ఫ్యామిలీ డాక్టర్
- murthydeviv
- 4 days ago
- 4 min read
Updated: 4 days ago
తరుచుగా ఫేస్ బుక్ లో ఒక డాక్టర్ గారు చాలా బాగా పోస్ట్ లు రాస్తూ వుంటారు. ఈ రోజు పోస్ట్ చదువు తుంటే మా చిన్న తనం లో మా ఫ్యామిలీ డాక్టర్ గారు గుర్తు వచ్చారు ఆ డాక్టరు గారు కూడా మా తాత గారు వున్నపుడు రోజూ వచ్చే వాళ్ళు. ఆ తర్వాత రోజూ కాకపోయినా తరచు గా వస్తూ ఉండే వారు. ఆయన ఒక రిక్షా లో వచ్చే వారు సినిమా ల్లో చూపించి నట్లు ఆయన వెనకాల ఆ లెదర్ బాక్స్ మా ఇంట్లో పని వాడు లోపల కు తెచ్చే వాడు మా తాత గారికి బీపీ లు అవీ చెక్ చేసే వారు ఏమో తెలియదుమాకు ఒంట్లోబాగా లేదు అంటే నోరుతెరిపించి బ్యాటరీ లైట్ వేసి చూసే వాడు ఒక్కో సారి ఒక ఇంజెక్షన్ ఇచ్చే వారు కానీ, ఎక్కువగా ఆయన హాస్పిటల్ కు వెళ్ళి మందు సీసా ల్లో కలిపి ఉంచితే మన ఇంటి నుంచి ఎవరో ఒకరు వెళ్ళి తెచ్చుకునే వాళ్లు. ఒకసారి మాత్రం అందరికీ జ్వరాలు వచ్చాయి. ఎందుకో తెలియదు. అపుడు మాత్రం అందరికీ వరుసగా ఇంజెక్షన్లు ఇచ్చే వాడు , రోజు మార్చి రోజు ఒక వారం రోజులు ఆ ఇంజెక్షన్లు ఇచ్చారు . ఆ రోజుల్లో ఆ సూదులు అంత సన్నగా ఉండేవి కాదు మరలా ఆ ఇంజెక్షన్ ఇచ్చిన చోట కొంచెం వేడి నీళ్లు తో. కాపు లాగా పెట్టే వాళ్ళు. మా ఇంట్లో ఎవరికి వంట్లో బాగు లేక పోయినా మా బాబాయి గారు వచ్చి మమ్మల్ని టేక్ కేర్ చేసే వారు. ఆరోజుల్లో లంకణం పరమ ఔషధం అనుకునే వారేమో, నీళ్ళలో హార్లిక్స్ కలిపి ఇచ్చే వారు, లేకపోతే బార్లీ నీళ్లు, రవ్వ తో జావ ఇలాంటి వి ఇచ్చే వాళ్ళు. వాటిని చూస్తే ఎంతలా విరక్తి వచ్చిందంటే ఇప్పుడు హార్లిక్స్ తాగు దామన్న అదే గుర్తు వచ్చి తాగ లేను. అప్పట్లో ఆ డాక్టర్ గారు నోరు తెరిచి చూస్తే నవ్వు వచ్చేది. కానీ మా పిల్లలు చిన్నప్పుడు దగ్గర లోనే ఒక డాక్టర్ వుండే వారు, ఎపుడూ దగ్గర లోనే ఉన్న చిన్న క్లినిక్ లో డాక్టర్ గారు కూడా అలాగే నోరు తెరిచి చూసి థ్రోట్ ఇన్ఫెక్షన్ అని మందులు రాసి ఇచ్చే వారు. అప్పటికి కానీ నాకు అర్థం కాలేదు చిన్నతనం లో మా డాక్టర్ గారు అలా ఎందుకు చూసే వారో. ఆరోజుల్లో ఎక్కువ గా మందులు వ్రాయడం వుండేది కాదు . హాస్పిటల్ కి వెళ్ళితే మామూలు దగ్గులు, జ్వరాలు కి మందు కలిపే ఇచ్చే వారు. ఆయన తమ్ముడు కళ్ల డాక్టర్ ఆయన కూడా కళ్ల లో