అత్తా కోడళ్ల సరాగాలు
- murthydeviv
- 2 hours ago
- 3 min read
రోజూ ఉదయాన్నే మా కుక్ రాగానే ఏం చేయమంటారు అని అడుగుతుంది. నేను ఏదో ఆకుకూర పప్పు చెపితే
నిన్న ఆకు కూర నే కదా అంటుంది..
నాకు వెంటనే మా అమ్మ, మా పెద్ద వదిన గుర్తు వస్తారు. కూరలకు వెళ్ళినపుడు రెండు మూడు రకాల ఆకు కూరలు ఒకేసారి తెస్తాము కదా , జనరల్ గా పాడు గాకుండా ఫ్రిడ్జ్ వున్నా , ఆకు కూర లు త్వరగా ఖర్చు పెట్టాలని
అమ్మ ముందు రోజే తరిగి రెడీ పెట్టేది.
వదిన మాత్రం నిన్న ఆకుకూరే కదా , ఈ రోజు టమాటో, లేదా దోస కాయో ఏదో చెప్పేది.
మా అమ్మ కు పాపం వదిన తో వాదించే ఓపిక ఉండేది కాదు . సరే నీ ఇష్టం అనేది.
జాయింట్ ఫ్యామిలీ అవటం తో ఎక్కువగా అక్కయ్యలు పెళ్లిళ్లు చూసిన మాకు
మా పెద్ద అన్నయ్య పెళ్లి అంటే చాలా సరదా పడ్డాము.
మా ఊరు నుండి రెండు బస్సు ల్లో వెళ్ళాము . మా అన్నయ్య మామ గారు పోలీస్ డిపార్టుమెంటు
పని చేసే వారు.. పెళ్లివారికి జవాన్ల చేత అడుగు అడుగుకు మర్యాదలు చేయించారు
స్నాతకం అయ్యాక నది దా ట కూడదని రెండు రోజులు అక్కడే ఉండేవారు.
ఈ రోజుల్లో లాగా కేటరింగ్ లు కూడా కావు కదా . అందరికి కింద కూర్చో పెట్టి వడ్డించే వారు
ఉదయాన్నే పెట్టే ఉప్మా అయినా చాలా రుచిగా ఉండేది.
పెళ్లి అయిన మర్నాడు సరదాగా ఆడపడుచు లం అందరం అలుగుదామని విడిది లోనే
ఆగిపోయాము. పెళ్లి వారింట్లో మేజు వాణి అనే కార్యక్రమం కి ఏర్పాటు చేసుకున్నారు..
ఇన్నాళ్లకు మనకు మగ పెళ్లి వారి హోదా వచ్చింది అని మా కజిన్స్ అందరం ఆనందిస్తూ
ఉండగా , మా బాబాయి గారు అక్కడికి వచ్చారు.
మా నాన్న గారి అన్నదమ్ముల్లో ఎక్కువగా మా అందరితో చనువుగా ఉండేది, ఏ ఫంక్షన్
అయినా నడుం కట్టుకుని గాడిపోయ్యి దగ్గర నుండి అన్నీ సమర్థించేది ఆయనే .
అయన వచ్చి ఏమిటీ మీరు అలిగారా అంటూ ఒక్క చూపు చూసారు . అంతే మేము
అందరం లేచి పెళ్లివారింటికి బయలు దేరాము.
ఆ రోజుల్లో పెద్దవాళ్లు ఆంటే అంత గౌరవం అభిమానం ఉండేవి.
మా ఊరు వచ్చాక నాకు స్పెషల్ గా క్లాసు వచ్చింది బాబాయ్ గారి దగ్గర నుండి, ఎందుకంటే
ఆ పెళ్లికూతురు నా ఈడు అమ్మాయి కాబట్టి మన ఇంటికి వచ్చిన కొత్త కోడలు ను
ఎలా చూసుకోవాలి అని , అయన పాఠం జీవితం అంతా గుర్తు పెట్టుకుని ఎపుడూ
వదిన లకు ఒక ఆడపడుచు లాగా కాకుండా ఒక ఫ్రెండ్ లాగా వున్నాను.
ఆలా మా వదిన ఆంటే మాకు చాలా అపురూపం గా ఉండేది.
మా అమ్మ గారు కూడా అలాగే ఉండేవారు .
మా ఫ్రెండ్స్ తో తనూ కూడా సరదాగా కబుర్లు చెప్తూ ఉండేది. ఇద్దరము కలిసి హిందీ పరీక్షలు రాసాము.
పాటలు కూడా కలిసి నేర్చుకుంటూ ఉండేవాళ్ళము.
వదిన అన్నయ్యలకు ఫస్ట్ పాపాయి వచ్చినప్పుడు మా రెండో అన్నయ్య ఒక బేబీ బుక్ తెచ్చి
వదినకు ప్రెసెంట్ చేసాడు. మా వదిన ఆ పుస్తకం చదివి అవన్నీ తూ చ తప్పకుండా పాటించేది.
అవి కొన్ని తలచుకుంటే ఇప్పుడు నవ్వు వస్తుంది. పాపాయి ఏడుస్తుంటే మా అమ్మ పాలు
పట్టమంటే ఇంకా మూడు గంటలకు ఒకసారి పట్టాలి. అప్పుడే పట్టా కూడదు అనేది.
