top of page
Search

అమ్మ కి ప్రేమ తో

  • murthydeviv
  • Jul 31
  • 3 min read

మాతృదేవోభవ , మనకి ఒకరోజు అంటూ ఈ మదర్స్ డే, ఫాథర్స్ డే అనీ ఇదివరకు తెలియదు. ఎవరయినా వూరి నుంచీ వచ్చినా, వెళ్లుతున్నా , ఈ హగ్ చేసికోవటం కూడా ఉండేది కాదు.


సరే ఆన్నిటి తో పాటు ఇవి కూడా ఫాలో అయిపోతున్నాము.

మన చిన్న తనంలో జాయింట్ ఫ్యామిలీస్ లో ఎవరో ఒకరు జడలు వేయటం , అన్నాలు పెట్టటం, స్కూలుకి పరిగెత్తటం.


ఉదయం లేచినప్పటినుండి మన పక్క లు , దుప్పట్లు మడత పెట్టి పరుపు మడిచి పెట్టాలి. చిన్న పిల్లలు పక్కలు అయితే మనమే ఎత్తి పెట్టాలి.


అదేమీ డీసెప్లిన్ ఎలా నేర్పే వారో తెలియదు. జడ వేయించుకోవాలి ఆంటే నూనె , దువ్వెన అక్కడ పెట్టాలి. భోజనం ముందు కంచాలు పీటలు, మంచినీళ్లు . అన్నీ రెడీ గా ఉండాలి.


భోజనం చేసాక ముందు పీట ఎత్తాలి, లేకపోతే యమ లోకం లో యముడు మనల్ని పీట కింద నుంచీ దూర మంటాడు అనీ చెప్పేది , మా చిన్న బామ్మ,

మనం కూడా ఎంత అమాయకంగా నమ్మే వాళ్లము.


ఏ పని అయినా మగ, ఆడ తేడా ఉండేది కాదు, ఒక్క ఎంగిలి కంచాలు మాత్రం

మగ పిల్లలు ఎత్త కూడదు అనీ చెప్పే వారు..


కోపం వచ్చినా ఎదురు చెప్పకూడదు కదా, అందుకు అన్నయ్యల చేత బావిలో నీళ్లు తోడించేదాన్ని నేను .


ఇవ్వన్నీ ఎందుకు చెప్తున్నాను ఆంటే ఒక్క అమ్మ గురించే కాకుండా మనల్ని


ఎంతో, ప్రేమగా, డీసెప్లిన్ తో పెంచిన మాతృమూర్తుల

అందర్నీ గుర్తు చేసుకుంటూ చిన్న శ్రద్ధాంజలి.


మేము జాయింట్ ఫ్యామిలీ లో పెరిగాము, ఊర్లోనే మా పెద్ద మేనత్త, ప్రతి సెలవులు కి వచ్చే చిన్న మేనత్త, ఇంట్లో నే వుండే పెద్ద నాన్నగారు, పిన్ని బాబాయిలు .


మా అమ్మగారు అయితే మమ్మల్ని ఒక్క క్షణం కూడా వూరికే ఉండనిచ్చేది కాదు, సెలవల్లో కుట్లు అల్లికలు, హిందీ పరీక్షలు తప్పని సరి.


ఇంక మా చిన్న మేనత్త సంగీత విద్వాంశు రాలు

, ఆవిడ వచ్చింది ఆంటే

కొంచెం కంఠ ము బాగుండి స్వరం సరిగ్గా పలికితే సంగీతం నేర్పేది.


లేకపోతే హారతి పాటలు నేర్చుకోవాలి. ప్రతి సెలవల్లో ఆవిడ వచ్చింది ఆంటే ఇంక మాకు క్లాసు లే క్లాసులు .


ఈ పాటలు గట్రా రాకపోతే లేస్ అల్లటం , దిండు గలీబులకు ఎంబ్రోడా యరీ


నాకు ఇప్పటికీ డౌట్ వస్తుంది, ఆ దిండు కవర్లకు అన్నీ పూలు ఎందుకు అనీ


ఇంక అక్కయ్యలు ఎవరైనా పురుడు కి వస్తే , ఆ చిలకల పందిరి కి చిలకలు కుట్టటానికి వీధి చివరి టైలర్ దగ్గర రక రకాలు గుడ్డలు తెచ్చి పక్కన

కూర్చుని వాళ్లకు సహాయం చేయాలి.


ఏ మాట కు ఆ మాటే ఆ చిలకల పందిరి మాత్రం చాలా అందంగా తయారు చేసే వాళ్ళు, పసి పిల్లలు అవీ చూసి నవ్వుతూ కాళ్ళు చేతులు కదలిస్తూ

ఆడుతూ ఉంటే చూడటానికి చాలా అందంగా, ఆనందంగా ఉండేది.


ఒక్క మా పిన్ని కి మాత్రం ఈ కళ ల మీద అసక్తి లేదు. బాగా పిండివంటలు చేసేది.

ఆవిడకు గవ్వలు, చింత గింజలు, తొమ్మిది రాళ్లతో ఆడే ఆట ఇప్పుడు పేరు మర్చిపోయాను ఆడేది .ఆవిడ తో మేము గెలిచిన పాపాన పోలేదు


రోజూ మాకు ఆశ మాత్రం పెట్టేది , ఈ రోజూ నీవు గెలుస్తావులే అనీ, కానీ ఏం

లాభం లేదు.


