top of page
Search

రేడియో కధలు

  • murthydeviv
  • Aug 4
  • 2 min read

ఈ రోజు జాతీయ రేడియో దినోత్సవంట, అందుకే రేడియో కబుర్లు కాసేపు చెప్పుకుందాం. ఆ రోజుల్లో రేడియో ఉండటం కూడా ఒక లగ్జరీ అనుకుంటా.

మా ఇంట్లో ఒక రేడియో, దాని కొక పెద్ద టేబుల్ ఉండేది. ఒక స్పెషల్ రూమ్ కూడా ఉండేది.


ఆ రూమ్ లో మా పెద్దనాన్న గారు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే ఇంగ్లీష్ న్యూస్, తర్వాత వచ్చే సంగీతం కార్యక్రమం వినే వారు.


ఆ రూమ్ మేడ మీద ఉండేది, ఆ టేఖ్నిక్ నాకు తెలియదు కానీ ఆ రేడియో కీ రెండు లౌడ్ స్పీకర్స్ ఉండేవి. ఒకటి మేడ మీద బాల్కనీ లో వీధిలో వాళ్ళకోసం

రెండవది కింద హల్లో ఉండేది.


ఉదయం ఏడు గంటలకు తెలుగు వార్తలు , ఎనిమిది గంటలకు ఇంగ్లీష్ వార్తలు వచ్చేవి.

వార్తలు వచ్చే టైంకి మా బామ్మ గారి కజిన్ బ్రదర్ అనుకుంటా, ఫ్రీడం ఫైటర్ ఎపుడూ ఖద్దరు బట్టలు వేసుకునే వారు. వస్తూనే మా అమ్మ గారితో యువ రాణి గారు మంచి కాఫీ ఇవ్వమ్మా అని అడిగే వారు.


తెలుగు, ఇంగ్లీష్ వార్తలు విని ఊళ్ళో వాళ్ళ వార్తలు కొన్ని మా బామ్మ గారికి

చెప్పి, మా పెదనాన్న గారితో బ్రేక్ ఫాస్ట్ చేసి వెళ్ళే వారు


మధ్య మధ్యలో మాకు నువ్వు జీడీలు తెచ్చి ఇస్తూ వుండే వారు.


మా పెద్దనాన్న గారికి సం గీ తం అంటే చాలా ఇంట్రెస్ట్ , రాత్రి పూట ఆ సంగీతం

వింటూ చుట్టు పక్కల వీ ది లో కూర్చుని వినే వాళ్లకు ఆ గాయకులు వివరాలు చెప్తూ వుండే వారు...


మాకు శని, అదీ వారాల్లో వచ్చే బాలనందం , మూడు గంటలకు వచ్చే సినిమాకి పెర్మిషన్ ఉండేది.


పెద్దనాన్న గారి హయం అయిపోయి మేము హై స్కూల్లో, కాలేజీ వచ్చాక

బినాక గీత్ మాల వివిధ భారతి వినే వాళ్ళము.

అదీ మా నాన్న గారు ఇంట్లో ఉంటే బుద్దిగా ఆకాశ వాణి విజయవాడ

వినాల్సిందే . లేకపోతే అయన లేట్ గా ఇంటికి వచ్చిన రోజు

క్విజ్ లాగా ఈ రోజు వార్తలు ఏమిటి అని అడిగే వారు.


అందుకు రోజూ ఒకసారి వార్తలు వినే వాళ్ళము. మా బామ్మ గారి

బ్రదర్ లోటు తీర్చటానికి మా దూరపు బంధువు ఒకాయన

ఏవో పనులు మీద వచ్చి నెలకు వారం పడి రోజులు ఉండేవారు.


ఆయన కు కొద్దో గొప్పో హిందీ కూడా వచ్చు, అందువలన


మూడు భాషల్లో వార్తలు విని మాకు ఆ జ్ఞానం అంతా పంచి పెట్టే వారు.

కాలేజీ లో చదువుతున్నారు, ఇవ్వన్నీ తెలుసుకోక పొతే ఎలా అని

మాకు ఒక డిసెప్లిన్ క్లాస్ ఉండేది.


