ఆవకాయ యజ్ఞం
- murthydeviv
- 1 minute ago
- 3 min read
వేసవి రాగానే ముందు ఈ ఎండలు భరించిటం ఒక యజ్ఞం అయితే , ఈ ఎండల్లో నే ఆవకాయ పెట్ట టం
రెండో యజ్ఞం. ఎన్నో ఏళ్ల నుంచీ ఆవకాయ పెడుతున్నా ఎప్పటి కప్పుడు ఏదో టెన్షన్ కుదురుతుందో లేదో అనీ,
ఏమిటో వయసు తో పాటు ఎంత జ్ఞానం సంపా దించినా ఏదయినా చేసినప్పడు అందరూ బాగుంది
ఆంటే ఆనందం, బాగు లేదంటే కొంచెం బాధ వచ్చేస్తాయి..
కాయల కోసం హైదరాబాద్ లో వున్న మొత్తం మార్కెట్లు తిరిగి తిరిగి ఎంతో అనుభవం సంపాందించి
గ్రహించిన విషయం ఏమిటంటే ఆ మార్కెట్ లో ఆ కాయలు అమ్మే వాళ్లతో మాట్లాడి మనం గెలవడం కష్టం అనీ..
వాళ్ల మార్కెట్ టెక్నిక్ ముందు ఎవరూ పనికి రారు. వాడు ముందు చూపించే కాయ చాలా పులుపు వుంటుంది.
ఇచ్చే కాయల్లో మాత్రం పులుపు ఉండదు.
మనం కాయ రుచి చూసి డిసైడ్ చేసుకునే లోపలే మాటల మంత్రికుడి లాగా కాయలు లెక్క పెట్టి వేసేసి
కాయలు కట్ చేసే వాడికి ఇచ్చేస్తాడు .
మనం కాయలు కట్ చేయించుకుంటూ ఉంటే కాయల కోసం వచ్చిన వాళ్లకు ఈ అమ్మగారు ఎప్పుడూ
నా దగ్గరే తీసుకుంటారు , వంద కాయలు అంటూ మనల్ని వాడి మార్కెటింగ్ కి ఉపయోగించుకుంటాడు.
ఈ ఏడాది నేను ఇంకా కాయల వాడికి ఫోన్ చేద్దాం అనుకుంటూ ఉండగానే , ఫ్యాక్టరీ లో కాయలు బాగా వచ్చాయి,
నేను కోసుకుని వస్తాను అంటూ మా అమ్మాయి డ్రైవర్ శుభవార్త చెప్పాడు.
ప్రతి ఏడాది కాయలు గురించి అడిగితే వర్కర్స్ కోసుకుంటారులే , నీవు కొనుక్కో అని మా అమ్మాయి
అంటుంది. . ఈ సారి బాగా కాసాయి అనీ డ్రైవర్ తెచ్చాడు.
ఫ్యాక్టరీ లో బాగా ఖాళీ స్థలము ఉండటం తో మా అమ్మ గారు , మా పెద్దమ్మ ఎక్కడ
ఏ పూల చెట్లు, సంపెంగ మల్లెలు కనిపించినా మొక్కలు తెచ్చి ఇచ్చే వారు.
మామిడి, జామ, సపోటా కొబ్బరి ఇలా చాలా చెట్లు వేయించారు.. మిగతా వాటి కాయలు, పండ్లు ఇంటి దాకా రాకపోయినా , ఈ మామిడి కాయలు మాత్రం
ప్రతి ఏడాది ఏవో కొన్ని వస్తాయి.
కాయలు కోసుకొని వచ్చాడు కదా అనీ , మర్యాద గా డ్రైవర్ ని, అపుడే వచ్చిన మా చిన్న అమ్మాయి డ్రైవర్ ని
కొన్ని కాయలు తీసుకోమన్నాను
ఎందుకమ్మా మీరు పెట్టే ఆవకాయ బాగుంటుంది, మాపిల్లలు కూడా మీరు ఇచ్చిందే బాగుంది అంటారు
అంటూ నాలుగు రోజుల తర్వాత డబ్బాలు కొనుక్కొస్తా ము అన్నారు ఏక కంఠం తో
పొగడ్త కి పడిపోని వాళ్ళు ఎవరు వుంటారు.
సరే కాయలు చిన్నగా వున్నా పులుపు బాగానే వుంది . డ్రైవర్ వెళ్లి కాయలు కొట్టించుకుని తెచ్చాడు..
ఈ హైదరాబాద్ వచ్చాక ఎన్నో సార్లు ఆవకాయ కారాలు, అవపిండి ఇవ్వన్నీ రీసెర్చ్ చేసి చివరకు
ఒక షాపు కు పెర్మనెంట్ కస్టమర్ ని అయ్యాను.