మా అమ్మ కు కోపం వచ్చి, మా రెండో అన్నయ్య వచ్చినప్పుడు ఇంకెవరికి ఇలా పుస్తకాలు
ఇవ్వకురా అనేది..
వదినకు వంటలు చేయటం కూడా చాలా ఇంటరెస్ట్ ఉండేది. మమ్మల్ని కూడా నేర్చుకో మని
కొంచెం బలవంతం చేసేది కానీ , నాకు అయితే అంత ఇంటరెస్ట్ ఉండేది కాదు.
మా అమ్మ గారిని నేను హైదరాబాద్ వచ్చాక మా ఇంటికి వచ్చింది. నేను అమ్మ కు అన్నీ చూపించాలి అని
ఎక్కడికి తీసుకుని వెళ్లినా వదిన వస్తే ఇవ్వన్నీ చూపించు అంటూ చెప్పేది .
అత్తగారు అయినా మా అమ్మగారికి వదిన ఆంటే చాలా అభిమానం ఉండేది..
ఇద్దరూ ఇంట్లో కూడా ఏదో కబుర్లు చెప్పుకుంటూ సరదాగా వుండేవారు.
మా వదినకు యాత్రలు చేయటం చాలా ఇంటరెస్ట్ ఉండేది. మా అమ్మగారికి మాత్రం గృహమే స్వర్గ సీమ లాగా
ఎక్కడికీ వెళ్ళ టం పెద్దగా ఇష్టం ఉండేది కాదు . మా మూడో అన్నయ్య తన స్నేహితుడు రైల్లో
వాళ్ళ బంధువులు తో ఉత్తర దేశ యాత్ర కి వెళ్తుంటే మా అమ్మ గారి వదినను వాళ్లతో
పంపాడు.
మా అమ్మగారికి అన్నీ రోజులు మమ్మల్ని వదిలి వెళ్ళ టం ఇష్టం ఉండదు .. అలాగని వదిన ను నిరాశ పర్చ లేక
బయలుదేరింది.
ఆ రోజుల్లో ఫోన్లు అవీ కూడా లేవు కదా ,వాళ్ళు అందరూ ఫ్యామిలీ ఫ్రైండ్స్ కావటం తో ఎలాగో బయలు దేరింది.
వాళ్ళు యాత్రలు నుండి వచ్చాక అబ్బా వదినకు అసలు భయం లేదే అన్నిటింకి ముందే పరిగెడుతుంది అని
మొదటి సారి వదిన మీద మా అమ్మ కంప్లెయింట్ విన్నాను.
రెండో మాట నేను బ్రతికి ఉండగా మీరు బదరి నాథ్ వెళ్ళకండి , అని చెప్పింది.
ఆ ప్రయాణాలకి అమ్మ అంత భయ పడిపోయింది.
ఆ తర్వాత సంవత్సరం మా అత్తగారిని కూడా మా పెద్దమ్మ వాళ్ళు వెళ్తుంటే యాత్రలకు పంపాము.
మా అమ్మగారికి మాత్రం వాళ్ళు నెల రోజులు కు తిరిగి వచ్చిందాకా టెన్షన్ పడేది.
రెండు రోజులకు ఒకసారి వచ్చి మా మామ గారికి ఆ యాత్రలు ఎంత కష్టం అని చెప్పితే, మా వదిన వచ్చి
ఆయనకు ఏమీ భయం లేదు యాత్ర బాగా జరుగుతుంది అని చెప్పేది.
ఎప్పుడూ ఒకటిగా వుండే ఈ అత్తకోడళ్ళు ఇక్కడ మాత్రం విడిపోయారు.
మా బామ్మ గారు కోడళ్ల తో చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారుట. ఆవిడ చెప్పినట్లు కొడుకులు కూడా వినేవారుట.
ఆవిడ ని చూసే భాగ్యం నాకు ఎక్కువగా కలగ లేదు .
నాకు ఆవిడ అంతగా గుర్తు లేదు. మా అమ్మ గారు వాళ్ళు ఆరుగురు తోడికోడళ్ళు.
వీళ్లకు కోడళ్ళు వచ్చాక కల్సుకున్నప్పుడు ఎక్కువగా వాళ్ళ కోడళ్ల గురించి కబుర్లు ఉండేవి.
ఈ అత్త గార్లు అందరూ ఎంత మంచి వాళ్ళు ఆంటే కోడళ్ళను గురించి ఎక్కువగా పొగడ్తలు ఉండేవి.
వాళ్ళ సుగుణలాను ఒకరికొకరు చెప్పుకుంటూ వుండే వారు. మా పెద్దమ్మ ఆంటే మా అమ్మ గారి అక్కయ్య
వీళ్లకు ఇంకేమి కబుర్లు లేవుటే అనేది. ఆవిడ కు ఒక్కతే కూతురు. అల్లుడు కూడా మేనల్లుడు
ఆవిడ మాట తూ చ తప్పక వింటాడు. నేను అనే దాన్ని నీవు బావగారు
గురించి కాసేపు పొగుడు అని.
ఇంక మా పిన్ని ఆంటే మా అమ్మ చెల్లలు ఆవిడకు కూతుర్లు లేరు .పిన్ని అయితే తన కోడలు సుగుణాలు
వర్ణించి చెప్పేది.
ఆలా ఇంత మంది అత్త గార్లు కోడళ్ళు మధ్యలో సరదా సరాగాలు చూసాను..
ఇంకా మా అత్త గారితో సరా గాల తో ఇంకొక సారి.
Comments