top of page
Search

నేను నా కుక్ రాణులు

  • murthydeviv
  • Jun 13
  • 3 min read

ఇదేదో రాణుల కథ అనుకునేరు భానుమతి అత్తగారు వంట వాళ్ళు అని కథ రాసారు కానీ ఆ రోజులకు ఇప్పటికీ చాలా తేడా వున్నది. చిన్నప్పుడు మా ఇంట్లో కూడా వంట వాళ్ళు వుండే వారు . మరీ చిన్నతనంలో ఇంట్లో ఉన్న బామ్మ లకు వాళ్ళ కు మనకు తేడా తెలిసేదికాదు. ఎందుకంటే ఆడుకుంటూ మడి చీరెలు ముట్టుకున్నా ము అనో, కంచం తీసే టపుడు మెతుకులు సరిగ్గా ఎత్త లేదనో మన బామ్మల తో పాటు వాళ్ళు కూడా మనల్ని అదిలిస్తూ వుండే వాళ్ళు బామ్మ లాగానే ఆప్యాయత కూడా చూపే వారు . కొంచెం పెద్ద అయ్యాక గానీ ఆ తేడా తెలిసేదికాదు. వంట వాళ్లు అని రాస్తే వాళ్లకు కోపం వస్తుంది. ఈ రోజుల్లో మన అవసరం బట్టి వాళ్ళని రాణులు లాగానే చూడాలి. మేము నార్త్ ఇండియా నుండి హైదరాబాద్ రాగానే వంట త్వరగా, ఈజీ చేయటానికి కావల్సిన మిక్సీలు గ్యాస్ లు అన్నీ కొనేసుకుని ఆహా నేను కూడా ఏదయినా కళ లు నేర్చుకోవడం లేక కలగా వున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ అవ్వాలని ఊహ ల్లో విహరించాను. మా వారు ఒక విషయం లో నిష్ణాతులు. ఉదయాన్నే పేపర్ పొలిటికల్ హడావుడి అయ్యాక , ప్లాన్ అంతా చేసుకుని ఏ 11గంటల కు ఆఫీసు చేరే వారు అక్కడ కొత్త గా చేరిన బ్యాచిలర్ ఇంజినీర్స్ ముగ్గురు వుండే వాళ్ళు. ఆరోజుల్లో అక్కడ ఎక్కువగా హోటల్స్ వుండేవి కాదు . వీళ్ళ డిస్కషన్ అయ్యాక ఇంక a హోటల్ లో లంచ్ వుండదు. ఇంటికి రండి లంచ్ కి అంటూ వచ్చే వాళ్ళు. ఇంక సాయంత్రం అయ్యే టప్పటికీ ఊర్లో వున్న అన్నయ్యలు వాళ్ళ బ్రహ్మచారి ఫ్రెండ్స్ అంతా వేంచే సే వారు మొదట్లో కొంచెము కూరలు అవీ చేసి హడావిడి పడే దాన్ని కానీ,, వాళ్ళు కు ఊరగాయలు, కంది పచ్చడి అలాంటి ఉంటే చాలు అనే జ్ఞానం కలిగింది. నార్త్ ఇండియా లో లాగా ఆదివారం వస్తూ నే ఏదో పండుగ లాగా ఇల్లు కళ కళ లాడుతూ ఉండేది.. పాపము మా పెద్దమ్మ నా బాధ చూసి ఒక వంట మనిషి ని పంపింది. ఆ రోజు నుండి ఈ రోజు దాకా ఎంత మంది కుక్ రాణులు తో ఎంతో అనుభవం సంపాదించి ఇంతమంది తో అడ్జెస్ట్ అవుతూ అహా ఏమీ నా భాగ్యము అనుకుంటాను. పెద్దమ్మ పంపిన తెలంగాణ వంట రాణి జ ర దా నమిలే అలవాటు వుండేది. ఉదయాన్నే వంట చేసిందంటే ఇంక మరలా సాయంత్రం దాకా వంటిటి మొహం చూసేది కాదు. ఎవరన్నా వచ్చారు అంటే నాకు జ్వరం అంటూ పడుకునేది. ఒక మూడు నెలల కల్లా మా ఇంట్లో హడావిడి కి పారి పోయింది. మా పెద్దమ్మ పట్టు వదలని విక్రమార్కుడి లాగా ఈ సారి మన ఆంధ్ర అవిడ ను పంపింది. ఆవిడ కుటుంబానికి అవుట్ హౌస్ ఇచ్చి వాళ్ళ అబ్బాయి కి ఉద్యోగం ఇచ్చి చాలా ఆనందంగా ఆహ్వానం పలికాను. అయితే అవిడ కు ఈ ఉద్యోగం కొత్త