అనగా అనగా ఒక రాజు కథ అనగానే మనం చిన్నప్పుడు చదివిన చందమామ కథలు గుర్తు వస్తాయి. బామ్మలు, అమ్మమ్మ లు, చెప్పిన కధలు గుర్తు వస్తాయి. ఎవరో రచయిత చెప్పినట్లు కథలు ఎక్కడి నుండో రావు, మన జీవితాల్లో నుంచే వస్తాయి. ఈ జీవితంలో మన చుట్టూ వున్న మనుషుల్లో ఎన్ని కథలు, సంతోషాలు, బాధలు, సమస్యలు, పరిష్కారాలు చెప్పుకోవాలే గానీ ఎన్ని కధలు . కొన్ని సార్లు ఆనంద భాష్పాలు, కన్నీళ్ళు కాలానికి వాటితో పని లేదు అలా సాగిపోతూ వుంటుంది. ఒక్కొక్క రోజు మన జీవితము ఎక్కడ మొదలు అయింది అనే ప్రశ్న వస్తుంది. అందరూ ఇలా ఆలోచిస్తారో లేదో తెలియదు కానీ నాకు మాత్రం ఎపుడూ ఏవో ప్రశ్నలు బుర్ర లో తిరుగు తూ వుంటాయి. మన జీవితాలు ఎక్కడ మొదలు అయ్యాయి అని ప్రశ్న వస్తుంది. మనకు ఊహ తెలిసినప్పటి నుంచీ మనకు తెలిసిన వ్యక్తులు అమ్మ నాన్న. మా ఇంట్లో జాయింట్ ఫ్యామిలీ కాబట్టి చాలా మంది వుండేవారు. తాతగారు, బామ్మ గారు, పెద్ద నాన్న గారు ఇంకో చిన్న బామ్మ గారు ఇలా ఇంటి నిండా మనుషులతో ఎపుడూ హడావిడీ గా వుండేది. బామ్మ గార్లు పిల్లల కు పూర్వం జరిగిన సంఘటనలు కథల్లగా చెప్పేవారు. ఇపుడు మనకు చెప్పే వోపిక లేదు. వాళ్ళ కు వినే ఓపిక లేదు. అందరం అరచేతిలో స్వర్గము లాగా సెల్ఫోన్ పట్టుకుంటే చాలు. కాలం అలా గడిచి పోతుంది. ఇపుడు నేను తీరికగా ఆలోచిస్తూ వుంటే ఆ సంగతులు గుర్తు వస్తూ వుంటాయి. ఏదయినా డౌట్ వచ్చినా అడగటానికి పెద్దలు అందరూ పైకి వెళ్ళి పోయారు. మా తాత గారు నా దృష్టి లో ఒక లీడర్ గా అనిపిస్తారు. అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి గురించి ఎవరికీ తెలియక పోతే ఏలా అనే ఆలోచన తో సరే కొంచెం వ్రాసి పెడితే కొంత అయినా తెలుసు కుంటారు కదా అనే ప్రయత్నం. నేను ఇన్నాళ్ళు మా తాత గారే పల్లెటూరు నుండి టౌన్ కి వచ్చారు అనుకున్నాను. కానీ ఈ మధ్య నే మా అన్నయ్య ద్వారా మా ముత్తాత గారే వచ్చినట్లు చెప్పారు. కానీ మా ముత్తాత గారు ఎక్కువ రోజులు వున్నట్లు లేరు. ఎందుకంటే మా తాత గారే కుటుంబ భాధ్యతలు నిర్వహించినట్లు తెలుస్తోంది. తాతగారు ఒక చిన్న ఎలిమంటరీ స్కూల్ తో ఆయన జీవితము మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రతి కుటుంబానికి ఒక లీడర్ వుంటారు. అతని కొక విజన్ వుంటుంది. ఆ విజన్ తో అతను ముందుకు సాగుతాడు. అయితే తన కున్న విజన్ తో తన చుట్టూ వున్న అందరి జీవితాలు శాశించ గలనని లేదా తీర్చ దిద్ద గలనని అభిప్రాయం వుంటుంది. ఆ ఆలోచన ఇంత వరకు ఫలిస్తుందో కాలం నిర్ణయిస్తుంది. అయితే ఆ లీడర్ ఎవరయినా భాధ్యత తీసుకోవటానికి కానీ, భాధ్యత నిర్వర్తించడానికి కానీ, అశ్రద్ధ కానీ, భయము గానీ వుండదు. ఈ పని మనం చేయాల్సిందే అనే దృఢమైన సంకల్పం తో ముందుకు సాగుతారు. అలా చిన్న స్కూల్ తో మొదలైన ఆయన జీవితము ఒక పెద్ద బట్టలు వ్యాపారము చేసి, బొంబాయి, మద్రాస్ లాంటి నగరాల్లో హోల్ సేల్ దుకాణాలు ప్రారంభించి వాటిని అయన వున్న నాళ్ళు అవి sucessfull గా నడిపారు. ఎక్కువ చదువు కోక పోయినా ఆయన కున్న విజన్ కు, ఆలోచనా శక్తికి మనం జోహార్లు చెప్పాలి. యింకా కొన్ని విశేషాలు తో రేపు
మా తాత గారి గురించి నాకు తెలిసినంత
murthydeviv
Yorumlar