జాతీయ పుస్తక పఠనా దినోత్సవం
- murthydeviv
- 3 minutes ago
- 2 min read
పైన హెడ్డింగ్ చూసారుగా, ఈ రోజుల్లో రోజూ ఏదో ఒక దినోత్సవం అనీ ఇటు వాట్సాప్ లో అటూ ఫేస్ బుక్ లో ఏవో పోస్ట్స్ వస్తుంది వుంటాయి.
అవీ చూసేసరికి మనం కూడా ఈ దినోత్సవం సెలెబ్రేట్ చేసుకుందాం ఆనుకున్నాను.
జనరల్ గా ఎప్పుడూ పుస్తకాలు చదివే వాళ్లను , పుస్తకాల పురుగు అనో, ఎప్పుడూ ఆ బుక్స్ నముల్తు ఉంటాడు అనో
కామెంట్ చేసే వారు.
అవేమి చిరుతిండి కాదు గా నముల్తూ ఉండటానికి, కానీ అదీ ఒక వ్యసనం అనవచ్చు ఏమో, కానీ పుస్తకం
చదవటం అనే పవిత్రమైన పనిని వ్యసనం అనటం అంతగా నచ్చటం లేదు .
అదీ ఒక అలవాటు మంచి అలవాటు అనుకుంటాను నేను. ఆ మధ్య మా అమ్మాయి నా బుక్ క్లబ్ మెంబెర్స్ తో మీ యింటికి వస్తున్నాము, నిన్ను కలుస్తారుట అన్నది. ఆందరికీ మన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే వుంటాయి.
రాగానే ఏవో స్నాక్స్ టీ లు ఇచ్చాము. వాళ్ళు అపుడే ఏదో హోటల్ నుంచీ వస్తున్నారుట, సో ఒక్క టీ నే తీసుకున్నారు.
వాళ్ళు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఏదో హోటల్ కలుసుకుని వాళ్ళు చదివిన బుక్ గురించి డిస్కషన్
చేసుకుంటారుట.
ఇదేదో కొత్త రకం కిట్టి లాగా వుంది అనుకున్నాను. సరే పైకి వెళ్లి లైబ్రరీ చూస్తాము అంటూ వెళ్లారు..
నేను ముందే మా అమ్మాయికి చెప్పి వుంచాను , ఏదయినా బుక్ తీసుకుని వెళ్ళితే నోట్ చేసుకొని
ఫోన్ నెంబర్ నాకు ఇవ్వు అనీ
నా బుక్స్ ఏవైయినా మిస్ అయితే నాకు చాలా బాధ గా వుంటుంది.
లైబ్రరీ చూసాక నాకు ఇంగ్లీష్ వచ్చు అనీ బుక్స్ బాగా చదువుతాను అనీ అర్థం అయి కాసేపు ఆ ఇంగ్లీష్ నవలలు
సినిమాలు గా వచ్చిన బుక్స్ గురించి కబుర్లు చెప్పి వెళ్లారు.
కాలేజీ డేస్ లో ఫ్రైండ్స్ తో నవలలు గురించి , సినిమాలు గురించి కబుర్లు ఉండేవి. ఇలా బుక్ క్లబ్ అనేది ఇప్పుడే వింటున్నాను. మంచి పుస్తకం మే ఒక స్నేహితుడు లాంటిది అనుకుంటాను నేను.
సరే ఈ రోజుల్లో ఎన్నో మార్పులు చూస్తూ వున్నాము. ఇదీ ఒక కొత్త ట్రెండ్ అనుకున్నాను.
ఒక శిష్యుడు గురువు దగ్గరికి వెళ్లి నేను చాలా పుస్తకాలు చదివాను, ఏమీ గుర్తు ఉండటం లేదు ఇంక చదివి ఉపయోగం ఏమిటీ అనీ అడిగాడుట.
ఒక మంచి పుస్తకం చదినప్పుడు సరి కొత్త ఆలోచనలు వస్తాయి. రక రకాల అనుభూతులు, ఉద్వే గాలు,
అప్పటి వరకు తెలియని కొన్ని నిజాలు తెలుస్తాయి. అవీ మనసుని శుద్ధి చేసి కొత్త కోణం లో కూడా ఆలోచింప చేస్తాయి.
ఆలా మనకు మనమే కొత్త జన్మ ఎత్తినట్లు వుంటుంది అనీ చేప్పారుట ఆ గురువుగారు.
గారి పాలి సన్ అనే అమెరికన్ రచయిత వై డూ ఐ రీడ్ అనే కవిత రాశారుట..
ఆయన మాటల్లో "" చదవకుండా ఉండలేక చదువుతాను . స్ఫూర్తి పొంద టానికి, తెలియని విషయాలు తెలుసుకోడానికి
చదువుతాను.
మాట్లాడటానికి ఏమీ లేనప్పుడు చదువుతాను. పదాల కోసం అవీ చెప్పే భావం కోసం చదువుతాను.
కథ చదివితే అందులో ఒక పాత్ర నై , మిగతా పాత్రలతో కలిసి నవ్వుతూ , బాధ పంచుకుంటూ
కధ లో లీనమవుతాను.
చదవటం అంటే స్నేహితులు తో సమయం గడుపుతూ వున్నట్లు. ఎంత మంది ఐనా స్నేహితులు ఉండచ్చు.
అలాగే ఎన్ని పుస్తకాలు అయినా చదవచ్చు.
అదీ ఆయన కవిత
పుస్తకం హస్త భూషణం లాగా కాకుండా చదువుతూ ఉంటే వచ్చే ఆనందం వేరు.
మీకు చదివే అలవాటు వుండే వుంటుంది, అందువల్లే ఈ బ్లాగ్ చదువుతున్నారు కదా. రోజూ మొత్తం లో క్వాలిటీ టైమ్ అంటే నాకు మాత్రం పుస్తకం చదువుకోవటమే .
చదవటానికి వీలు కానీ రోజు పడుకున్న తర్వాత ఫోన్ లో అయినా ఏదో చిన్న టాపిక్ చదువుతాను.
మా పిల్లలు వేకెషన్ అంటూ ఏదో రిసార్ట్ కి రమ్మంటే మా వారు అక్కడ వెళ్లి ఈ చేస్తాము , మనం నడవ లేము కదా అంటారు. నేను మాత్రం ఏ డిస్టబ్రెన్స్ లేకుండా మంచి పాటలు వింటూ మంచి పుస్తకం చదువుకోవచ్చు అంటాను.
ఎక్కడికి వెళ్లినా మీకు న్యూస్ కదా , మీరు డిస్టర్బ్ అవకుండా చూడచ్చు అంటాను మరి నిజం కదా . మగ వాళ్ళు కు న్యూస్ కన్నా పవిత్రమైన కార్యక్రమం ఏముంటుంది .
సో అవీ పుస్తక పఠన దినోత్సవ కబుర్లు రేపో ఎల్లుండో ఫాదర్స్ డే కూడా వుంది అనుకుంటాను.
మంచి పుస్తకం మీ నేస్తం అవ్వాలని కోరుతూ శుభ రాత్రి
Comments