ఎప్పుడయినా వోడి పోయి ఉక్రో షం తో ఆట కలిపేస్తే దగ్గరకు తీసుకుని


రేపు నిన్నే గెలిపిస్తాలే అనేది.


ఇంక వేసవి సెలవులు వస్తే అందరం ఒకచోట ఆట పాటలతో గడిపే వాళ్లము.


పూల జడల ప్రహశనం ఉండేది. ఒకరోజు వంకుల జడ , ఇంకో రోజూ పెద్ద జడ


పెద్ద వాళ్ళు వరుసగా జడలు వేస్తూ ఉంటే చిన్న బ్యాచ్ పుల్లలకు పూలు గుచ్చాలి. మధ్యలో కనకంబరం, మరువం అందిస్తూ ఉండాలి.


జడ వేయించుకునే వాళ్ళు కదిలితే వీపు మీద ఒక దెబ్బ కాసేపు కదలకుండ

కూర్చోలేరా అనీ.


ఈ కళ లో కూడా మా చిన్న మేనత్త నిష్ణా తురాలు , ఆవిడ ముందు ఎవరమూ నోరు ఎత్తము.


ఈ జడలు వేసుకుని పట్టు లంగాలు కట్టుకుని అందరి ఇళ్లకు వెళ్లి చూపించి రావాలి. ఆ రోజుల్లో నాగరం అనీ ఒక అభ రణం ఉండేది .

అందులో నుండీ జుట్టు దూర్చి నడి నెత్తి మీద అలంకరణ చేసే వారు.


మా అత్తయ్య వేసిందంటే ఇంక మూడు రోజులు అయినా ఆ నాగరం కు జడ కు ధోకా ఉండేది కాదు.


అసలు ఇష్టం లేని జడ మొగలి రేకులు జడ ఆ రేకులు అట్ఠ ల మీద కుట్టి మధ్య లో మరువం కనకంబరాలు పెట్టి కుట్టి అవీ జడ మీద కుట్టే వారు

గుచ్చుకుంటుంది వద్దు అన్నా లాభం లేదు.


కానీ ఇప్పుడు మాత్రం వాళ్ల ఓపికకు జోహార్లు , అంత మంది పిల్లలు కు ఓపిగ్గా వేసే వారు.


ఒక ఇంట్రెస్ట్ ఏమిటంటే జడ వేసుకుని తాత గారి కి , పెద్దనాన్న గారికి దణ్ణం

పెడితే ఆందరికీ డబ్బులు ఇచ్చే వారు


ఆ రోజుల్లో ఇలా చిన్న వాటికే సంతోషం. మా అత్త గారికి ఈ పూల జడలు ఇంటరెస్ట్ ఉండేది. మా పిల్లలకి, అన్నయ్య పిల్లలు కి జడలు వేసి ఫోటోలు తీయించాము.


చిన్నపుడు పాటలు, కుట్లు, అల్లికలు, పెయింటింగ్ నేర్చుకున్నాను , అమ్మ


ప్రొదబ్లమ్ తో , జడలు మాత్రం రాలేదు, పూలు కట్ట టం కూడా మా చెల్లెళ్లు

నేర్చుకున్నా నేను నేర్చుకోలేదు , ఎప్పుడూ పుస్తకాలు చదవటమే అనీ అమ్మ గారు కోప్పడుతూ వుండే వారు.


తర్వాత నేర్చుకున్నాను. మా మనవ రాళ్లకు రెడీ మేడ్ జడలు వేసి ఫోటోలు తీయించమంటే ఇంకా మా వాళ్లకు తీర లేదు.


పై నుండీ మా అమ్మ అత్తయ్య ఏమంటారో.


ఆలా అరోజుల్లో పిల్లలు అందరినీ సమానంగా చూస్తూ , చక్కటి క్రమం శిక్షణ తో

పెంచి , మధుర మై న బాల్యాన్ని ఇచ్చిన మాతృ మూర్తులకు

ఆందరికీ వినమ్రత తో ఈ చిరు నివా ళి


ఆందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు


మదర్స్ డే నాడు ఫేస్ బుక్ రాసిన పోస్ట్ మీకోసం శుభరాత్రి

 
 
 

Recent Posts

See All
వరలక్ష్మి వ్రతము విశేషాలు

ఈ రోజు వరలక్ష్మి వ్రతము అనీ ఫేస్ బుక్ లో చాలామంది అమ్మవారి అలంకరణ , ప్రసాదాలు ఫోటోలు పెట్టారు .. అన్నీ చూడ ముచ్చట గా వున్నాయి.. ఈ రోజుల్లో ఎక్కువగా అమ్మవారి విగ్రహలు, వెండి వీ, దొరుకుతున్నాయి. అందర

 
 
 
ఉయ్యాల ముచ్చట్లు

మొన్న శనివారం మా కజిన్ మనవడిని ఉయ్యాల లో వేస్తున్నాము రమ్మని పిలిచింది మెల్లగా ఓపిక చేసుకుని బయలు దేరాను . కొండలుగా పేరు పొందిన ఈ మూల నుంచీ ట్రాఫిక్ లో ఆ మూల కొత్త పేట చేరేటప్పటికి

 
 
 
బిమల్ రాయ్

ఈ మధ్య యూ ట్యూబ్ లో st పీటర్స్ బర్గ్ లో అనుకుంటా ఏదో ఒక గ్రూప్ వాళ్ళు కొన్ని హిందీ పాటలు పాడారు.. అందులో మొదట గా మధుమతి లో దిల్ తడప్ అనే పాట చక్కగా పాడారు.. ఇండియా కు రష్యా

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page