వేసుకోవటానికి డ్రాప్స్ కలిపి ఇచ్చేవారు. ఏదయినా జ్వరాలు, ఇంక ఏదయినా ప్రాబ్లమ్స్ ఉన్నా వెంటనే వేరే డాక్టర్ కి చూపించమని చెప్పే వారు ఫ్యామిలీ డాక్టర్ అంటే ఒక ఇంటి మనిషి లాగా ఆప్యాయంగా పలకరించి, ఏవో మాటలు చెబుతూ వైద్యము చేసే వారు. మా ఇంట్లో మందుల అలమర అని ప్రత్యేకంగా ఒక అలమర వుండేది. అందులో ఆ డాక్టరు గారు కలిపి ఇచ్చే మందులు అన్నీ వుండేవి అలమర లో ఆయన ఇచ్చిన మందుల తో ఒక కాడ్ లివర్ ఆయిల్ ఫెర్రడాల్ అని రెండు టానిక్ లు వుండేవి.అవి తాగాలంటే మాత్రం మాకు చాలా బాధ గా వుండేది ఆ కాడ్ లివర్ ఆయిల్ కొంచెం బలహీనంగా వున్న పిల్లలు కు ఇచ్చే వారు.. మేము హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో హిమాయత్ నగర్ లో అలాంటి డాక్టర్ గారు వుండే వారు. ఆయన కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ వైద్యం చేసే వారు. ఏదయినా బ్లడ్ టెస్టు లు ఎక్స్ రే లు కూడా ఆయనే తీసేవారు.ఆ డాక్టరు గారు చాలా నామినల్ ఫీస్ తీసుకొనే వారు అనుకుంటా. హాస్పిటల్ ఎపుడూ పల్లెటూరు నుండి వచ్చిన వాళ్ళ తో కిట కిట లాడుతూ వుండేది. ఆరోజుల్లో చిన్న క్లినిక్ లు, మంచి అనుభవం తో సరిఅయిన diagnosis చేసే డాక్టర్లు వుండే వారు. అసలు ఈ రోజు ఈ డాక్టర్లు గురించి ఎందుకు అని ఆలోచిస్తున్నారు కదా. ఒక వారం క్రితం మామూలుగా రెండు నెలలు కు ఒకసారి వెళ్లే చెకప్ కి నా డాక్టర్ వుండే హాస్పిటల్ కు ఫోన్ చేశాను . ఇపుడు అంతా ఏ ఫోన్ చేసినా ఒకటి నొక్కండి, రెండు నొక్కండి అంటూ ఆ గోల అయ్యాక చివరిలో తెలిసిన విషయం నా డాక్టర్ గారు అక్కడ నుంచి మానుకున్నారు ఇరవై ఏళ్ల నుండీ వున్న హాస్పిటల్ నుంచి ఎందుకు మానుకున్నారో అనుకుంటూ ఆయనే కే ఫోన్ చేశాను. నా వయసు నీ, పాత పేషంట్ ను కాబట్టి, పర్సనల్ గా ఫోన్ చేసినా విసుక్కోవడం లేకుండా ఆయన కొత్తగా చేరిన హాస్పిటల్ కి రమ్మన్నారు. అదే పేరుతో వున్న హాస్పిటల్ గచ్చిబౌలి లో ఉన్నది. అయినా యింకో బ్రాంచ్ ఒక పదిహేను కిలోమీటర్ల దూరం లోనా అనుకుంటూ మర్నాడే వెళ్ళాను. ముందు ఆ హాస్పిటల్ చూడగానే ఇంత బిజీ రోడ్ లో ఇంత స్పేస్ లో ఈ హాస్పిటల్ ఎలా వచ్చిందో అని ఆశ్చర్యం. సరే మనీ మేక్స్ మేని థింగ్స్ అనుకుంటూ కారు దిగాను. మెట్ల దగ్గర ఒక చక్కగా డ్రెస్ వేసుకుని ఒక అమ్మాయి నుంచుని స్వాగతం పలికింది.