లలితా సహస్ర నామాలలో కొన్ని నామములు దుర్గా సప్తశతి లోని దేవి అసుర సంహార కార్యక్రమమును తెలియచేయును.
సప్తశతి లోని,700 శ్లోకములు ఏడు వందల మంత్రములు. ఈ మంత్రములకు చివర స్వాహా కారం చేర్చి చండీ యాగము నందు హోమము చేయుదురు. దుర్గా సప్తశతి లో చిత్రించ బడిన అసుర లందరూ మనలో అంతరముగా ఉన్నారు. ఈ అసురిక లక్షణములు మన లోని ఆత్మ తత్వము ను దర్శింప నీయక అనేకములైన ప్రతి బంధకము లను, ప్రతి కూల
వాతావరణమును ,కల్పించును. ఈ ఆసురిక లక్షణములే అరిశ్వడ్గర్ములు, లేక అంతః శత్రువులు అరిశ్వడ్గరములు,
అనగా , కామ,క్రోధ, లోభ, మద, మోహ మాత్రర్యములు. వాటిని అతిక్రమించుటకు ప్రయత్నము జరుగవలెను.దుర్గా
సప్తశతి పారాయణను, ఉపాసనను ప్రారంభించిన చో దైవీ సంబంధ మార్గములోని ప్రతిభందకము లన్నియు తొలగి పోవు
నను టలో సందేహం లేదు. మహిషము మానవునీ లోని పాశవిక లక్షణమునకు చిహ్నం. ఒక్కొక్కపుడది విజృభించి న,
దానిని అణచుట కష్టము.దేవి సాధించినట్లు అత్యంత సాధన తో దానిని అదుపులోనికి తేవలను. చెడు ఎల్లపుడు
కృ తిమ రూపమును దాల్చి వుండును. ఒక్కొక్క అపుడు మానవులు ఆశ, స్వార్థము, మమత అను పాశములలో
చిక్కుకుని అంధకారము లో పడి పోదురు. దుర్గాదేవి ఉన్నత ఆశ యములకు , కార్య దీక్ష కు, ఆశ్రిత దీన రక్షణ కు, భక్త జన
రక్షణ కు చిహ్నం. ఈ గ్రంథము నందు ప్రథమ, చతుర్థ, పంచమ, ఏకాదశ, అధ్యాయము లలో దివ్యమైన స్తోత్రము లు
వున్నవి. ఫలశ్రుతి ఐన ద్వాదశ అధ్యాయములో దుర్గాదేవి స్వయముగా పలికిన వాక్కులు ముప్పది శ్లోకము లలో వున్నవి. సప్తశతి లోని మరికొన్ని అంశ లను రేపు తెలుసుకుందాము. శ్రీ మాత్రేనమః
Comments