top of page

ప్రయాణము లో పదనిసలు

murthydeviv

మా పాప పుట్టిన తర్వాత నేను మరల వుద్యోగం లో చేరాలని ఉదేశ్యం తో మా పెద్దమ్మ ను తీసుకొని ఢిల్లీ బయలు దేరాను మా అన్నయ్య వచ్చి ఒంగోలు లో జి. టీ ఎస్ప్రెస్ ఎక్కించాడు. డిసెంబర్ నెల, మా పాపకు మూడో నెల. బెజవాడ లో మా కజిన్ వచ్చి పాపను చూసీ పండ్లు కొని ఇచ్చి వెళ్ళింది. మా పెద్దమ్మ పండ్లు తప్పితే రైల్లో ఏమి తినదు . నాగపూర్ దాకా మా ప్రయాణం బాగానే సాగింది. మా కంపార్టమెంట్ లో మద్రాస్ నుండి బెనారస్ లో చదువుకుంటున్న స్టూడెంట్స్ ఐదుగురు అబ్బాయిలు వున్నారు . వాళ్ళు పాపను చూసి ముచ్చట పడుతూ అడుకోవటం మొదలు పెట్టారు . అలా వాళ్ళతో కబుర్లు చెప్తూ, నాకూ బోర్ కొట్టకుండా భోపాల్ దాకా వెళ్ళాము . పాంట్రీ కారులో పాలు తెచ్చినా అవి ఉత్తి నీళ్ళ లాగా వున్నాయి అని మా పెద్దమ్మ తాగ లేదు . ఆ స్టూడెంట్స్ భోపాల్ స్టేషన్ లో దిగి పాపకు ఫ్లాస్క్ లో వేడి నీళ్ళు, పాలు మా పెద్దమ్మ కు తెచ్చి పెట్టారు. ట్రెయిన్ ఇటా ర్సి కొంత దూరం వుండగా ఆగిపోయింది . వాళ్ళు ఇటర్శి లో దిగి వేరే ట్రెయిన్ లో వెళ్ళాలి.. గొడవ గా వుంటే వాళ్లు దిగారు. పాప ను వదిలి నేను వెళ్ల లేను కదా. ఆదుర్దా గా వాళ్ళకోసం వెయిట్ చేస్తున్నాను. కొంత సేపటికి వచ్చి మా కంపార్ట్మెంట్ కు ముందు కొన్ని కంపార్టమెంట్స్ కు మంటలు వచ్చినవి . అందుకు మమ్మల్నీ కొంచెం వెనక కంపార్టుమెంట్స్ లోకి మారమని చెప్పారుట. ఆ రోజుల్లో సూట్ కేసులు తక్కువ. నా దగ్గర రెండు పెద్ద పెట్టెలువున్నాయి. పాపము ఆ రెండు పెద్ద పెట్టెలు మోసి వేరే కంపార్ట్ మెంట్ లో పెట్టారు కానీ అక్కడ అప్పటికే జనం తో నిండిపోయింది. వచ్చే స్టేషన్ వచ్చే దాక ఆ పెట్ట మీద మా పెద్దమ్మ పాప ను వడిలో పెట్టుకొని కూర్చుంది . ఒక రెండు మూడు గంటల తర్వాత ఆ ట్రెయిన్ ఇటర్సి చేరింది. ఆ అబ్బాయులు అక్కడ టీ. సి.తో మాట్లాడి యింకో కంపార్ట్ మెంట్ లో సీట్ సంపాదించారు. మరల మాకు కావాల్సిన పాలు పండ్లు అన్నీ కొని ఇచ్చారు . మా వారు వేరే వూరి నుండి డిల్లీ వస్తారు అని చెప్తే డిల్లీ లో మా అన్నయ్య ఫోన్ నెంబర్ తీసుకొని మేము ఫోన్ చేస్తాము.అని చెప్పారు ఆ ట్రెయిన్ కదిలిలిందాక వుండి వెళ్ళారు. ఆరోజు ఆ ట్రెయిన్ ఎనిమిది గంటల లేటు గా చేరింది. జీవితము లో మరల వాళ్ళను కలుసుకోము. కానీ ఆరోజు వాళ్లు చూపించిన అభిమానం కు , మా మీద వాళ్ళు తీసుకొన్న శ్రద్ద ఎప్పటికి మర్చిపోలేము.a రోజుల్లో కమ్యూనికేషన్ వుండదు, ఫోన్లు లేవు , ఓన్లీ ఉత్తరాలు రాసుకునేవారు. ఆ అబ్బాయు లు కూడా హాస్టల్ లో వుంటారు. అడ్రస్ ఇచ్చి లెటర్ రాయ మన్నాను. వాళ్ళ అడ్రస్ కూడా తీసుకున్నాను. అలాంటి మంచి మనుషులు ఉండబట్టే యింకా ఈ దేశము ఇలా వుందేమో అనిపిస్తుంది. ఇంక డిల్లీ చేరిన దాకా నాకూ మా పెద్దమ్మ కు ఏమీ తిన డానికి తాగటానికి కూడా మనసు రాలేదు. పెద్దమ్మ అయితే రామ నామం జపిస్తూ కూర్చున్నది. మా పెద్దమ్మ ఎపుడూ రామకోటి రాసేది. ఆ సమయంలో ఆ రాముడే వచ్చి అలా సహాయం చేసాడు అనే భావన కలిగింది మాకు. డిల్లీ స్టేషన్ లో మా వారిని , అన్నయ్య నీ చూడగానే అంత దాకా దైర్యం గా వున్న నేను వాళ్ళని హగ్ చేసుకొని ఒకటే ఏడుపు. అన్నయ్య మా వారు ఏమిటీ నీవు బ్రేవ్ వుమెన్ అని మేము అనుకుంటే నీవు ఏడుస్తున్నావు అన్నారు.కానీ వాళ్ళు ఇద్దరూ స్టేషన్ లో మాకోసం నాలుగు గంటల నుండి టెన్షన్ పడ్తూ ఇద్దరూ తెగ సిగరెట్లు తాగా మని

