top of page
murthydeviv

నేను నా నోములు

నేను ఎన్నో చిన్న చిన్న నోములు చేశాను కానీ ముందు మా జీవితంలో లో మాకు తెలియకుండానే మేము సంకల్పించ కుండానే కొన్ని అపురూపైన సంఘటనలు గురించి రాస్తాను గురువు గారి దగ్గర నవరాత్రులు చాలా బాగా చేస్తారు పౌర్ణమి దాకా చేస్తారు పౌర్ణమి లోపల నవా వరణ పూజ చేసేవారు ఆ ఆవరణ ల్లో అమ్మవారి పరివార దేవతలు లాగా మమ్మల్ని కూర్చొపెట్టి పూజ చేసారు అది ఒక మరుపురాని అందమైన అనుభవం ఆ అవకాశం కేవలము మా విజయ అక్కయ్య వలన వచ్చింది ఆవిడ పెద్ద గురువుగారికి ప్రియ శిష్యురాలు ఆవిడ చెల్లలు అవటం వలన నాకు అవకాశం వచ్చింది ప్రతి ఏడాది నవరాత్రులు లో తప్పక వెళతాను మా పుట్టిల్లు చీరాల లలో కూడా నాన్న నవరాత్రులు పూజ చేసే వారు ప్రత్యే కంగా ఏమి చేసేవారో తెలియదు ఉదయాన్నే స్నానము చేసి పట్టు పావడా లు కట్టుకుని హారతి టైం కి వెళ్లి అమ్మతో కలసి పాటలు పాడాలి సరే దేవుడి వూరేగింపు కు హారతి పళ్ళెం తో రెడీ గా వుండాలి ఎపుడూ మేము పాటలు పా డటం.దేవుడి వూరేగింపు గురించి ఎందుకు రాస్తున్నా న్న నెంటే ఆరోజుల్లో పెద్ద వాళ్ళ క్రమశిక్షణ అలా వుండేది సాయంకాలం అమ్మ వారి ఆలయం లో అలంకరణ చూడటాని కి వెళ్ళే వాళ్లం తర్వాత మా వదిన రోజు లలిత సహస్ర నామం చేసే ది చీ రాల్లో మా పెదనాన్న గారు గారి కూతురు మా ఇంట్లోనే వుండేవారు అక్కయ్య మా పెద్ద నాన్న గారికి ఒక్కతే కూతురు ఆవిడ తో నాకు చాలా అనుబంధం వుండేది మా పెదనాన్న గారు ఆమె కు సంగీతం నేర్పించారు అక్కయ్య బాగా పాడే వారు మా పెదనాన్న గారికి కూడా సంగీతం అంటే చాలా ఇష్టం ఆరోజుల్లో ఆయన మద్రాస్ లో సంగీత కచేరీలు కు వెళ్ళే వారు మా ఉమ అక్కయ్య చిన్న అమ్మమ్మ గారింట్లో నవరాత్రులు జరిగేవి మేము అందరం కలసి వెళ్ళే వాళ్ళం బహుశ ఆయన న వా వరణ పూజ చేసేవారు అనుకుంటాను ఆరోజుల్లో వెళ్ళటం ఒక్కటే తెలుసు వాళ్ళింట్లో పిల్లల లను కూర్చోపెట్టి పూజ చేసేవారు ఇపుడు ఆపూజ గురించి ఇపుడు అర్ధం అవుతున్నది మా తాత గారి తమ్ముడు అంటే మా చిన్న తాతగారు పశు మలై స్వామి వారి శిష్యు లట అయన కూడా దేవి నవరాత్రులు పూజ చేసేవారట అయన మద్రాస్ లో వుండేవారు మేము ఎపుడు పూజ చూడలేదు అయన తో కలిసి పశుమలై స్వామి వారి శిష్యరికం చేసిన మా దూరపు బంధువు ఒకరు అమ్మ వారి మీద చాలా పాటలు రాశారు మంగళ హారతులు లాలిపాటలు ఎన్నో చక్కటి పాటలు రాశారు మా పెద్దమ్మ అంటే మా రెండో పెద్ద నాన్న గారు కూడా ఆ స్వామి గారి శిష్యులు మా పెద్దమ్మ మా పెద్ద అత్తయ్య కూడా చాలా మంచి హారతి పాటలు రాశారు ఆ పాటలు పాడుతుంటే అమ్మ వారిని చూస్తూ ఆవిడ సన్నిధి లో మన ల్ని మనం అర్పించకుంటూ మనం విన్న వించుకున్నట్లు వుంటుంది మా అమ్మ ఆ పాటలు అన్నీ పండగలకు పా డేది ఆ పాటల వలన వాళ్ళు ఎంత తాద్యంతం తో పూజలు చేసే వాళ్ళు అనిపిస్తుంది నవరాత్రులు దేవీ పూజ మా అత్తగారు కూడా తొమ్మిది రోజులు చాలా శ్రద్ధగా చేసే వారు ఇంక న నవరాత్రుల పూజల గురించి రేపు కలుద్దాము

26 views0 comments

Recent Posts

See All

సంక్రాంతి సంబరాలు

స్కూల్లో ప్రోగ్రామ్ బాగా జరగటం తో నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది.ఫిఫ్త్ , ఫోర్త్, క్లాసెస్ కు ఇంగ్లీష్, మ్యాథ్స్ టీచ్ చేసేదాన్ని....

దేవీ సప్త శతీీ. 2

లలితా సహస్ర నామాలలో కొన్ని నామములు దుర్గా సప్తశతి లోని దేవి అసుర సంహార కార్యక్రమమును తెలియచేయును. సప్తశతి లోని,700 శ్లోకములు ఏడు వందల...

ఉద్యోగ పర్వము 2

నేను ఫస్ట్ క్లాస్ టీచర్ గా చేరాను అని చెప్పాను కదా. ఆ పిల్లలు బాగా డబ్బులు వున్న వాళ్ళ పిల్లలు కావటం, కొంత మంది తల్లి తండ్రులు విదేశాల్లో...

Comments


bottom of page