top of page
Search

తులసి పాట

  • murthydeviv
  • 2 minutes ago
  • 1 min read

ఉదయం గంగ రాజు గారి వీర తాడు లో జలంధరుడు

చూసాక నాకు మా అత్తగారు తులసి చెట్టుకు నీళ్లు పోసి దీపం పెట్టి

ఒక పాట పాడుతూ ఉండేవారు. అది గుర్తు వచ్చింది.


ఆవిడ ఏకాదశి నాడు కూడా గీతా సారం అంటూ పాడే వారు అదీ నాకు పూర్తిగా రాలేదు కానీ , లక్ష్మీ అశ్టోత్తరం శ్లోకం లాగా చెప్పేవారు.


నారాయణ కవచం కూడా నోటికి బాగా వచ్చేది. నాకు నారాయణ కవచం విని విని వచ్చినా పుస్తకం లేకుండా చదవను. లక్ష్మీ అష్టోత్తరం, ఈ తులసి పాట

మాత్రం , ఆవిడ తర్వాత నేను దీపం పెట్టి చదువుతాను.


ఈ పాటలు ఏ పుస్తకాల్లో వుండవు. గీతా సారం కొంతే జ్ఞాపకం ఉంది.

అయ్యో రాసుకోలేదే అని ఇప్పుడు అనుకుంటాను.


ఈ తులసి పాట చాలా చిన్నదే కథ అంతా ఇమిడ్చారు .ఈ పాట మీ కోసము


వేద శాస్త్రముల వెలిసిన తులసి పూజింతు మమ్మా నిన్ను సువర్ణ పుష్పముల తోడ


నిను గన్న క్షిరాబ్ది నీకు పుట్టిల్లు , అత్తిళ్లు అల వైఖుంట పురము


రావమ్మా శ్రీ తులసి రాజీవ నేత్రి నీ వున్న ఇంటను సిరులు


సౌభ్యాగములు, నిను పూజించిన అతివలకు మాంగళ్య శోభలు


శ్రీ తులసి జయ తులసి , శ్రీ కృష్ణ తులసి


అల నాడు శ్రీ విష్ణు మూర్తి నీ పతిని సంహరించగను


శిలవి కమ్మని నీవు శాప మీవ్వగాను , అతివరో నీ పతి


క్రూ రుడు అయినాడు , మానవుల, దేవతలు దుడి మానినాడు


నీ సౌభాగ్యమునకు ఏ నాడు కొరత యే రాదు.


భూలోకమందు వృక్ష మై వెలసి కోరిన వారి కోర్కెలు తీర్తువు.


గండకి నది యందు సాలగ్రామ ము నై నీతోడి నేను ను


పూజలు అందే ను అని విష్ణు మూర్తి వరములు ఇవ్వగాను


మా ఇంట వెలిసేవు మమ్ము దీవించేవు .


కార్తీక శుద్ద ద్వాదశి నాడు నీదు కళ్యాణము మొనరించిన


నిఖిల సంపదలు శ్రీ తులసి జయ తులసి శ్రీ కృష్ణ తులసి


గోలోకమందు శ్రీ కృష్ణు గూడి అతివ లందరికి సౌభాగ్యమిచ్చేవు


మా ఇంటి కోట లో వెలసిన తులసి పసుపు , పారాణి , కుంకుమ తో

పూజలు చేసేను.


మల్లెలు, జాజులు, మంచి సంపెంగలు తో నీకు మాల వేసేను.


మా కు సౌభాగ్యమిచ్చి , పుత్రుల , పౌత్రుల దీవింపవమ్మా


శ్రీ తులసి జయ తులసి శ్రీ కృష్ణ తులసి

 
 
 

Recent Posts

See All
స్లో కుకింగ్

వారణాసి సుధాకర్ గారి పోస్ట్ కుంపటి ని, పొట్టు పొయ్యిని గుర్తు చేస్తే , ఈ రోజు జగదీష్ గారి పోస్ట్ పచ్చి జీడిపప్పు లు గుర్తు చేసింది. ఆ రోజుల్లో పొయ్యి, కుంపట్లు మీద వంట నిదానంగా అయినా

 
 
 
మధుర గీతాలు సురయ్యా, నూర్జాహన్

దూర్ దర్శన్ వచ్చిన కొత్తలో శనివారం పాత హిందీ సినిమాలు వేస్తూ వుండే వారు. ఆలా చూసిన సినిమాల్లో మీర్జా గాలిబ్ ,రుస్తుం సోహెరాబ్ అనే ఇంకా శాంతా రామ్ గారి సినిమాలు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు

 
 
 
ఆవకాయ 2

అబ్బా ఈ రోజుతో అవకాయ రుచులు చూసి, చూసి ఇంక అన్నీ సరిపోయి నేలే అనుకుంటూ జాడిల్లోకి ఎత్తి అమ్మయ్య ఇంక ఈ ఏడాదికి అవకాయ పని అయిపోయింది అనీ ఊపిరి పీల్చుకున్నాను. ఇంక అందరికి రుచి కోసం పంపే

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page