ఈ హైద్రాబాద్ లో కూడా మా అత్తగారు చాలా సార్లు పొయ్యి పెట్టీ పాలు పొగించి రథ సప్తమి నాడు పరమాన్నం చేసే వారు నోములు పట్టా లంటే రథ సప్తమి నాడు పడతారు మా అత్తగారు న చేత చాలా నోములు పట్టించారు ఆవిడ చిన్నతనం లోనే చాలా నోములు పట్టారు ఆవిడ సూర్య చంద్రుల నోము చిత్ర గుప్తుడి నోము ఏకాదశి గురువారాలు నందికేశ్వర నోము పదహారు చేట లు నోము మా ఉద్యాపన లు అన్నీ ఇక్కడే తీర్చుకున్నారు ఇందులో ఏవో రెండు నోములకు హోమం కూడా వుంటుంది మా అత్తగారు మామగారు చాలా ఓపికగా చేసి కొన్నారు పదహారు చేట ల నోము అని ఇంకో నోము వున్నది అని అనోము కూడా ఉద్యాపన చేసి కొన్నారు ఆ హడావిడి అంత ఇప్పటికీ కళ్ళ ముందు కనిపిస్తుంది మా అత్తగారు మామగారు చాలా సంతోషించారు మా మామ గారి సొంత పల్లెటూరు లో రాములవారి గుడి వున్నది ఆ గుడి మా మామ గారి పూర్వీకులు కట్టించారుట అక్కడ శ్రీరామనవమి నాడు కళ్యాణం చేస్తారు మా మామగారు చాలా సార్లు అక్కడ కళ్యాణం చేశారుట i మా వారు అగుడిని ఈ మధ్య నే బాగు చే యించారు మా అత్తగారికి జిల్లెళ్ళ మూ డి అమ్మ గారు అంటే చాలా నమ్మకం భక్తి వుండేవి ప్రతి శుక్రవారం సాయంత్రం అమ్మ భజన చేసే వారుట మా పుట్టిల్లు చీరాల లకు జిల్లెళ్ళమూడి చాలా దగ్గర ఆరోజుల్లో ఆ వూరికి బస్ వుండేది కాదు మా బాబాయి గారి అత్తగారు వూరు అప్పికట్ల అయన బావ మరదులు అందరూ అమ్మ భక్తులుఆలా మా చిన్నతనం లో మేము చాలా సార్లు అక్కడి కి వెళ్ళాము మా నాన్న గారికి కూడా అమ్మ మీద చాలా నమ్మకం భక్తి వుండేవి ఒకసారి మా ఇంటిలో అమ్మ గారికి పా ద పూజ చేశాము ఆరోజు ఇంట్లో జరిగిన సందడి అంత ఎలా కళ్ళముందు కదలాడుతుంది మా మేడ మీద ఖాళీ ఆవరణ లో అమ్మ కు పా ద పూజ చేశారు తరువాత అన్న సంతర్పణ జరిగింది ఇదంతా ఎందుకు రాస్తున్నా నం టే భక్తి శ్రద్ధలు మనలో ఏర్పడటానికి మన చిన్నప్పటి సంఘటనలు దోహదం చేస్తాయి అనుకుంటాను మన పెద్ద వాళ్ళు ఎంత ఓపికగా అన్నీ నిర్వహించే వాళ్ళు వాళ్ళకి శతకోటి వందనాలు మా నాయనమ్మ లక్ష వత్తుల నోము కోసమని ఎపుడూ తీరిక దొరికినా వత్తులు చేసేది అవ్వన్నీ లెక్క పెట్టంటం మా పిల్లల పని a పనికి కూడా మేము స్నానము చేసి శుభ్రం గా చేతులు కడుక్కుని వచ్చి లెక్క పెట్టాలి ఆ వత్తులు అన్ని ఒక పెట్టె లో పెట్టీ దాచేది మరల ఆ పెట్టె ను ఎవ్వరినీ ముట్టుకోనిచ్చేది కాదు ఇప్పుడయితే అంత కాంట్రాక్టు మనం ఒక లక్ష రూపాయలు చేతి లో పెట్టుకుంటే నోము అయిపోతుంది ఎవరో చేసిన వత్తులు తో మన నోము అయిపోతుంది నా నోములు గురించి రేపు కలుద్దాము
top of page
bottom of page
Comments