ఈ రోజుల్లో ప్రతి షాపులో అవపిండి అవీ దొరుకుతుంటే పర్టికులర్ షాపు ఎందుకూ అనుకుంటారేమku
మాకు జరిగిన ఒక ఏడాది ఎక్స్పీరియన్స్ తో ఇలా డిసైడ్ అవాల్సి వచ్చింది.
ఒక ఏడాది నేను మా వదిన నల్లకుంట లో కాయలు తీసుకుని అక్కడే ఏదో షాపులో
అవపిండి కారాలు అవీ తీసుకున్నాము.
నూనె లో లోపమో, అవపిండి లో పమో తెలియదు కానీ ఆవకాయ ఒకటే మట్టి కంపు
ఎప్పుడూ ఇద్దరం కలిసి పెట్టే వాళ్ళము రెండు ఇళ్లలో ఆవకాయ అదే కంపు
అందుకే ఇప్పుడు ఒకే షాపు లో ఈ కారాలు అవీ తీసుకుంటాను . అతను వరంగల్ కారం , గుంటూరు కారం రెండూ
విడిగా ఇస్తాడు. అవపిండి కూడా వాళ్లే తయారు చేస్తారు.
హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో బేగం బజార్ అనుకుంటా అంత గుర్తు లేదు, స్వస్టిక్ కారం, అవపిండి కోసం జనం క్యూ లు కట్టి వుండే వాళ్ళు
ఇప్పుడు అంత ఓపిక లేదు , ఆ స్వస్తిక్ షాపు వుందో లేదో కూడా తెలియదు.
ట్రాఫిక్ బాగా పెరిగి షాపు కి కారులో కష్టం ఆటో లో డ్రైవర్ ని పంపుదాం అనీ షాపుకి ఫోన్ చేస్తే
లిస్ట్ వాట్సాప్ చేయండి మేడం రాపిడో లో పంపుతాను, అనీ వాడు చెప్పాడు , ఆహా ఎంతగా
టెక్నాలజీ పెరిగి పోయింది , అనుకుంటూ లిస్ట్ వాట్సాప్ చేశాను.
ఆ సరుకులు వచ్చాక అవీ రెడీ చేయటానికి ఏ టెక్నిక్ పని చేయదు, నా ఆధ్వర్యంలో మా పని వాళ్ళు
ఆ కారాలు అన్నీ జల్లించి, రెడీ చేసారు.
డ్రైవర్ కొట్టించిన ముక్కలు క్లీన్ చేసి అన్నీ అర బోసి ఇవ్వన్నీ కలపాలి కదా అనుకుంటూ ఉంటే
ఈ రోజు మే ఫస్ట్ కదా నేను ఫ్రీ గానే వున్నాను, అంటూ మా పెద్ద అమ్మాయి వచ్చేసింది.
ఆలా వరంగల్ కారం రంగు కోసం, గుంటూరు కారం ఆవకాయ చుర్రు మంటం కోసం , ఘాటుగా అవపిండి,
సామర్లకోట వారి నువ్వు పప్పు నూనె వేసి కలిపి జాడిల్లో వేసి అమ్మయ్య అనుకున్నాను.
ఈ రోజు మరలా తిరిగి కలిపి చిన్న జాడిల్లో కి తీసాను. కోడలు కి ఇంకా కారం కావాలి అంది. మా ఆబ్బాయి కి ఘాటుగా వుంది, అంటూ తన ఫ్రైండ్స్ కి ఎన్ని పంపాలో చెప్పాడు. మా కోడలు తన లిస్ట్ చెప్పింది.
ఇంకా ఇద్దరు అమ్మాయిలు లిస్ట్ రాలేదు. ఇంక డ్రైవర్లు , ఆవకాయ టైమ్ కి మానుకుని పోయిన పనివాళ్ళు
కుశలం కనుక్కుని పాత ఆవకాయ అయినా కొంచెం పెట్టమ్మా అంటారు. సరే పాత ఆవకాయ తో కొత్తది కూడా వస్తుంది అని వాళ్ళు కు తెలుసు.
ఇంక మా మనవరాళ్లు, మనవడు , పాత ఆవకాయ స్లమ్స్ లో పంచి వస్తాము అంటారు.
ఈ రోజు సండే కోడలు ఫ్రీ గా వుంది డబ్బాలు తీసుకురా ఆంటే ఆమెజాన్ లో చవక ఆంటీ ఎన్ని కావాలి చెప్పండి
ఆర్డర్ ఇస్తాను అన్నది.
ఆహా ఏమీ రుచి లాగా ఆహా ఈ ఎండల్లో కాలు ఇంట్లో నుండీ కద ప కుండా ఆవకాయ పెట్టేసాను.
అదీ నా సంతోషము, మా అత్త గారు మాత్రం స్వర్గం లో నుండీ మా కోడలు దుబారా మనిషి అనుకుంటూ వుంటుంది..
ఇంకా ఆవకాయ కబుర్లు చాలా వున్నాయి , ఇంకొక సారి కలుద్దాం
శుభ రాత్రి
E
,
Comments