top of page
Search

మధుర గీతాలు గీతా దత్

  • murthydeviv
  • 2 days ago
  • 3 min read

ఒక ఐదు ఆరు ఏళ్ల క్రితం వరకు టేప్ రికార్డర్ లో మనకు ఇష్టమైన పాటలు పెట్టుకుని వినే వాళ్లము.

నా దగ్గర గీతా దత్ టేప్స్, తర్వాత సీ డీ లు చాలా నే ఉండేవి.

ఈ యూ ట్యూబ్ వచ్చాక ఏదో ఒకటి ఆన్ చేసి అది వినిపించిన పాటలు వినటం అలవాటు అయింది.


ఈ రోజు యూ ట్యూబ్ లో ఇంకేదో వెతుకుతూ ఉంటే రఫీ, గీతా దత్ పాటలు గురించి ఎవరో కామెంటరీ చెప్తూ ఆ పాటలు కొన్ని పెట్టారు.

ఆ పాటలు వింటూ ఉంటే ఏమిటో కొందరికి టాలెంట్ వున్నా రావాల్సినంత పేరు రాక పోవటమో ,

జీవితం విషాదంగా అంతం అవుట మో జరుగుతుంది అనిపించింది.


మా స్కూలు డేస్ లో ఎక్కువగా రేడియో లో నే పాటలు వినేవాళ్ళము. ఎవరు పాడుతున్నారు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనే నాలెడ్జి ఏమీ ఉండేది కాదు . మా మేనత్త గారింట్లో గ్రామఫోన్ లో ఎక్కువగా హిందీ పాట లు పెట్టే వా


అరోజుల్లో విన్నదే మేరా నామ్ చున్ చున్ , చైనా టౌన్ సినిమా అనుకుంటాను. బినాక గీత్ మాల వినటం మొదలు

పెట్టాక అందరి పేర్లు తెలిసాయి.


అప్పుడు మేరా నామ్ చున్ చున్ ఎంత హుషారుగా ఉండేది ఆంటే అరోజుల్లో అందరూ హలో మిస్టర్ హౌ డు యూ డూ అనీ ప లక రించుకునే వాళ్ళు ట, ఆలా అనీ మా పెద్ద అన్నయ్య చెప్పే వాడు. ఆ రోజుల్లో అన్నయ్య బొంబాయి లో ఉండేవాడు


గీతా రాయ్ గానే ఆవిడ పాటలు పాడటం మొదలు పెట్టారుట. భక్త ప్రహ్లాద లో ఏవో రెండు లైన్స్ లో పాట పాడారుట.

తర్వాత బులో సీ రా ని అనే అయన మ్యూజిక్ డైరెక్షన్ లో జోగాన్ అనే సినిమా లో అన్నీ పాటలు పాడారు


ఆ మ్యూజిక్ డైరెక్టర్ పేరు నేనూ ఎప్పుడూ వినలేదు. బహుశా అప్పటికీ నేనూ పుట్టి కూడా ఉండను అనుకున్నాను.


ఈ రోజు ఉదయం విన్న రఫీ , గీతా గారి గురించి వింటూ ఉంటే ఈ హిస్టరీ అంతా తెలిసింది. వెంటనే ఆ జోగాన్ పాటలు వెతికి విన్నాను. నర్గీస్ దిలీప్ కుమార్ యాక్టర్స్.


అన్నీ పాటలు యూ ట్యూబ్ లో వున్నాయి. చాలా స్లో మ్యూజిక్ తో సెహగల్, పంకజ్ మల్లిక్ పాటలు లాగా

సుతా రం గా వున్నాయి. ఒక మీరా భజన్ కూడా వుంది.

1947 నుండీ 1964 వరకు గీతా గారు బులో సీ రాని మ్యూజిక్ లో ఆల్మోస్ట్ 60 పాటలు వరకు పాడారుట.


