నా వివాహం అయ్యాక ఒక 5ఇయర్స్ పంజాబ్ లో వున్నాము తర్వాత హైదరబాద్ వచ్చాము పంజాబ్ లో వున్నపుడు శ్రావణ మంగళవారం నోము పూర్తి చేయలేక పోయాను హైదరబాద్ వచ్చాక మా పెద్దమ్మ వాళ్ళింటికి దగ్గరా గా మలక్ పేట లో వున్నాము మా పెద్దమ్మ కు ఒక్కతే కూతురు పెద్దమ్మ అక్కయ్య తో వుండేది మా అక్కయ్య గురించి చెప్పా లాంటే ఒక పుస్తకం రాయవచ్చు ఆమె ఎపుడు ఎవరితో అయినా కఠినం గా మాట్లాడటం గానీ నొప్పంచటం గానీ ఒకరి మీద చెడు గా మాట్లా డటం గానీ నేను చూడలేదు గాసిప్ అంటే బొత్తిగా ఇష్టం వుండదు అక్కయ్య తో మాకు చిన్నప్పటి నుండి అనుభందం వున్నది మా అమ్మ పుట్టిల్లు నరసరావుపేట తాత గారి దగ్గరకి మేము సెలవలు కి వెళ్ళినపుడు అక్కయ్య కూడా హైదరాబాద్ నుండి వచ్చే ది మాకు మేన మామలు లేరు మా పెద్దమ్మ పెద్ద నాన్న గారు తాతగారి ఇంటి పక్క నే వుండే వారు ఒక్కో సారి సంక్రాంతి సెలవలు కు వెళ్లితే బొమ్మల కొలువు రకరకాల గా పెట్టించేది వేసవి సెలవలు కు తప్పక వెళ్ళే వాళ్ళం అపుడు అక్కయ్య మా చేత రక రకాల ఆటలు ఆ డించేది పెద్ద నాన్న పెద్దమ్మ మమ్మల్ని చాలా ప్రేమ గా చూసేవారు నరసరావుపేట అమ్మమ్మ గారింటికి వెళ్ళ టం అంటే ఏదో డిస్నీలాండ్ వెళ్ళుతున్న అంత ఆనందం గా వుండేది అక్కయ్య తో అలాంటి అనుభందం ఆమె 2016 లో. ఆమె చనిపోయే దాకా కొనసాగింది ఏదో పూర్వజన్మ పుణ్యం వలన అలాంటి వాళ్ళ సాంగత్యం దొరుకుతుంది అలాంటి అక్కయ్య వాళ్ళ ఇంటి దగ్గర వుండటం వలన సత్స్ సాంగత్యం దొరికింది అనిపిస్తుంది నేను చిన్నప్పటినుండి వార పత్రిక లు నవలలు ఎక్కువ గా చదివే దాన్ని అక్కయ్య ప్రోద్బలం తో ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం అలవాటు అయింది రోజు కో రెండు పేజి లు చదువు మెల్లగా అలవాటు అవుతుంది అని చెప్పేది అలాగే అక్కయ్య నా చేత జగద్గురు బోధలు పుస్తకాలు చాలా బాగుంటాయి చదువు అని కోనిపించిది అవి 10పుస్తకాలు కంచి పరమాచార్య గారి ఉపన్యాసాలు అవి చదివితే మన ఆలోచనల్లో చాలా మార్పు వస్తుంది అసలు హిందూ మతము గురించి గుడి కి ఎందుకు వెళ్ళాలి పూజ ఎందుకు చేయాలి మన పూజల్లో ఆచారాల్లో వుండే విశిష్ట త అని అర్థం అవుతుంది నేను ఆ పుస్తకాలు కొని చాలామందికి బహుమతి గా ఇచ్చాను ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే నేను ఇంత ఆధ్యాత్మికం గా మారటానికి కారణం ఏమిటి అని తెలియచెప్పటానికి
murthydeviv
Comments