top of page
Search

కిచెన్ క్వీన్స్

  • murthydeviv
  • Jun 14
  • 2 min read

నిన్నటి విషయం కే ఇంకొచెం రాద్దాం అని అంత ఈ వంట వాళ్ళు గురించి రాయటానికి అని అందరూ అనుకుంటారేమో. నాకు అదే కాలం అలాగే సూర్య చంద్రులు తిరుగుతూ ఉన్నారు. కానీ మనుషుల్లో మా చిన్నతనం లో చూసిన జీవన విధానం కి ఇప్పటికీ తేడా చూస్తే చాలా ఆశర్యం వేస్తూ ఉంటుంది. అప్పటి కన్నా బోలెడు మోడర్న్ గాడ్జెట్ ఉన్నాయి. అయినా బయటికి వెళితే ఎన్నో హోటల్స్ కిటకిట లాడుతూ ఉంటాయి. ఇంక స్వగృహ ఫుడ్ షాపులు పండుగ ముందు రోజు వెళ్ళితే అసలు ఎంటర్ అవలేము. ఎవరైనా ఇంట్లో వంట చేస్తున్నారా అనిపిస్తుంది. ఏదో పెద్దవాళ్ళు పిల్లలు దగ్గర లేకపోతే క్యారేజ్ తెప్పించుకోవటం వేరు. ఇపుడు ప్రతి వాళ్ళు Swiggy లు ఆర్డర్ చేయడం. వంట చేయడం అంటే ఏదో చాలా వేస్ట్ ఆఫ్ టైమ్ అనే ఐడియా కు వచ్చారేమో అనుకుంటాను. పూర్వం రోజుల్లో పొయ్యి మీద వంట చేసినా రోజూ ఆ పొయ్యి నీ కొంచెము అలికి ముగ్గు వేసుకుని అదొక పూజ లాగా చేసే వారు. మా అమ్మమ్మ గారింట్లో వంట ఆవిడ మేము సెలవులు కు వెళితే చాలా ప్రేమగా రకాలుగా వంటలు చేసి పెట్టేది. ఇంక మా అత్తయ్య గారి ఇంట్లో వంట వాడు వుండే వాడు. ఆల్మోస్ట్ రోజూ ఒక పదిహేను మందికి రోజూ ఉదయాన్నే రక రకాలుగా బ్రేక్ ఫాస్ట్ చేసే వాడు. అతను చేసిన రవ్వ దోశలు ఇప్పటికీ నేను ఏ హోటల్ లోనూ తినలేదు. అత్తయ్య ఎవరిని లంచ్ కి పిలిచినా బంగాళ దుంప చిప్స్ చేయించేది. ఉదయాన్నే మాకు దోశలు పోసి మధ్యాహ్నం ఇంతమందికి మరలా చిప్స్ ఎలా చేసే వాడో అని ఇప్పుడు తలచుకుంటే ఆశర్యం వేస్తుంది. ఎక్కువ సీరియస్ గా ఉండే వాడు. మేము అతన్ని చూసి కొంచె భయ పడేవాళ్ళం. ఇపుడు మా వంట వాళ్ళని ఉదయం దోశలు పోయామని అడగాలీ అంటే భయం.😀 ఒకసారి మా ఇంట్లో మా బాబాయి గారి వంటా వీడ మద్రాస్ నుంచి వాళ్ళ తో మా ఊరు వచ్చింది మా మీ అనే వాళ్ళు. ఆవిడ దగ్గర మా అమ్మ గారు తమిళ్ వంటలు నేర్చుకున్నది కూ టు, సాంబార్ పొడి,, ఇంకా చియ్య లీ అని పెసర పప్పు తో ఇడ్లీ లాగా చేసి స్నాక్ చేయడం నేర్చుకున్నది. ఇవ్వన్నీ రాయటం లో నా ఐడియా మనుషులు మధ్య ఆ రోజుల్లో అనుబంధం అలా ఉండేది. చివరగా మా అమ్మ గారి దగ్గర పని చేసిన వంటా విడ మా అమ్మ కు చేదోడు గా వుండేది. ఈ రోజుల్లో సొంత వాళ్ళ తోనే అనుబంధం ఉండటం లేదు ఇంక పని వాళ్ళ తో ఏముంటుంది. మధ్య మద్యలో ఎక్కడో ఒకళ్ళు ఉంటారు. ఈ మధ్య నే ఒక ఐదు ఏళ్ళ క్రితం పని చేసిన అమ్మాయి వచ్చి చూసి వెళ్ళింది. అలాంటి వాళ్ళ ను చూస్తే పరవాలేదు ఇంకా అనుబంధాలు ఉన్నాయి అనిపిస్తుంది. దగ్గర ఉంటే నే ప్రేమ అనే వాళ్లు వుంటారు. భాధ్యత లు తీసుకుని చేయని వాళ్ళ ప్రేమ నాకు నచ్చదు.

 
 
 

Recent Posts

See All
అమ్మ తో ప్రయాణాలు

ఈ మధ్య అనుకోకుండా వంటరిగా చెన్నై వెళ్ళాల్సి వచ్చింది. మా వారితో సాహస యాత్రలు చేయడం అలవాటు అయిన మా పిల్లలు కు, నాకూ అలా వంటరిగా...

 
 
 
మసాలా దోశ

ఈ రోజే మా కజిన్ ఫోన్ చేసి మీ ఊరులో మీ స్కూల్ ఎదురుగా ఉన్న హోటల్ పెట్టి 100ఇయర్స్ అయిందట మేము అందరం అక్కడ వాళ్ళు పెట్టిన స్పెషల్ మసాలా దోశ...

 
 
 
ఫ్యామిలీ డాక్టర్

తరుచుగా ఫేస్ బుక్ లో ఒక డాక్టర్ గారు చాలా బాగా పోస్ట్ లు రాస్తూ వుంటారు. ఈ రోజు పోస్ట్ చదువు తుంటే మా చిన్న తనం లో మా ఫ్యామిలీ డాక్టర్...

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page