స్కూల్లో ప్రోగ్రామ్ బాగా జరగటం తో నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది.ఫిఫ్త్ , ఫోర్త్, క్లాసెస్ కు ఇంగ్లీష్, మ్యాథ్స్ టీచ్ చేసేదాన్ని. జనవరి లో సంక్రాంతి పండగ వచ్చింది. మన ఆంధ్రా లో చాలా సందడి వుంటుంది కదా. అందులో మా నాన్న గారు నెల రోజులు ధనుర్మాసం చేసే వారు. ఉదయాన్నే లేచి గొబ్బెమ్మలు పెట్టేటం నాన్న గారు చేస్తున్నపుడు హారతి ఇస్తున్నప్పుడు మేము అమ్మ తో కలిసి పాటలు పాడే వాళ్ళం.గుడిలో ఆరుద్ర పూజ చేసే వారు . సంక్రాంతి మూడు రోజులూ బొమ్మలు పెట్టే వాళ్ళము. అవ్వన్నీ మిస్ అయిపోయి చాలా దిగులు గా అనిపించేది. ఆపుడు మాత్రం అబ్బా ఇంత దూరంలో వున్నామే అని చాలా బాధ కలిగింది. మేము ఆ వూరు వెళ్ళాక మొదటి పండగ కదా ఏదయినా స్వీట్ చేద్దామని అనిపించింది. సూర్య కళ వాళ్ళ అమ్మ నీ అడగ కుండానే నా అంతట నేను ట్రై చేద్దాం అని ప్లాన్. సరే కేసరి హల్వా అయితే ఈజీ గా ఉంటుంది కదా అని మొదలుపెట్టాను. ముందు రవ్వ వేయించాలిట,,అది మనకు తెలియదు కదా, రవ్వ గిన్నెలో వేసి ఇక్కడ పాలు బాగుంటాయి కదా నీళ్ళు బదులు పాలు పోసాను సరే పంచదార కొంచెం వుడికాక వేసేశాను. ఆ రవ్వ అంతా వుడికి a గిన్నె నిండా అయిపోయింది అందులో తిప్పటానికి పెట్టిన గరిట కూడా అందులోనే ఇరుక్కు పోయింది. షరా మామూలుగానే సూర్య కళ ఇంటికి వెళితే ఆమె కాసేపు నవ్వి. మా యింటికి వచ్చి అందులో బాగా నెయ్యి వేసి కలుపుతూ ఆ హల్వా లాంటి పదార్థ దాన్నీ రెండు మూడు ప్లేట్స్ లో సర్ది పోసి కొంచెం ఆరాక చాకు తో ముక్కలు గా కట్ చేయించింది.మా వారికి జోక్స్ గా చెప్పటానికి ఒక సబ్జెక్టు దొరికింది. అక్కడ సంక్రాంతి నీ లోడి అని పిలుస్తారుట . యూనివర్సిటీ లో కూడా ఫంక్షన్ చేస్తారు. అక్కడ నెల రోజులకు ఒక్కసారి అయినా ఏదో గెట్ టుగెదర్ కాని పిక్నిక్ కానీ వుండేవి.సో ఇంక నా హల్వా ఎలాగో ఖర్చు కావాలి కదా a ఫంక్షన్ కు తీసుకొని వెళ్ళాము. అక్కడ వాళ్ళ కు స్వీట్స్ ఇష్టం కదా . అందరూ బాగుంది అని మెచ్చు కొన్నారు . స్వీట్ లో బాగుండక పోవటానికి ఏముందీ అన్నీ పాలు, పంచదార, నెయ్యి వేసాక అని మా వారు పక్కన కామెంట్స్ నడుస్తూనే ఉన్నాయి. సరే ఏచేస్తాము, ఒకటీ రెండూ చెడితే గానీ వైద్యుడు కాడు కదా.అని. వూరు కున్నాను. కొసమెరుపు ఏమిటంటే స్కూల్లో పాటలు బాగా పాడ నని కెమిస్ట్రీ రావుగారు చెప్పా రు ట. సో a గెట్ టగెదర్ లో కూడా పాట పాడ మన్నారు. విద్వాన్ విశ్వం గారు నదులు పొల్యూట్ చేస్తున్నారు అనే ఆవేదన తో వ్రాసిన పాట, బుద్ధుడు మీద వ్రాసిన యింకో పాట పాడాను. అక్కడ సూరి లేదు కాబట్టి మా వారే ఇంగ్లీష్ లో అనువాదం చేశారు.అలా సంక్రాంతి సంబరాలు పూర్తి అయ్యాయి.
murthydeviv
Comments