top of page
Search

Na nomulu 5

  • murthydeviv
  • Nov 20, 2024
  • 1 min read

హైదరబాద్ రాగానే అక్కయ్య ఆద్వర్యం లో శ్రావణ మంగళ వారం శుక్రవారం నోములు మొదలు పెట్టాను శ్రావణ శుక్రవారం నాడు అక్కయ్య మా అత్తయ్య లాగానే అమ్మ వారిని చేయటం నాకు నేర్పించింది అప్పటి నుండీ ప్రతి సంవత్సరం మా అత్తయ్య ను గుర్తు చేసుకుని శ్రావణ శుక్రవారం నోము చేసే దాన్ని మలక్ పేట లో మా ఇంటి చుట్టు పక్కల అందరూ అమ్మ వారిని చాలా బాగా అలంకరించి పూజ చేసే వారు మా ఇంటి పక్కన ఆ యింట్లో పెద్దాయన మైదా పిండి లో పసుపు కలిపి అమ్మ వారి ముఖం తయారు చేసేవారు శ్రావణ వరలక్ష్మి అక్కడ ఎలా నుంచుని మనల్ని దీవిస్తున్నట్లు వుండేది ఏ ఇంటికీ పేరంటం వెళ్ళినా అమ్మ వారు అక్కడ వెలిసినట్లు వుండేది ఇప్పుడయితే అమ్మ వారి బొమ్మలు రెడీ మేడ్ గా దొరుకుతున్నాయి అందరూ అవే పెట్టీ చేస్తున్నారు ఫేసు బుక్కు లో ఎన్నో రకాలు చూస్తున్నాము ఆ రోజుల్లో మా వదినలు నేను కలిసి చాలా సరదాగా నోములు పట్టే వాళ్ళం అన్నీ నోములు రధసప్తమి నాడు కానీ మాఘ పూర్ణిమ నాడు కానీ పట్టాలి అట్ల తదియ ఉండ్రాళ్ళ తదియ ఆ పండుగ నా దే పట్టాలి మా అమ్మ నా చేత ఆ నోములు ఉద్యాపన చేయించారు నేను మా వదినలు కలిసి చేసిన చిన్న నోములు పువ్వు తాంబూలం పండు తాంబూలం లాంటి చిన్న నోములు.చాలా ఉత్సాహంగా పట్టి ఉద్యాపన లు కూడా చేశాము అసలైన పెద్ద నోము కష్టమైన నోము ముప్పది మూడు పున్నముల నోము మా పెద్ద్ వదిన మా అత్త గారి ప్రోద్బలం తో మొదలు పెట్టాము మా పెద్ద వదిన తో నాకు చాలా అనుభందం వుండేది నేను కాలేజీ లో చదువు కుంటున్నపుడు మా అన్నయ్య పెళ్లి అయింది మా వదినలు వాళ్ళ నాన్న గారు చిన్న తనంలోనే చండీ మంత్రం ఉ పదేశం. ఇప్పించారు వదినకు పదహారు సంవత్సరాల వయస్సు లో పెళ్లి అయింది అపుడే వదిన రోజు లలిత సహస్ర నామ పారాయణ కంటో పాఠం గా వచ్చే ది రోజు జపం పారాయణ చేసే ది అలాంటి మా వదిన ఇచ్చిన ఉత్సాహం తో మా అత్తగారి ఆద్వర్యం లో మేముఇద్దరమూ ఆ నోము పట్టాము అపుడు మా బాబు కు ఒక ఏడాది వయసు ఆలా మొదలు పెట్టిన నోము తీర్చటానికి కనీసం 15 ఏండ్లు పట్టింది నోము వివరాలు రేపు

 
 
 

Recent Posts

See All
దీపావళి కొన్ని జ్ఞాపకాలు

అన్ని పండుగల్లో కి విశిష్టత గల పండుగ దీపావళి. దేశము మొత్తం జరుపుకునే పండగ , అంతే కాక ఈ మధ్య ఇతర దేశాలు సైతం , ఈ పండుగ సందర్భంగా కొంత ఉత్సాహం చూపిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు వ్యాపారాల్లో

 
 
 
ఆ పాత మధురాలు

కొన్ని పాటలు వింటూ ఉంటే ఎన్ని సార్లు విన్నా విసుగు రాదు అనిపిస్తుంది . అందులో హేమంత్ కుమార్ గారి స్వరం ఒక విధమైన మాధుర్యం తో వుంటుంది. లోకో భిన్న రుచి అనుకోండి. కొంత మందికి నచ్చక పోవచ్చు. పాత కాలంలో

 
 
 
డ్రెస్ కోడ్

.ఏదో స్కూల్ డ్రెస్ లాగా ఈ హెడ్డింగ్ ఏమిటో అనుకోకుండా కొంచెం ఓపికగా చదివితే మీకే తెలుస్తుంది కదా , దసరా హడావిడి పూజలు కోలాటాలు బతకమ్మ డాన్సులు అయినాయి పిల్లలు కు హాలిడేస్ అనిఅమ్మాయి ఉదయాన్నే బ్రేక్ఫాస

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page