మా నాన్న గారికి అంత రాజకీయాలు మాట్లేడే అలవాటు లేదు, కానీ


నా పెళ్లి అయ్యాక మా మామ గారి ని, మా వారిని చూసాక ఆ రాజకీయాలు

కొంతమంది జీవితంలో ఒక భాగం అని అర్ధం అయింది.


రేడియో గురించి చెప్పుకునేటప్పుడు పొత్తూరి విజయ లక్ష్మి గారి కధ గుర్తు చేసుకోవాలి కదా.

మా అమ్మమ్మ గారి ఇంట్లో అలాటి సన్నివేశాలు ఉండేవి. మా తాతయ్య

మా అమ్మమ్మ కు కొంచెం వినిపించక పోయినా అన్నీ ఓపికగా చెప్తూ వుండే వారు.


ఇంక తాత గారు బయటకు వెళ్ళితే అమ్మమ్మ రేడియో ఆపటానికి ఒప్పుకునేది కాదు. మేము అక్కడ కూర్చుని ఆవిడకు అన్నీ చెప్పాలి..


ఆ రోజుల్లో మనం తప్పించుకుని ఈ చెల్లెలు కో లేదా పిన్ని కొడుక్కో చెప్పాలని


చూసే వాళ్ళము. ఇప్పుడు తలచుకుంటే అయ్యో మనల్ని అంత గారాబం గా

చూసిన అమ్మమ్మ కీ చెప్పలేదు అనే బాధ కలుగుతుంది.


తాతగారు అమ్మమ్మ కీ ఓపికగా అన్నీ చెప్తూ ఉండేవారు.


ఆ రోజుల్లో రేడియో నే చాలా అపురూపం గా చూసుకుని దుమ్ము పడకుండా

అందమైన లేస్ క్లాత్స్ కవర్ గా వేసే వాళ్ళము. పక్కన ఫ్లవర్ వాజులు

వాటిల్లో ప్లాస్టిక్ పూలు అలంకరణ అంతా ఆ టేబుల్ కే ఉండేది.


ఇంక ట్రాన్సస్టర్ వచ్చాక , ఎక్కడైనా, ఎప్పుడైనా వినచ్చు.

ఇప్పుడు సెల్ ఫోన్ ఉంటే చాలు, అరచేతిలో స్వర్గం వున్నట్లే


ఆచంట జానకి రామ్ గారి నా స్మృతి పధం లో చదివాక రేడియో

ప్రోగ్రామ్ ల గురించి బాగా తెలిసింది. అవీ నా ఆనాటి రేడియో జ్ఞాపకాలు

 
 
 

Recent Posts

See All
వరలక్ష్మి వ్రతము విశేషాలు

ఈ రోజు వరలక్ష్మి వ్రతము అనీ ఫేస్ బుక్ లో చాలామంది అమ్మవారి అలంకరణ , ప్రసాదాలు ఫోటోలు పెట్టారు .. అన్నీ చూడ ముచ్చట గా వున్నాయి.. ఈ రోజుల్లో ఎక్కువగా అమ్మవారి విగ్రహలు, వెండి వీ, దొరుకుతున్నాయి. అందర

 
 
 
ఉయ్యాల ముచ్చట్లు

మొన్న శనివారం మా కజిన్ మనవడిని ఉయ్యాల లో వేస్తున్నాము రమ్మని పిలిచింది మెల్లగా ఓపిక చేసుకుని బయలు దేరాను . కొండలుగా పేరు పొందిన ఈ మూల నుంచీ ట్రాఫిక్ లో ఆ మూల కొత్త పేట చేరేటప్పటికి

 
 
 
బిమల్ రాయ్

ఈ మధ్య యూ ట్యూబ్ లో st పీటర్స్ బర్గ్ లో అనుకుంటా ఏదో ఒక గ్రూప్ వాళ్ళు కొన్ని హిందీ పాటలు పాడారు.. అందులో మొదట గా మధుమతి లో దిల్ తడప్ అనే పాట చక్కగా పాడారు.. ఇండియా కు రష్యా

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page