ఆ మెట్లు ఎక్కువగా లేక పోయినా పక్కన పేషంట్ కి అనువుగా వుండే హ్యాండిల్ లేదు. పాపం ఆ అమ్మాయి, మా అమ్మాయ్ కలిసి నన్ను పట్టుకొని ఎక్కించారు. అంత పెద్ద హాస్పిటల్ వాళ్ళ కు ఇంత చిన్న విషయం ఎందుకు తట్ట లేదో, అక్కడే వున్న రిమార్క్ బుక్ లో అదే రాశాను. లోపలికి వెళ్ళ గానే ఒక ఫైవ్ స్టార్ హోటల్ కి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. అందుకు తగ్గట్టుగా ఒక చక్కటి సూట్ వేసుకున్న అబ్బాయి వచ్చి ఏం కావాలి ఏ డాక్టర్ నీ కలవాలి అంటూ కుశలం అడిగి రిసెప్షన్ కి మా అమ్మాయి నీ తీసుకుని వెళ్ళాడు.నన్ను అక్కడ సోఫా లో కూర్చో మని మర్యాద చేసాడు. ఆ సోఫా లో కూర్చుంటే మరలా నేను లేవటానికి అతనే సహాయం చేయాలి. అతనికి ఆ బాధ తప్పించడానికి నేను చాలా జాగ్రత్తగా గా నుంచున్నాను జాగ్రత్తగా అని ఎందుకు అన్నానంటే ఆ ఫ్లోరింగ్ అంతా చాలా స్లిప్పరీ గా ఉండే పాలరాయి ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా జారడం ఖాయం. అలా ఎవో తిప్పలు పడుతూ డాక్టర్ గారిని చూసి ఆరోగ్యం బాగానే ఉందని అనిపించుకుని ఇంటి కి వచ్చాము. ఎన్నో గవర్నమెంట్ హాస్పిటల్స్ రిపేర్ లేక పేద ప్రజలకు సరి అయిన వైద్యం అందుబాటులో లేకపోవడం అలాంటి వన్నీ గుర్తు వస్తాయి. నా ఉద్దేశంలో గవర్నమెంట్ హాస్పిటల్స్ లో డాక్టర్లు కు వున్న వున్ళ్లఆనుభవం వేరేవాళ్ళ కు వుండదు వైద్యం కోసం వెళ్దాం అంటే క్లినిక్ లే వుండవు. అన్నీ కార్పొరేట్ క్లినిక్ లు . అన్నింటికీ అనవసరమైన టెస్టులు ఇదంతా ఎందుకు గుర్తు వచ్చింది అంటే ఈ రోజు నా ఫ్రెండ్ ఆర్టికల్ ఒకటి ఫేస్ బుక్ లో వచ్చింది.అది షేర్ చేశాను ఇంకా కొన్ని గ్రూప్ లో పోస్ట్ చేశాను. తను మంచి రైటర్. తన చివరి రోజుల్లో చూడటానికి వెళితే కార్పొరేట్ హాస్పిటల్స్ కి వెళ్ళ కు అని చెప్పింది. కానీ ఇపుడు అంతా కార్పొరేట్ కల్చర్ కదా. ఇంక ఫ్యామిలీ డాక్టర్ లాగా ప్రేమ గా కరెక్ట్ గా వున్నది ఉన్నట్లు చెబుతూ వైద్యము చేసే వాళ్ళు ఎక్కడ ఉన్నారు. అందుకే మా ఫ్యామిలీ డాక్టర్ గారు గుర్తు వచ్చారు. ఆ రోజుల్లో ఇంకా అలాంటి డాక్టర్లు చాలామంది తెలుసు వాళ్ళ గురించి ఇంకొక సారి మరి ఇవి కులాసా కబుర్లు కాదు , జీవిత సత్యాలు. అలాంటి మంచి ఫ్యామిలీ డాక్టర్లు ను గుర్తు చేసుకుంటూ గుడ్ నైట్.
Comments