా పాటలు వున్నాయి.
నాకు నచ్చిన, వచ్చిన పాట పాడకే నా రాణి
ఆ పాట చాలా చోట్ల పాడా ను రివార్డ్స్ కూడా వచ్చాయి. ఉప్పొంగి పోయింది గోదావరి లేపాక్షి బసవయ్య లేచి రావయ్యా, ఇంకా లేవరా భరత పుత్ర లేవరా అనే దేశ భక్తి గీతాలు రాశారు
అయన సిసలైన భావ కవి సంగీత ప్రియులట , నాట్యం ప్రియులు కూడా
ఆయనకు ఒక ఊహ సుందరి కూడా ఉండేదిట
ఈ రోజు నెట్ చాలా స్లో గా వున్నది
ఇంకొందరి కవులు
గురించి ఇంకొక సారి శుభరాత్రి
Comments