నిన్న అరుదైన శివ శక్తి మాల ఖడ్గ మాల నామాలు త్రిశతి నామాలు కలిపి చేసిన పూజ గురించి తెలుసుకున్నాము కదా నేను చేసిన పూజలు గురించి నాకు ఏమీ తెలియదు కానీ ఇంట్లో మా అత్తగారు పూజ జపం చేసే వారు రోజూ బ్రాహ్మడు వచ్చి అభిషేకము చేసేవారు కానీ ఎవరైనా వచ్చి ఏదయినా పూజ గురించి చెప్ప గానే చేద్దాము అనిపించేది మా పిన్ని చాలా పూజలు చేసేది సావిత్రి గౌరి నోములు నోచుకున్నా రు అని చెప్పాను కదా ఆవిడ 108 పూలతో పూజ చేసి ఉద్యాపన అని మా అందరికీ చిన్న వెండి లక్ష్మి రూపులు ఇచ్చింది అపుడు మా పిన్ని నన్ను కూడా ఆ పూజ చేసికోమని ప్రోద్బలం చేసింది అపుడే కొత్త గా పెళ్ళి ఆయిన మా మరిది భార్య సంతోషి మాత పూజ చేసేది సంతోషి మాత పూజ శుక్రవారం చేస్తారు రెండు మూడు సార్లు తనతో సంతోషి మాత గుడికి వెళ్ళాను నాకు 108 పూలతో సంతోషి మాత కు పూజ చేయాలనిపించింది అనుకున్న పని చేయాలి అనే ఒక కోరిక ఉండేది ఆ 108పూలు పూర్తి చేయటానికి చాలా మంది సహాయం వున్నది ముఖ్యంగా నా పిల్లలు మేనకోడళ్ళు ఎక్కడ కొత్త రకం పూలు కన్పించినా వెంటనే చెట్టు ఎక్కి కోసి కొని వచ్చే వాళ్లు శాంపిల్ గా ఒక పూవు కోసికొచ్చి ఈ పూవు చేశావా అని అడిగే వాళ్ళు ఒక్కొక సారి కొత్త పూల చెట్టు వున్న ఇల్లు గుర్తు పెట్టుకొని గురువారం నాడు కోసికొని వచ్చే వారు చిన్నప్పటి నుండి చెట్లు పెంచటం ఇంట్రెస్ట్ వున్నా కొత్త రకం పూల కోసం కొన్ని చెట్లు పెంచి కూడా పూజ చేశాను ఈ పూజ్ పూర్తి కావటానికి ఒక 5 లేక 6 ఏళ్ళు పట్టింది అన్నీ పూల పేర్లు రాసి పెట్టాను అవ్వన్నీ ఇక్కడ రాయటం లేదు కొన్ని పూలు తెచ్చినప్పుడు కొన్ని జ్ఞాపకాలు వున్నాయి అవి తలచుకుంటే ఇపుడు కూడా చాలా ఆనందం గా అనిపిస్తుంది మాలతి పూలు ఈ చెట్టు ఇపుడు ఎక్కడ కనిపించటం లేదు చాలా మంచి సువాసన వుంటుంది చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఇంట్లో వుండేది రాత్రి పూట చాలా సువాసన వుంటుంది ఈ పూల పేరు వింటే మాలతీ చందూర్ గారు గుర్తు వస్తారు ఇప్పటి వాళ్ళకు ఆవిడ తెలియదు ఆవిడ ప్రమదా వనం నవలలు పాత కెరటాలు పుస్తకాలు గుర్తు వస్తాయి ఆ పూలను గిన్నె మాలతి అంటారని తర్వాత తెలిసింది ఎవరింటి నుంచి తెచ్చారో కానీ పిల్లలు తెచ్చారు కమలాలు ఇపుడు రక రకాలైన పూలు మార్కెట్ లో ఎపుడూ దొరుకుతున్నాయి కానీ ఇది వరకు ఇలా దొరికేవి కావు ఈ కమలాల పూలు గురించి ఎపుడు తలచుకున్నా ఒక మధురమైన అనుభూతి కలుగుతుంది డిసెంబరు లో మేము అందరం పిల్లల తో కలిసి ఆరుద్ర ఉత్సవం కు వెళ్ళాము తిరిగి వచ్చేటప్పుడు జీ ల్లెళ్ల మూడి వెళ్ళాము వచ్చే టపుడు చిన్న చెరువు లో ఎన్నో కమలాలు విచ్చుకొని చాలా అందంగా ఉన్నాయి అవి చూడగానే అవి కోసి కెళ్ళితే ఎంత బాగుంటుంది అన్నాను వెంటనే కారు ఆపి ఎపుడూ మా వెంబడి వుండే మా పిల్లలు మేన కోడళ్ళు డ్రైవరు తో సహా నీళ్ల లో దిగి అన్నీ పూలు కోశారు అవ్వన్నీ తడి చీరలో చుట్టి హైదరబాద్ వచ్చాక నీళ్ళు తొట్లో వేసి శుక్రవారం నాడు పూజ చేశాను ఇప్పటికీ అందరం . కలిసినపుడు ఈ పూలు కోయటం గురించి మాట్లాడు కొని ఆనందిస్తాము ఆ సంఘటన ఒక మధురమైన అనుభూతి లాగా మిగిలిపోయింది ఆలా నా 108పూల పూజ పూర్తి అయ్యింది ఉద్యాపన కూడా చేశాను రేపు ఇంకో పూజ గురించి చెప్తాను నాతో పాటు ఈ గత అనుభూతుల్లో ప్రయాణిస్తున్న అందరికీ అమ్మ వారి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను
murthydeviv
تعليقات