1947 లో ఏస్. డీ బర్మన్ గారి డైరెక్షన్ లో మొదటి పాట మేరీ సుందర్ సప్నా బీత్ గయా అనే పాట తో మొదలు ,

కాల మహిమ అయన డైరక్షన్ లోనే కాగజ్ కే పూల్ లో పాట వక్త్ నే కియా క్యా హసీ సితం తుమ్ రహనె తుమ్

బహుశా గురు దత్ తో అపుడే విడి పోయారేమో అనిపించింది..


ఆర్ పార్ , మిస్టర్ అండ్ మిసెస్ 55 , భాజి లో ఆవిడ పాడిన పాటలు ఎంత హుశారుగా వుంటాయో.


టండి హవా కాలి ఘటా , జానే కహా మేరా , ఉదర్ తుమ్ హసీ హో ఎప్పుడు విన్నా కొత్త గానే ఉంటా యి.


జాల్ సినిమా లో చోరీ చోరీ అనా మేరీ గల్లీ మే వీడియో చూస్తే ఆ హీరోయిన్ పేరు తెలియదు , ఆ అమ్మాయి

ఎంత చురుకుగా ఉంటుందో, వీడియో లేకుండా పాట వింటే గీతా దత్ ఎంత mischivious గా పాడారో

అనుకుంటాను.. జాల్ లో పాటలు అన్నీ బాగుంటాయి. ఏ రాత్ ఏ చాందిని పాట హేమంత్ కుమార్ గారి

టోన్ గురించి ఇంకా ఏం చెప్పాలి ఆ లాలీత్యం వర్ణించ లేము.


అదే పాట డ్యూయెట్ గా పాడిన పాట బహుశా లతా గారు పాడేరేమో ఆనుకున్నాను. కానీ వింటూ ఉంటే గీతా గారు అనిపిస్తుంది.

ప్యాసా లో అజ్ సజన్ అంగ్ లాగయే , వక్త్ నే కియా క్యా హసీ సితం , ఎంత విషాదం నిండి వుంటాయో, రఫీ

గారి తో పాడిన పాట హమ్ అపకే అంఖోమ్ పాట మరలా అంత రొమాంటిక్ గా పాడారు.

రఫీ గారి తో చాలా పాటలు పాడారుట .


ప్యాసా లో ఇంకొక పాట జానే క్యా తూనే కహి, జానే క్యా మై నే సునా లైట్ గా మిచ్చివిస్ గా వుంటుంది .

ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో పాటలు వున్నాయి .


గీతా దత్ రఫీ గారితో , కిషోర్ కుమార్ తో , హేమంత్ గారితో అందరి మ్యూజిక్ డైరెక్షన్ లో పాడారుట .

ముకేశ్ గారితో కూడా పాడా రెమో , ఇంకొంచెం గూగుల్ సెర్చ్ చేస్తే దొరుకుతాయేమో .


నా ఉద్దేశ్యం లో ఆవిడ పాడిన పాట లన్నిటిలోకి సాహెబ్ బీబీ ఔర్ గులామ్ మీనా కుమారికి పాడిన

రెండు పాటలు నాకు చాలా నచ్చుతాయి.

ఆ సినిమా నే ఒక విషాదం , ఇప్పుడు అయితే అసలు చూడలేము. నేను ఇప్పటికీ పాటలు వింటాను కానీ వీడియో పెట్టను.


పియా ఐ సో జియా మే, నా జావో సయ్యా రెండు పాటలు ఏ రాగమో నాకు తెలియదు కానీ కొంచెం క్లాసికల్ టచ్ తో

చాలా బాగుంటాయి. అయితే మన దృష్టి అంతా మీనాకుమారి డిస్ట్రెస్ మీద ఉండి , పాట మీద అంత దృష్టి ఉండదు.

కానీ ఆ సీన్ అంతగా మనసుకు హత్తుకొవటా నికి ఆ పాటలు ఒక కారణం అనుకుంటాను.


