top of page
murthydeviv

నా నోములు6

మా అత్తగారువదిన ప్రోద్బలంతో ఇద్దరం ఒకే సారి నోము పట్టా ము నోము కార్తీక పౌర్ణమి నాడు గానీ మాఘ పౌర్ణమి నాడు గానీ రాత్రి పూట పూర్ణ చంద్రుడు వున్నపుడు పడతారు ఇది చాలా పెద్ద నోము ముందే చెప్పినట్లు మా పెద్ద వదిన కు పూజలు నోములు అంటే చాలా ఇష్టం వుండేది పూర్తి చేయటానికి చాలా ఏండ్లు పట్టింది మా చిన్నపుడు మా పెద్దత్తయ్య ఈ నోము చేసింది షరా మామూలు గా మా అమ్మ పిల్లలు అందరం ఏ చిన్న ఫంక్షన్ అయినా అక్కడికి హాజరు కావాల్సిందే మా అత్తయ్య కు పుట్టింటి వాళ్లంటే ఎంత ప్రేమ అంటే నే మేము బాల్యం లో సగం రోజులు అక్కడే గడిపేవాళ్ళం మా అమ్మ కూడా మా అత్తయ్య అంటే ఎంతో గౌరవంగా వుండేది ఇపుడు తలచుకుంటే అలాంటి అనుభంధాలు వున్నాయా అనిపిస్తుంది ఈ నోము రాత్రి పూట చంద్రుడు కనిపిస్తుండగ పౌర్ణమి నాడు తులసి కోట దగ్గర పూజ చేసి వాయనం ఇచ్చి మా అందరికీ అట్లు పెట్టటం నాకు బాగా గుర్తు ఆవిడకు ఎంత వోపికొ ఇంతమంది పిల్లల ను పిలిచి ఇవ్వన్నీ చేయటానికి అనిపిస్తుంది మా అత్తగారు కి చాలా ఆచారం వుండేది ఆవిడ చెప్పినట్లు ముందు రోజు పప్పు నానాపో సి ఎవరూ తాకకుండా ఒక పక్క పెట్టాలి ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు ఆ దోశల పిండి బాగా పులిసి అట్టు బాగా చిల్లుల గా వుండాలి మొదటి పౌర్ణమి ఒక అట్టు ఒక జ్యోతి ఒక తాంబూలం తులసి కోట దగ్గర చంద్రుడు కనిపిస్తుండగా ఒక ముత్త యదువు కు వాయనం ఇవ్వాలి వాళ్ళు ఇంటికి వెళ్ళే దాకా ఆ జ్యోతి ఆరకుండా ఆ వత్తులు నెయ్యిలో తడిపి వెలిగించాలి ఆ అట్లు తిని ఉపవాసం ఉండాలి ఆలా 33 పౌర్ణమి లు నెంబర్ ప్రకారం అట్లు పెంచుకుంటూ వాయనం ఇవ్వాలి అట్లు ఎన్నో అన్నీ జ్యోతులు అన్నీ తాంబూలాలు అన్నీ వాయనం ఇవ్వాలి నోము చేస్తున్నపుడు చాలా బాగుంటుంది వెన్నల లో తులసి కోట దగ్గర కూర్చుని పూజ చేయటం జ్యోతులు వెలుగుతుండగా వాయనం ఇవ్వటం చాలా ఆనందం గా వుంటుంది ఈ నోము పూర్తి చేయటానికి 15ఏండ్లు పట్టింది మా అమ్మ చెల్లెలు మా పిన్నికి ఉద్యాపన చేశాను 33 అట్లు అంతే జ్యోతులు వెండి చంద్రుడు రూపు కార్తీక మాసంలో రాత్రి పూట మా పిన్ని బాబాయ్ లను భోజనానికి పిలిచి ఉద్యాపన చేశాను ఈ నోము చేయటం చాలా కష్టము ఓపికగా చేయాలి సాయిబాబా చెప్పినట్లు శ్రద్ద భక్తి ఉండాలి ఇపుడు తలచుకుంటే అహ ఆ పనులన్నీ మనమే చేశాము కదా అని కించిత్ గర్వంగా అనిపిస్తూంది అయితే ఏ పని అయినా మనం సంకల్పించినా భగవంతుని అనుగ్రహం వుండాలి ఇంట్లో వాళ్లంతా సహకారం అందించాలి మా వారు మా పిల్లల సహకారం లేనిదే నేను చేయ లేను కదా అందుకే అందరికీ ఆ భగవంతుని అనుగ్రహం కలగాలి అని ప్రార్థిస్తున్నాను

31 views0 comments

Recent Posts

See All

సంక్రాంతి సంబరాలు

స్కూల్లో ప్రోగ్రామ్ బాగా జరగటం తో నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది.ఫిఫ్త్ , ఫోర్త్, క్లాసెస్ కు ఇంగ్లీష్, మ్యాథ్స్ టీచ్ చేసేదాన్ని....

దేవీ సప్త శతీీ. 2

లలితా సహస్ర నామాలలో కొన్ని నామములు దుర్గా సప్తశతి లోని దేవి అసుర సంహార కార్యక్రమమును తెలియచేయును. సప్తశతి లోని,700 శ్లోకములు ఏడు వందల...

ఉద్యోగ పర్వము 2

నేను ఫస్ట్ క్లాస్ టీచర్ గా చేరాను అని చెప్పాను కదా. ఆ పిల్లలు బాగా డబ్బులు వున్న వాళ్ళ పిల్లలు కావటం, కొంత మంది తల్లి తండ్రులు విదేశాల్లో...

Comments


bottom of page