నాన్న కు ప్రేమతో
- murthydeviv
- 4 days ago
- 3 min read
ఫాదర్స్ డే అని షరా మామూలుగా అందరూ పేపర్ లో, రెండు మూడు ఆర్టికల్స్ చాలా బాగా ఉన్నాయి. అందులో లెటర్ టు హిస్ ఫాదర్ అనే నవల రాసిన వారి గురించి రాశాడు. మా చిన్న తనంలో కూడా మా నాన్న గారి తో మాట్లాడాలంటే ఏదో బెరుకుగా వుండేది. ఆ రోజుల్లో ఎక్కువగా పిల్లలు అతి గారాబం చేయటం వుండేది కాదు. ఆదివారం ఉదయం మాకు చదువులు చెప్పే వారు ఎక్కువగా ఇంగ్లీష్ గ్రామర్, లెక్కలు చెప్తూ వుండేవారు. బిజినెస్ పనుల మీద ఊర్లు తిరుగుతూ ఉన్నా మా చదువుల గురించి బాగా కనుక్కుంటూ వుండే వారు. ఆరోజుల్లో నాన్న గారు ప్రతి విషయం ఇంగ్లీష్ లో రాయాలని ప్రోత్సాహం ఇవ్వడం వలన ఇప్పటికీ ఇంగ్లీషు లో మాట్లాడటం రాయడం చేయగలుగుతున్నాము. ఇప్పటికే నాన్న గారి గురించి చాలా ఆర్టికల్స్ లో రాశాను. వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకున్నామో తెలియదు కానీ, వాళ్ళ గురించి కొన్ని విషయాలు గుర్తు వస్తె మనసుకు ఆనందం కలుగుతుంది. రోజూ ఉదయాన్నే తప్పక అభిషేకం చేసే వారు ఇంక కార్తీక మాసంలో సోమవారం చాలా నిష్ఠగా ఉపవాసం ఉండి సాయంకాలం అభిషేకం చేసే వారు. ఆ పూజ కు కావలసిన కొన్ని ప్రత్యేక మైన పూలు మా అత్తయ్య గారి తోట లో ఆయనే తెచ్చుకునే వారు. ఆరోజు అభిషేకం అయ్యాక మేము అందరము హారతి కి మంత్రపుష్పం కు తప్పకుండా రావాలి. పూజ అయ్యాక ఇంట్లో అన్నయ్య స్నేహితులు ఇంకా ఎవరైనా ఉంటే అందర్నీ ఆప్యాయంగా భోజనం చేయడానికి పిలిచే వారు. ఒక కార్తీక సోమ వారం మా నాన్న గారు ఎవరో వస్తె ముందు రూమ్ లో కూర్చుని మాట్లాడుతూ ఉన్నారు. ఉదయం ఆయన పాలు తాగుతారు, నేను కాలేజ్ కి వెళ్ళే హడావిడి లో పాల గ్లాసు వచ్చిన వాళ్ళ కు కాఫీ ఇచ్చాను. మాట్లడుతూ కూడా ఈ రోజు సోమ వారం కదా అన్నారు నాకు గుర్తు లేదు కానీ ఆయనకు మాత్రం వాళ్ళ తో మాట్లాడుతూ వున్నా గుర్తు ఉంది నేను రాసే విషయాలు అన్నీ ఒక 50,60 ఏళ్ల క్రితం విశేషాలు ఆరోజులకు ఇప్పటికీ ఎంతో మార్పులు వచ్చాయి నాన్న గారికి ఆడపిల్లలు కూడా బాగా చదువుకుని ఉద్యోగం చేయడం ఇష్టం వుండేది. అందువల్లే మేమూ ఆ రోజుల్లోనే గ్రాడ్యుయేట్ కాగలిగాము. ఆయనకు ఏ సందర్భంలో అయినా పానిక్ అవకుండా సిట్యుయేషన్ నీ ఫేస్ చేయగలిగే వారు అనుకుంటా. వాచ్ మెన్ వున్నా రోజూ రాత్రి పూటఒక రౌండ్ ఇంటి చుట్టూ తిరిగే వారు ఒక రోజు ఒక దొంగ ఆయన్ని చూసి గోడ దూకి పారిపోయాడు నాన్న గారు కూడా అలాగే గోడ దూకి పరిగెత్తి వాడిని పట్టుకున్నారు. అప్పటి కి ఆయన వయసు దరిదాపుల్లో 50ఏళ్లు వుండవచ్చు. ఆ వయసులో నాన్న గారు అలా చేయడం ఆయన ధైర్యం కు ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కి ఇలాంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆరోజుల్లో పెళ్లి మండపం కు ట్యూబ్ లైట్స్ పెట్టే వారు మా ఇంట్లో కూడా అలాగే ఒక పెళ్ళి లో పెట్టారు పెళ్ళి అంతా అయ్యాక ఎవరో ఒకావిడ ఆ లైట్ పట్టుకుంది వెంటనే షాక్ తగిలి అరవటం మొదలు పెట్టింది. వెంటనే మా నాన్నగారు అక్కడ పీట తీసి ఆవిడ చేతి మీద కొట్టారు. ఆరోజు ఆయన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ తలచుకుంటే ఇప్పుడు కూడా వళ్ళు జలదరిస్తుంది ఎంత ప్రమాదం తప్పించారు అని. ఎంత బిజీగా ఉన్నా గ్రాండ్ చిల్డ్రన్ ను ఎంతో ప్రేమ గా చూసే వారు. ఇప్పటికీ మా కజిన్స్ అందరము కలిస్తే ఆ కబుర్లు చెప్పుకుంటూ ఉంటాము. మేము మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కొంచెము విసుగు చూపించినా మాకు మా నాన్న గారి తో చివాట్లు తప్పవు. ఆ రోజుల్లో వాళ్ళు ప్రేమ అభిమానం గురించి ఎంత చెప్పినా తక్కువగా ఉంటుంది. ఆ రోజుల్లో వాళ్లకి ఇంట్లో వున్న అందరూ సమానమే, అందరికీ ఆ ప్రేమ, ఆప్యాయత లు సమానంగా లభించేవి. వాటి గురించి ఇప్పటి వాళ్ళ కు చెప్పినా అర్థం అవుతుందో లేదో తెలియదు. మా నాన్న గారి డిసిప్లిన్ గురించి చాలా సార్లు రాసాను ఈ రోజు ఫాదర్స్ డే సందర్భంగా ఆయన తో గడిపిన రోజుల్లో నీ కొన్ని విశేషాలు తలచుకుని ఆనందించటమే నా ఉద్దేశంతో ఇవి రాస్తున్నాను. ఆయన చాలా సింపుల్ లైఫ్ గడిపే వారు. గాంధీ గారి నీ ఫాలో అయ్యే వారు అనుకుంటా, ఎక్కువ ఖద్దరు బట్టలు వేసుకునే వారు. మమ్మల్ని కూడా అలాగే ఉండమనే వారు. నేను ఢిల్లీ లో ఉండగా మా పాప బాగా అల్లరి చేస్తోంది అని మా అమ్మ కు ఉత్తరం రాస్తే, మా నాన్న గారు జవాబు రాసారు. పిల్లలు అల్లరి చేయడం చూసి మనం ఆనందించాలని, మీరు కూడా చిన్న తనంలో అల్లరి చేసారు, మేము ఆ అల్లరి నీ చూసి ఆనందం పొందామని రాసారు. ఎక్కువగా మాట్లాడని నాన్న గారు అలా రాసిన వుత్తరం చూసి నేను చాలా ఆశర్యం పడ్డాను నాన్న గారికి ఆడపిల్లలు బాగా చదువుకుని ఉద్యోగం చేయడం చాలా ఇష్టం వుండేది. ఇప్పుడు ఆయన మనవరాళ్లు అందరూ బాగా చదువుకుని ఉద్యోగం చేయడం చూసి చాలా సంతోషించే వారు, అనుకుంటాను. ఆయన చాలా చిన్న వయసులో నే పోయారు. మనం ఎంత పెద్ద వాళ్ళం అయినా తల్లితండ్రులు మాటలు, వాళ్ళు మనకు నేర్పించిన సంస్కారం మర్చిపోలేము కదా. మా నాన్న గారు సముద్ర స్నానం కి ఎపుడూ తీసుకుని వెళ్ళే వారు. అల లకు భయ పడకుండా ఒక పక్క గా నిలిచి ఎదుర్కోవాలి అని చెప్పే వారు. అలాగే జీవితంలో ఎదురయ్యే అల లకు కూడా ఎదుర్కోవడానికి తగిన ధైర్యం ఇవ్వాలని నాన్న గారి నీ ప్రార్థిస్తూ, ఆయన ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ నాన్న గారి కి ప్రేమతో.
Comments