top of page

నాన్న గారి తో సముద్ర స్నానము

murthydeviv

మా ఊరి కి దగ్గర గా సముద్రము వున్నది.సో సముద్రము తో మాకు అవినాభావ సంబంధము. బాగా చిన్న తనంలో మా తాతగారు సముద్ర ఒడ్డున ఇంటి పురోహితులతో వెళ్లి పురాణ కాలక్షేపం చేసే వారు. అది నాకు బాగా చిన్న తనంలో అనుకుంటాను. లీలగా గుర్తుంది. మేము పిల్లలం అక్కడే ఆడుకునే వాళ్ళం. మా యింటికి ఎవరు బంధువులు వచ్చినా ఒకరోజు సాయంకాలం సముద్రము కి తప్పక వెళ్ళేవాళ్ళం. చిన్న తనంలో మా నాన్న గారు మమ్మల్ని కార్తీక పౌర్ణమి, మాఘ పూర్ణిమకు యింకా ఏదయినా విశేషమైన రోజుల్లో సముద్ర స్నానము కు తీసుకొని వెళ్ళే వారు. ఆయన ఒక బిజినెస్ మాన్. ఎపుడూ ఊర్లు తిరుగుతూ చాలా బిజీ గావుండేవారు.కానీ ఎపుడూ ఏ మాత్రం తీరిక దొరికినా మాకు ఎన్నో మంచి పుస్తకాల గురించి, మన ఆచారాల గురించి చెప్పే వారు. ఒకరోజు నేను బ్లౌజ్ సరిగా కుట్టలేదని టైలర్ మీద అరుస్తూ వుంటే,, ఆరోజుల్లో టైలర్ మన యింట్లో నే మిషన్ పెట్టుకొని కుట్టేవారు. మా నాన్న గారు నన్ను పిలిచి ముందు ఆ టైలర్ నీ అరిచి నందుకు కొంచెం చివాట్లు పెట్టీ, సింపుల్ లివింగ్, హై థింకింగ్ వుండలమ్మా, నీవు ఆ టైలర్ కు కొంచెం మర్యాద గా చెప్పి వుండచ్చు కదా అన్నారు. ఆయన ఆ మాట చెప్పి ఒక 60 ఇయర్స్ అయి వుండవచ్చు. కానీ నా మనసులో ఆ మాట అలా నిలిచిపోయింది. ఇపుడు తలుచుకుంటే కళ్ళలో నీరు వస్తుంది. జీవితంలో విలువలు ఎంత బాగా నెర్పే వారు అని. నాన్న గారు అంత బిజీ గా వున్నా మమ్మల్ని శ్రద్ధ గా సముద్ర స్నానము కి తీసుకొని వెళ్ళేవారు. మేమూ, మా అత్తయ్య గారి పిల్లలు అందరం కలసి ఒక పది మంది దాకా వుండే వాళ్ళం. కొంచెం చిన్న పిల్లలను తను చేయి పట్టుకొని వుండేవారు. మమ్మల్ని కొంచెం లోపల దాకా తీసుకుని వెళ్ళే వారు. మేము భయ పడితే పక్కనే వుండి అలలు వచ్చినపుడు ఒక పక్కకు తిరిగి నుంచో మని చెప్పేవారు..మా అమ్మ గారికి చాలా భయము వుండేది. అవిడ ఒడ్డున నుంచుని చాలు ఇంక రండి అని పిలుస్తూ వుండేది. అయినా నాన్న గారు మేము ఎంతసేపు చేసినా ఏమీ అనేవారు కాదు, మమ్మల్నీ ఇంకా దైర్యం గా అలలను ఎదుర్కోమనే వారు. బహుశ అలా చేయించటం వలన మాకు దైర్యం వస్తుందని ఆయన ఆలోచన అయివుండవచ్చు. అపుడు మాకు తెలుసుకునే వయసు కాదు కదా. మేము పెద్ద వాళ్ళం అయ్యాక ప్రతి సంవత్సరం శివుడి గుడి లో ఉత్సవం సందర్భంగా అందరం వెళ్లే వాళ్లం. అపుడు మా వారు, మా అన్నయ్య లు కూడా మా పిల్లలని నాన్న గారి లాగా నే చాలా ఓపికగా స్నానము చేయించేవారు. అపుడు మేము మా నాన్న గారి.నీ తలచుకునే వాళ్ళం. అలా ఒక పది పదిహేను ఏళ్ళు వెళ్ళాము. ఇదంతా ఇపుడు ఎందుకు చెబుతున్నానంటే, ఇపుడు నేను మా అమ్మ గారిలా మా మనవళ్లు, మనవ రాళ్ళు సముద్ర స్నానము చేస్తుంటే భయ పడతూ వుంటాను. నేను సముద్రం లోకి వెళ్ళాలంటే నా వయసు సహకరించదు. ఆ ఒడ్డున నిలబడితే నాన్న గారు మమ్మల్ని సముద్ర స్నానము చేయిస్తున్నట్లు అనిపిస్తుంది. కాలేజీ లో చదివే రోజుల్లో అన్నయ్య వాళ్ళు ఫ్రెండ్స్ తో ఆదివారం తప్పకుండా వెళ్ళే వారు. మేము మాత్రము సాయంకాలం మాత్రమే వెళ్ళే వాళ్ళం. అలా ఆ సముద్రము మా జీవితము లో ఒక మధురమైన అనుభూతి గా మిగిలి పోయింది.

46 views0 comments

Recent Posts

See All

రథ సప్తమి జ్ఞాపకాలు

. కొంచెం పెద్ద వాళ్ళం అయ్యాక గడిచి పోయిన రోజులు గుర్తు వస్తూ ఉంటాయి చిన్నతనంలో చదువు తర్వాత పెళ్లి పిల్లలు, బాధ్యతలు జీవితము మనం ఆలోచించ...

అమ్మమ్మ అమెరికా యాత్ర 4

1995లో మా అమ్మాయి గ్రాడ్యుయేషన్ కి వెళ్ళాక 2006లో మా అమ్మాయి పురిటికి మరలా అమెరికా యాత్ర కు బయలుదేరాను ఈ 11 సంవత్సరాలలో చాలా మార్పులు...

అమ్మమ్మ అమెరికా యాత్ర 3

అలా మొదలైన నా యాత్ర బహుశ రెండు నెలలు వున్నాను అనుకుంటా అమెరికాలో. మా అమ్మాయి గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ బాగా అయింది. నేను వెళ్ళిన ఒక పది...

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page