top of page
Search

ఉద్యోగ పర్వము 2

  • murthydeviv
  • Dec 25, 2024
  • 2 min read

నేను ఫస్ట్ క్లాస్ టీచర్ గా చేరాను అని చెప్పాను కదా. ఆ పిల్లలు బాగా డబ్బులు వున్న వాళ్ళ పిల్లలు కావటం, కొంత మంది తల్లి తండ్రులు విదేశాల్లో వుండి ఈ పిల్లలను ఇక్కడ హాస్టల్ లో వుంచారు. వాళ్ళకు అంతగా ఇంగ్లీష్ రాదు. నాకు అంతగా పంజాబీ రాదు. పంజాబీ భాష హిందిలాగానే వున్నా ఎక్కువ గా వత్తి పలుకుతారు మొదటి వారం రోజులు ఎందుకొచ్చిన తిప్పలు రా బాబూ అనిపించినా ఓటమినీ అంత తేలిక గా ఒప్పు కోలేము కదా. అందులో మా వారి ముందు కూడా కొంచెం మన తెలివి తేటలు ప్రూవ్ చేసికోవాలి కదా. మావారు సిగరెట్టులు కొనుక్కోటానికి వెళ్లినపుడు నేను కూడా వెళ్ళి కొన్ని చాక్లెట్స్ కొనే దాన్ని. పంజాబీ నేర్చుకోవటానికి సూర్యకళ ను గురువుగా చేసుకున్నాను. మా నాన్న గారు సినిమా కి వెళ్లి వస్తే ఆ కధ ను

ఇంగ్లీషు లో రాయమనేవారు. అలా నాకు ఇంగ్లీష్ బాగానే వచ్చు . కానీ అక్కడ ఎంత చదువుకున్న వాళ్ళ యినా ఇంగ్లీష్ అంత బాగా మాట్లాడ లేరు. ఆ చాక్లెట్ తో పిల్లలు బాగానె లొంగి పోయారు. నీ జీతం అంతా ఈ చాక్లెట్ కే సరిపోతుంది అని మా వారు జోక్స్ వేస్తూ వుండేవారు. సరే కష్టే ఫలి కదా అని నేను అనుకునే దాన్ని. మిగతా టీచర్స్ కూడా బీఈడీ లేదు అని రికమండేషన్ కాండిడేట్ అని కొంచెం చిన్న చూపు వుండేది. నేను డిసెంబర్ లో స్కూల్లో చేరాను కదా. న్యూఇయర్ వీక్ అని 25th నుండి సెలబ్రేషన్స్ జరుగుతాయి కాబట్టి నీవు కూడ ఏదయినా డ్యాన్స్ లాంటివి పిల్లలు చేత చేయించమని ప్రిన్సిపాల్ నన్ను పిలిచి చెప్పాడు . మా ఊర్లో లేడీస్ క్లబ్బులో కాలేజీ లో చేయటం ఆలవాటు కదా. ఇంక నా అసలైన టా లెంట్ మా వారికీ, స్కూలు వాళ్ళ కి చూపించాలని డిసైడ్ అయ్యాను. సూర్య కళ ఫ్రైండ్ నీ భారత మాత గా ఉంచి పిల్లల కు అన్ని స్టేట్ డ్రెస్ లు వేసి ఒక్కొక్క స్టేట్ ప్రత్యెక తలు చెప్తూ పిల్లల చేతుల్లో దీపం ప్రమిదలు వెలిగించి వాళ్ళ దేశము ఆకారం లో నుంచో పెట్టాను. నేను తెలుగు లో పాడిన దేశ భక్తి పాటకు సూరి ఇంగ్లీషులో హిందీలో అర్థం చెప్పింది. సారే జహాసే అచ్చే పాట కూడా పాడా ను. చివర్లో సూరి క్లాస్ పిల్లలు చిన్న పిల్లలతో కలిసి భంగాడ డ్యాన్స్ చేశారు . ఈ డ్యాన్స్ డ్రామా నేను మా స్కూల్, కాలేజీ లేడీస్ క్లబ్ లో చాలసార్లు చేశాము అందువలన నాకు చేయించటం కష్టము కాలేదు. ఆ డ్రెస్ లు అవి కొనటానికి డ్రెస్సులు వేయటానికి సూరి ఆ అమ్మాయి ఫ్రెండ్స్ సహాయం చేశారు. నేను అంత బాగా ఆర్గనైజ్ చేస్తానని ప్రిన్సిపాల్ కానీ మా వారు కానీ అనుకోలేదు. ఆడిటోరియం అంతా చప్పట్లతో మారుమోగి పోయింది. నన్ను ప్రత్యెక గా స్టేజి మీదికి పిలచి

హై స్కూల్ ప్రిన్సపాల్ అభినందించారు. మన కన్నా పంజాబీ వాళ్ళ కు దేశ భక్తి ఎక్కువ. అందువలన వాళ్లు ఆ డ్యాన్స్ డ్రామా చూసి చాలా సంతోషించారు. అలా స్కూల్లో నా గౌరవము నిలుపుకున్నాను. వెంటనే నాకు ఫోర్త్, ఫిఫ్త్ క్లాస్ కి టీచర్ గా ప్రమోషన్ ఇచ్చి సాలరీ కూడా పెంచారు.ఆ డ్యాన్స్ డ్రామా ను నేను స్కూల్లో మనుకున్నాక కూడా రెండు సార్లు పిలచి చేయించు కున్నారు. అదీ మన ఉద్యోగ పర్వ ము. మరల రేపు కలుద్దాము.

 
 
 

Recent Posts

See All
అమృత హస్తం

ఈ మధ్య మా కోడలు పుట్టిన రోజున మా పిల్లలు హోటల్ కు డిన్నర్ కు తీసుకుని వెళ్ళారు. హోటల్ పేరు ఎర్ర కారం. గుంటూరు కారం సినిమా లాగానే ఆ పేరుకు...

 
 
 
పెళ్ళి పెట్టె

మా చిన్న తనం లో పెళ్ళి జరుగుతున్న పుడు పెళ్ళి మండపం లో ఎవరో ఒక పెద్ద వాళ్ళు ఒక పెట్టె పెట్టుకుని కూర్చుని వుండే వారు. ఏ బాబాయి గారో...

 
 
 
రూట్స్

ప్రస్తుతం ఉదయాన్నే పేపర్ చూడగానే ట్రంప్ గారు ఏమి సెలవు ఇచ్చారో, ఈ గొడవల్లో మనవాళ్ళు అంతా ఎలా వున్నారో అని ఒక అనుమానం వస్తుంది....

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page