ఓ. పి నయ్యర్ గారు చెప్పారుట గీతా దత్ వాయిస్ చాలా బాగుంటుంది , కానీ నేను ఆషా ని కాదని తనకు పాటలు ఇవ్వలేను అనీ.


నేను ఆవిడ గురించి ఎందుకు రాస్తున్నాను ఆంటే ఎంతో మంది సింగెర్స్ , మ్యూజిక్ డైరెక్టర్స్, గురించి ఎన్నో ప్రోగ్రామ్ లు చూసాను.. ఇండియన్ ఐ డాల్స్ లో చూసాను.


కానీ గీతా దత్ , సుమన్ కళ్యాణ్ పూర్ , తలత్ మెహమ్మోద్ చూడలేదు. సుజాత సినిమా లో బచపన్ కే దిన్ అనే పాట ఆశా గారిది ఉంది, అందులో మధ్యలో గీత దత్ వూరికే రాగం పాడతారు , చాలా మధురమైన వాయిస్ అనిపిస్తుంది.


బెంగాల్ నుండి బొంబాయి కి చాలా మంది వచ్చారు . బర్మన్ దాదా, హేమంత్ కుమార్, అశోక్ కుమార్ త్రయం


గీతా రాయ్ , హృషికేష్ ముఖర్జీ , బాసు చటర్జీ , సుచిత్ర సేన్ , వాళ్ళు అందరూ మరుపురాని ఆణిముత్యాలు.


అశోక్ కుమార్ , హృశికేష్ ముఖర్జీ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .


వాళ్ల గురించి ఇంకోసారి కలుద్దాం. గీతా దత్ గారిని తలచుకుని కొన్ని పాటలు వినండి.


నిన్న పేస్ బుక్ లో జల్సా ఘర్ ప్రోగ్రామ్ లో అతను చెప్తున్నాడు, కల కత్తా లో ఏస్ .డి బర్మన్ గారి ఇల్లు ఇంకా

ఉందిట, లండన్ లో షేక్స్ పియర్ , వాళ్ల ఇల్లు ప్రి సర్వ్ చేసినట్లు గవర్నమెంట్ మన ఇండియా లో


కూడా చేయచ్చు కదా అనీ, మనం యూ ఏస్, బ్రిటిష్ వాళ్ళని అనుకరిస్తాము కానీ, ఇలాంటివి నేర్చుకోము కదా.


శుభ రాత్రి












,




 
 
 

Recent Posts

See All
ఆవకాయ యజ్ఞం

వేసవి రాగానే ముందు ఈ ఎండలు భరించిటం ఒక యజ్ఞం అయితే , ఈ ఎండల్లో నే ఆవకాయ పెట్ట టం రెండో యజ్ఞం. ఎన్నో ఏళ్ల నుంచీ ఆవకాయ పెడుతున్నా ఎప్పటి కప్పుడు ఏదో టెన్షన్ కుదురుతుందో లేదో అనీ, ఏమ

 
 
 
కుకింగ్ గాడజెట్స్

పండగ ముందు పేపర్ చూస్తున్నా, పేస్ బుక్ చూస్తున్నా రకరకాలుగా వంట సామాన్లు , సోఫా లు, మంచాలు, డైనింగ్ టేబుల్ ఎన్నిరకాల ప్రకటనలో , చక్కటి ఫోటోలు తో చూడ ముచ్చట గా వుంటాయి. కూరలు కట్ చేయటాన

 
 
 
ఫోటో షూట్

ఇదివరకు అయితే ఈ మాట ఎవరైనా ఆంటే ఏమిటో అనుకునే వాళ్ళము. ఇప్పుడు అయితే ఈ మాట సాధారణం అయిపోయింది. మొన్న మాకు తెలిసిన వాళ్ళు పెళ్ళికి పిలవటానికి వచ్చారు. వాళ్ళ అమ్మాయి ఏదో కంపెనీ లో మ

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page