ఏదో కొంచెము వంట చేయడం వచ్చు అంటూ అసలు నిజం చెప్పింది. కానీ మా మూడు నెలల బాబు ను ఎత్తుకుని తిప్పుతూ వుండేది. నేనూ మా అత్త గారు వంట చేసుకుంటూ మధ్య మద్యలో ఆవిడకు తెలిసిన పనులు చెప్తూ వుండే వాళ్ళం. కానీ అవిడ మాత్రం చాలా మర్యాద గా వుండేది. మాఇంట్లో మానుకున్నా తర్వాత బాగా వంటలు నేర్చుకుని ఫంక్షన్ కు వంటలు చేస్తూ వుండేది . ఎంత మంది వంట వాళ్ళు వచ్చినా మా ఇంట్లో హడావిడి కి ఒక రెండు నెలలు చేసి వెళ్ళి పోయే వారు. ఇంక మా అత్త గారు పెద్ద వారు అయ్యాక కొంచెము ఆవిడ కు తోడు గా వుంటారు, అనే ఐడియా తో మరలా వంట వాళ్ళ ను మొదలు పెట్టాను. ఇంక అప్పటికి టీవీ సీరియల్స్, సినిమాలు మొదలు అయ్యాయి. వాళ్ళకు ఇంక అదే లోకము వంట అయింది అంటే టీవీ పెట్టాల్సిందే. ఆ కధ లు మా అత్త గారి కి చెప్తూ వుండేవారు. ఇంకొక ఆవిడ టివి సీరియల్, పాత సినిమాలు కాకుండా క్రికెట్ మ్యాచ్ లు కూడా చూసేది . ఆవిడ పాపం ఆ క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఎంత ఇన్వాల్వ్ అయ్యేది అంటే చప్పట్లు తో మోగి పోయేది. ఇంకొక ఆవిడ కు సాయంత్రం ఏడు గంటలకు వచ్చే ఈ టీవీ పాత సినిమా చూడక పోతే నిద్ర పట్ట దు ట . ఆవిడ కోసం యింకో టీవీ పెట్టించాను. అలా ఆ మహా రాణులు తో అడ్జస్ట్ అయి అయి, ఇంక ఇప్పుడు ఉదయాన్నే వచ్చి వంట చేసి వెళ్ళి పోయే వాళ్ళని పెట్టుకున్నాను. ఏదో కొంచెము వాళ్ళ ఎక్స్ట్రీమ్ అలవాట్లు భరించ అక్కరలేదు అనుకుంటాను. నిన్న నే వంకాయ పచ్చడి చెయ్యమని చెప్పిందట మా కోడలు,, ఆవిడ వెళ్ళాక మూత తీసి చూస్తే ఏదో పేస్ట్ ఉంది. ఈ రోజు అడిగితే అది ఎంతకీ కాలలేదు అందుకుని మిక్సి లో వేసాను అన్నది అట్టుంటుంది మన తోటి అని అదేదో సినిమా లో చెప్పినట్లుగా. మా బావ గారు అయితే మిక్సి లో వేసిన పచ్చడి అసలు తినే వారు కాదు. అలా వాళ్ళ ఎక్స్ట్రీమ్ అలవాట్లు భరించిన అందుకు మనకు మనం పద్మశ్రీ అవార్డులు ఇచ్చుకోవాలి ఇంకా చాలా ఉన్నాయి కానీ మీకూ బోర్ కొట్టేస్తుంది సో goodnight

 
 
 

Recent Posts

See All
నాన్న కు ప్రేమతో

ఫాదర్స్ డే అని షరా మామూలుగా అందరూ పేపర్ లో, రెండు మూడు ఆర్టికల్స్ చాలా బాగా ఉన్నాయి. అందులో లెటర్ టు హిస్ ఫాదర్ అనే నవల రాసిన వారి...

 
 
 
కిచెన్ క్వీన్స్

నిన్నటి విషయం కే ఇంకొచెం రాద్దాం అని అంత ఈ వంట వాళ్ళు గురించి రాయటానికి అని అందరూ అనుకుంటారేమో. నాకు అదే కాలం అలాగే సూర్య చంద్రులు...

 
 
 
కిచెన్ క్వీన్స్

నిన్న కొందరు కిచెన్ క్వీన్స్ గురించి చెప్పా కదా మీకూ బోర్ కొట్టేస్తుంది అని ఆపేశాను. కొందరిని ఒక నెల భరించి అబ్బా ఏదో ఓపిక వున్నట్లు...

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page