top of page

పెద్దమ్మ తో పంజాబ్ యాత్ర

murthydeviv

మా పెద్దమ్మ పంజాబ్ లో వున్నది రెండు నెలలే కానీ అక్కడ ఫ్రైండ్స్ కు అందరికీ మర్చి పోలేని జ్ఞాపకాలు మిగిల్చి వెళ్ళింది. కొంతమంది మనుషులు ను తలచుకుంటే మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. అవిడ ఆ కోవ కు చెందిన వ్యక్తి. మొదట అవిడ వంట, రెండు స్వీట్స్,అవి చేసి అందరికీ పంచి పెట్టే మనస్సు. అవిడ భాష రాకపోయినా ఇంటి వాళ్ళ తో స్నేహం చేసుకొని వాళ్ళ వంటలు రాజుమా, చోలే, పరోటా లు అన్నీ నేర్చు కున్నది.. ఆ వ కూర, మొక్క జొన్న రొట్టెలు కూడా చేస్తానని అనేది కానీ మేమే అపాము అవి మనకు అరగవు అని. పాలు చాలా బాగుంటాయి అని రోజూ ఏదో ఒక స్వీట్ చేసేది. ఆమె చేసే పాల మిఠాయి అనే స్వీట్ నేనూ చాలా సార్లు ట్రై చేశాను కానీ ఎపుడూ కుదిరేది కాదు. ఇంక ఆదివారాలు మిలటరీ తమ్ముళ్ళ కు బ్రిడ్జి ఫ్రెండ్స్ కు చేతి నిండా పని తో పాటు నోటి నిండా తీపి గుర్తులు. తమిళ స్నేహితుడు అయితే మా పెద్దమ్మ కు స్పెషల్ గా కాఫీ పౌడర్, ఇడ్లీ పిండి తెచ్చి ఇచ్చేవాడు. అవిడ కు. నేస్కేఫ్ నచ్చేది కాదు. మా ఇంట్లో రుబ్బు రోలు లేక పోవటం పెద్దమ్మ కు అసలు నచ్చలేదు. ఇంకా మిక్సీలు ఆపుడు అంత పాపులర్ కాలేదు. రుబ్బూ రోలు కూడ ఢిల్లీ లోనే, దొరికేది. ఇంక ఇడ్లీ దోశ లు అయితే చండీ ఘర్ లో ఇండియా కాఫీ హౌసులో దొరికేవి. అక్కడ వున్న్నాళ్ళు దోశ కు మొహం వా చి నట్లు వుండేది. ఏ స్కోర్ట్స్ జిమ్మ్ గారింట్లో రూబ్బు రోలు వుండేది. వాళ్ళ పని అమ్మాయి దాన్ని గుడ్డి అని పిలిచేవారు. మహా హుషారు గా వుండేది. సైకిల్ మీద వచ్చేది. మా ఇంట్లో కూడ పని చేసేది. ఆ అమ్మాయి తో కూడా మా పెద్దమ్మ కమ్యూనికేట్ చేయగలిగేది. ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో దోశ పిండి రుబ్బేది. అవిడ పదిహేను రోజులు కొకసారి దోశ లగెట్ టుగెదర్ పెట్టేది. అక్కడ చలి కి తట్టుకోలేక పెద్దమ్మ రెండు నెలలు అవగానే ప్రయాణం అయింది. ఒకరోజు చండీ గఢ్,చూపించి, ఢిల్లీ తీసుకుని వెళ్ళి మా వారు ట్రెయిన్ ఎక్కించి వచ్చారు. అక్కడ అందరూ చాలా రోజులు మా పెద్దమ్మ ను మిస్ అయ్యారు. మావారు ఎం టెక్ ఎగ్జామినర్ గా పిలాని వెళ్తుండే వారు ఈ లోపు మా ఢిల్లీ అన్నయ్య కు పెళ్ళి అయింది. నన్నూ పాపను అక్కడ దింపి మా వారు ఎగ్జామినర్ గా వెళ్ళారు.డిల్లీ అంతా నాలుగు రోజులు హయిగా తిరిగాము. అన్నయ్య వాళ్ళింట్లో రు బ్బు రోలు చూడ గానే నాకు పెద్దమ్మ గుర్తు వచ్చింది. చక్కగా దోశ లు ఇడ్లీ లు చేసుకోవచ్చు కదా అని,నేను వదిన వెళ్ళి మా ప్రియ నేస్తం అనుకుంటూ కొనుక్కున్నాను. ఆ తరవాత నేను ఒక శ్రమ జీవి నయి పోతానని ఊహించలేదు. ఆ రోలు ను ఒక పాత చీర లో కట్టి ఇచ్చింది మా వదిన. మా వారు టెలిగ్రామ్ ఇచ్చి పలానా టైమ్ కి బస్ స్టాండ్ లో దింప మని. మా అన్నయ్య జీపు లో దింపుతూ ఎంక్వైరీ చేశాడు ఆ మూట గురించి,నేను చెప్పగానే ఎందుకమ్మా శ్రమ పడ్తావు అన్నాడు. అన్నయ్య కదా మరి. మా వారు కనిపించగానే, జీపు డ్రైవర్ చేత సామాను అక్కడ పెట్టించి వెళ్ళాడు. బస్ రాగానే కూలీ నీ పిలచి సామాను బస్ లో పెట్ట మంటే వాడు ఆ మూట ఎత్తుతూ బహుత్ భారీ హై సాబ్ అన్నాడు. ఆపుడే ఈ లోకంలో కి వచ్చిన మా వారు ఏముందీ ఆ మూట లో అన్నారు. నేను లేనిపోని వినయాన్ని యాక్ట్ చేస్తూ మీకు కంది పచ్చడి ఇష్టం కదా,అందుకే రోలు కొన్నాను అన్నాను. నేను ముందే చెప్పా కదా ఆ రోజుల్లో ఫోన్ లేవు ఆ ముఖారవిందాన్ని ఫొటో తీయటానికి. ఆ కూలీ కి మావూరులో కూలీ కి రోలు అంత ఖరీదు అయింది. సరే నేను ఒకే ఒక తప్పు చేసి బుక్ అయిపోయాను. రోజూ ఎవరో ఒక బ్యాచిలర్ ఫ్రెండ్ తో యింటికి రావటం అలవాటు. వాళ్ళు ఎలాగూ భోజనం చేస్తారు. ఒక రోజు కొత్త గా కంది పచ్చడి చాలా గొప్ప గా పొగుడుతూ మా వారు అతనికి నెయ్యి వేసుకొని ఎలా తినాలో చూపించారు. ఇంక అంతే యూనివర్సిటీ ఫ్రెండ్స్ బ్రిడ్జి మూక, సరే ఇంక మా మిలటరీ తమ్ముళ్లు అక్కా పాప నీ ఎత్తుకొనా పచ్చడి రుబ్బనా అని అడిగే వారు. ఎలాగూ మనం పచ్చడి రుబ్బించమ్ కదా అని. హా హత విధి నీ దోశ లు ఇడ్లీ మోజు ఎంత పని చేసింది అని నేను కొంచెం దిగులు పడ్డాను. ఆ తర్వాత మా రెండో అన్నయ్య, ఢిల్లీ అన్నయ్య వచ్చి కంది పచ్చడి తిని చాలా రోజులైంది అని సంతోషిస్తూ తిన్నారు. మా రెండో అన్నయ్య అయితే చిన్నపుడు కంది పచ్చడి లేక పోతే అన్నం తినేవాడు కాదు. ఉత్తర భారతానికి వస్టే ఇంక అవ్వన్నీ వుండవు కదా. . నేను తర్వాత అమెరికా మా అమ్మాయి దగ్గర కు వెళ్ళినపుడు అక్కడ ఆంధ్రా అబ్బాయిలు కంది పచ్చడి, పెసర పచ్చడి అడిగే వారు. అయితే అప్పటికి మిక్సిలు వచ్చాయి అనుకోండి. మేము ఆ తర్వాత ఆంధ్రా కు వస్తున్నప్పుడు నా

