top of page

రెన్ ఎండ్ మార్టిన్

murthydeviv

ఈ హెడ్డింగ్ చూసి ఆశ్చర్య పోకండి. ఇది ఒక ఇంగ్లీష్ గ్రామర్ బుక్ పేరు. అది బ్రిటిష్ ఇండియా కాలం నాటిది. ఒక అరువది సంవత్సరాల క్రితం మేము అందరం చదువుకున్నాము. ఆ రోజుల్లో ప్రతి ఇంట్లో ఈ పుస్తకం వుండేది. మా నాన్నగారు ఆదివారం తప్పకుండా పిల్లల కు చదువు చెప్పే వారు. ఆయన ఇష్టమైన సబ్జెక్ట్స్ లెక్కలు, ఇంగ్లీష్. లెక్కలు. ముందు గ్రామర్ బుక్ అక్కడ వుండాలి. ఆ గ్రామర్ బుక్ లో కొన్ని ఎక్సర్సైజ్ చేయించే వారు, తర్వాత ఆ రోజు చెప్పిన గ్రామర్ ఉపయోగిస్తూ మేము కొన్ని ఇంగ్లీషు వాక్యాలు రాయాలి. స్కూల్లో చెప్పే సబ్జెక్టు కాకుండా ఈ పాఠం చెప్పటం ఎందుకో అని మనసులో బాధ గా వున్నా ఎదురు చెప్పకుండా రాయాల్సిందే. ఆ ఆదివారం ఇంట్లో ఎవరైనా సెలవలకు వచ్చిన మా బాబాయి వాళ్ళ పిల్లలు వున్నా ఈ ఎక్సర్సైజ్ చేయాలి. వాళ్ళు కొంచెం వెనక బడి వుంటే, ఓపిక గా మరల వాళ్ళకు చెప్పే వారు. ఆయన చదివింది