తర్వాత చెప్పారు. రెండు రోజుల నుండి పెద్దమ్మ ఏమీ తినలేదు అని వాళ్ళ ప్రెండ్ యింట్లో టిఫిన్ పెట్టించాడు. మావారు ఇక బస్ వద్దని కారు బుక్ c చేసుకుని మా వూరు చేరాము. బెనారస్ అబ్బాయిలకు నాకు, ఒక ఏడాది ఉత్తరాలు నడిచాయి. పాప ఫోటోలు కూడా పంప మని అడిగారు. నేనూ పాప పుట్టిన రోజుకు రమ్మనమని రాసాను.a తర్వాత కాల ప్రవాహంలో ఎవరికి ఎవరో దూరం అవుతాము. కదా కానీ కొంతమంది మనుషులు గుర్తు వస్తె విరజాజి పరిమళం లాగా చల్లటి గాలి లా హాయిగా అని పిస్తుంది. కాల ప్ర వా హ ములో ఎవరో ఎక్కడో ఋణనుబంధాలు.

32 views0 comments

Recent Posts

See All

రథ సప్తమి జ్ఞాపకాలు

. కొంచెం పెద్ద వాళ్ళం అయ్యాక గడిచి పోయిన రోజులు గుర్తు వస్తూ ఉంటాయి చిన్నతనంలో చదువు తర్వాత పెళ్లి పిల్లలు, బాధ్యతలు జీవితము మనం ఆలోచించ...

అమ్మమ్మ అమెరికా యాత్ర 4

1995లో మా అమ్మాయి గ్రాడ్యుయేషన్ కి వెళ్ళాక 2006లో మా అమ్మాయి పురిటికి మరలా అమెరికా యాత్ర కు బయలుదేరాను ఈ 11 సంవత్సరాలలో చాలా మార్పులు...

అమ్మమ్మ అమెరికా యాత్ర 3

అలా మొదలైన నా యాత్ర బహుశ రెండు నెలలు వున్నాను అనుకుంటా అమెరికాలో. మా అమ్మాయి గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ బాగా అయింది. నేను వెళ్ళిన ఒక పది...

Commentaires


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page