ప్రియమైన రుబ్బురోలు తెచ్చుకుంటానం టే మావారు మిక్సీ కొందాము అంటూ కెమిస్ట్రీ రావుగారు కి యిచ్చి వచ్చారు. అదండీ నా ప్రియమైన రుబ్బురోలు కథ రేపు ఇంకో అనుభవం తో .

35 views0 comments

Recent Posts

See All

రథ సప్తమి జ్ఞాపకాలు

. కొంచెం పెద్ద వాళ్ళం అయ్యాక గడిచి పోయిన రోజులు గుర్తు వస్తూ ఉంటాయి చిన్నతనంలో చదువు తర్వాత పెళ్లి పిల్లలు, బాధ్యతలు జీవితము మనం ఆలోచించ...

అమ్మమ్మ అమెరికా యాత్ర 4

1995లో మా అమ్మాయి గ్రాడ్యుయేషన్ కి వెళ్ళాక 2006లో మా అమ్మాయి పురిటికి మరలా అమెరికా యాత్ర కు బయలుదేరాను ఈ 11 సంవత్సరాలలో చాలా మార్పులు...

అమ్మమ్మ అమెరికా యాత్ర 3

అలా మొదలైన నా యాత్ర బహుశ రెండు నెలలు వున్నాను అనుకుంటా అమెరికాలో. మా అమ్మాయి గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ బాగా అయింది. నేను వెళ్ళిన ఒక పది...

コメント


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page