ఎస్. ఎస్.ఎల్ . సి అంటే ఇపుడు లెవెంత్ క్లాసు కానీ, ఆయనకు అంత ఇంగ్లీషు మీద అంత పట్టు వుండేది. మా అత్తయ్య పిల్లలైతే ఆదివారం మా ఇంటికి రావటానికి భయపడేవాళ్ళు. ఎందు కంటే మా నాన్న గారు చదువు చెప్తారని. ఇంక లెక్కలు అయితే మొదట ఎక్కాలు చెప్పాలి. తర్వాత నోటి లెక్కలు అడిగేవారు. మేము ఏదయినా సినిమా చూసివచ్చినా లేక ఏ గుడి, లేదా ఫంక్షన్ కి వెళ్లి వచ్చినా అదంతా ఇంగ్లీష్ లో రాసి చూపించాలి. సరే గ్రామర్,లెక్కలు ఇలా వుంటే, ఇంగ్లీష్ లో రాసినవి చూసీ ఎక్కడైనా స్పెల్లింగ్ మిస్టేక్ వుంటే వేళ్ళ మీద పెన్సిల్ తో దెబ్బలు పడేవి. ఇవ్వన్నీ చదివి మీరు అబ్బ అలా కొట్టాలా అని అనుకోవచ్చు. కానీ మా చిన్నతనంలో అలా నేర్చుకున్నాం కాబట్టి ఈ వయసులో కూడ స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాయగలము. నోటిలెక్కలు నేర్చుకున్నాం కాబట్టి మాకు కాల్యూక్ లేటర్ అక్కర లేదు ఇంగ్లీషు లో రాయటం వలన మనకు ఎక్సప్రెషన్ వస్తుంది. బాగా ఇంగ్లీషు లో మాట్లాడ గలుగుతాము. మా మామగారు కూడా నాన్న గారి లాగానే మా మరిది కి చెపుతాను అని పిలిచే వారు. అప్పటికే అతను ఇంటర్మీడియట్. అలా ఆరోజుల్లో వాళ్ళకు ఇంగ్లీష్ మీద అంతా మమకారం వుండేది. ఇపుడు రాసే ఇంగ్లీష్ కానీ, పిల్లలు రైటింగ్ కానీ చూస్తే వాళ్ళ మనసు ఎంత క్షోభిస్తుందో అనిపిస్తుంది. అసలు లాంగ్వేజ్ కి విలువ లేదు. ఎంత పెద్ద స్కూల్ అయినా సరి అయిన లాంగ్వేజ్ టీచర్స్ వుండరు. ఏదో టెన్త్ దాక తెలుగు చదివి ఆ తర్వాత ఫ్రెంచ్,స్పానిష్, లేక సంస్కృతం ట. అసలు తెలుగు రాని వాళ్ళకు ఈ భాషలు ఎందుకో నా అర్ధం కాదు. పోనీ ఇంగ్లీష్ అయినా సరిగా వస్తుందా అంటే Yes బదులు s your బదులు u r ఆ వాట్స్ ఆప్ లాంగ్వేజ్ చూస్తుంటే హతవిధీ అనిపిస్తుంది. ఇంక కాపీ రైటింగ్ అనేది అందరూ మర్చిపోయారు. ఆన్ లైన్ చదువు పరీక్షలు వచ్చాక అసలు రైటింగ్ అనేది లేదు కదా. మా నాన్న గారు బిజినెస్ పనుల మీద ఊర్లు తిరుగుతూ వుండేవారు ఆయన చేతిలో ఒక చిన్న సంచీ వుండేది. అందులో ఒక భవాన్స్ జర్నల్ పుస్తకము వుండేది.అవి చదివినట్లు గా కొన్నింటికి బాగున్నవి అన్న వాటికి టిక్ పెట్టేవారు. మేము కొంచెం పెద్ద వాళ్ళ అయిన తర్వాత ఆ బుక్ లో విషయాలు చెప్పటం నాకు గుర్తు. ఆ టాపిక్స్ మమ్మల్ని చదవమని చెప్పేవారు. భవన్స్ జర్నల్ ఎలా, ఎపుడు ఎవరు స్టార్ట్ చేసారు అని వాటి గురించి చెప్పేవారు. నేను ఎప్పుడయినా మా మనవరాలు తో ఇంగ్లీష్ గ్రామర్ గురించి మాట్లాడితే ఇపుడు అమెరికన్ ఇంగ్లీష్, గ్రామర్ అక్కరలేదు.అని చెపుతుంది. పాపం ఇపుడు మా నాన్న గారు కానీ, మా మామగారు కానీ వుంటే ఏమనుకునేవారో. కొస మెరుపు నేను కూడా మా నాన్న గారి లాగా ఏదయినా చదివితే టిక్కులు పెట్టీ నోట్స్ రాస్తాను. అలా చేసి వాటి గురించి మీతో పంచుకుం టున్నాను

ఇదీ రేన్ మార్టిన్ కధ

38 views0 comments

Recent Posts

See All

రథ సప్తమి జ్ఞాపకాలు

. కొంచెం పెద్ద వాళ్ళం అయ్యాక గడిచి పోయిన రోజులు గుర్తు వస్తూ ఉంటాయి చిన్నతనంలో చదువు తర్వాత పెళ్లి పిల్లలు, బాధ్యతలు జీవితము మనం ఆలోచించ...

అమ్మమ్మ అమెరికా యాత్ర 4

1995లో మా అమ్మాయి గ్రాడ్యుయేషన్ కి వెళ్ళాక 2006లో మా అమ్మాయి పురిటికి మరలా అమెరికా యాత్ర కు బయలుదేరాను ఈ 11 సంవత్సరాలలో చాలా మార్పులు...

అమ్మమ్మ అమెరికా యాత్ర 3

అలా మొదలైన నా యాత్ర బహుశ రెండు నెలలు వున్నాను అనుకుంటా అమెరికాలో. మా అమ్మాయి గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ బాగా అయింది. నేను వెళ్ళిన ఒక పది...

コメント


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page