top of page
Search

హిందుస్తానీ సంగీతం

  • murthydeviv
  • Aug 12
  • 2 min read

అసలు సంగీతం లో ఇన్ని రకాలు వుంటాయి అని తెలుసుకోటానికి జీవితంలో ఒక పాతికేళ్ళు గడిచిపోయాయి. మా పెద్దనాన్న గారు బయటకు వెళ్లగానే సిలోన్,, వివిధ భారతి ఎపుడు పెడదాం అనే హడావిడి వుండేది. ఇంకొచెం కాలేజ్ కి వచ్చాక బీబీసీ, వాయిస్ ఆఫ్ అమెరికా ట్యూన్ చేసీ ఇంగ్లీష్ మ్యూజిక్ వినటం కూడా ఒక క్రేజ్ వుండేది. మా పెద్ద నాన్న గారికి కర్ణాటక సంగీతం అంటే చాలా అభిరుచి ఉండేది. ఆరోజుల్లోనే ఆయన ఆ ప్రోగ్రామ్ ల కోసం మద్రాసు వెళ్తుండే వారు. షెహనాయ్ అనే పేరు ఆయన చెప్తే విన్నట్లు గుర్తు. కర్ణాటక సంగీతం లో వీణ, వయోలిన్ అవీ వినటం బాగా ఇంటరెస్టింగ్ గా వుండేది కానీ అలా రాగం తీస్తూ పాడుతూ ఉంటే ఇప్పటికీ వినటం విసుగ్గా వుంటుంది. ఆరోజుల్లో రేడియో లో రాత్రి పూట నేషనల్ మ్యూజిక్ ప్రోగ్రామ్ అని వచ్చేది. పెద్ద నాన్న గారు రోజూ చాలా ఎంజాయ్ చేస్తూ వినేవారు. అపుడు షెహనాయ్ కూడా వచ్చేదేమో.నేను మాత్రం ఫస్ట్ టైమ్ బిస్మిల్లా ఖాన్ షెహనాయ్ అప్పట్లో సరోవర్ హోటల్ లో ఎరేంజ్ చేసిన ప్రోగ్రామ్ లో విన్నాను. ఆ రోజుల్లో రవీంద్ర భారతి. భారతీయ విద్యా భవన్, ఆడిటోరియంలో చాలా ప్రోగ్రాములు జరుగుతూ వుండేవి ఇన్విటేషన్లు రాగానే ప్రోగ్రామ్ లకు వెళ్ళిపోయే వాళ్ళం ఈ షెహనాయ్ ప్రోగ్రామ్ మాత్రం లయన్స్ క్లబ్ తరఫున ఎరేంజ్ చేసింది. చాలా కొద్ది మంది గెస్టు లతో చాలా బాగా జరిగింది ఆయన ఉర్దూ మనకు అర్థం కాక పోయినా ఎవో కొన్ని మాటలు కూడా మాట్లాడారు. ఆయన మాటలు కు ఎవరో ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేశారు. ఆయన కు ఉన్న దేశభక్తి వారణాశి, గంగా నది మీద వున్న భక్తి గౌరవము లు మనకు కూడా వుండవు అనిపించింది ఆరోజు. నా దగ్గర ఆ మహానుభావుడు సి డి లు చాలా ఉన్నాయి. ఇపుడు అయితే యూ ట్యాబ్ లో వినటమే కదా.ఈ రోజూ యూ ట్యూబ్ లో ఏదో సెర్చ్ చేస్తుంటే Dr N రాజం బిస్మిల్లా ఖాన్ గారి జుగల్ బంది కనిపించింది. డా రాజం బెనారస్ హిందూ యూనివర్సిటీలో సంగీతం ప్రొఫెసర్. వయొలిన్ తో హిందుస్తానీ సంగీతం వాయిస్తారు. దూరదర్శన్ లో కూడా ప్రోగ్రాములు ఇచ్చారు. ఆవిడ కూతురు కూడా వయోలిన్ వాయిస్తారు ఆ ప్రోగ్రామ్ విన్నాక నా మనసులో కలిగిన ఆనందం తో ఈ పోస్ట్ రాస్తున్నాను. ఒక రెండేళ్ల క్రితం మా పిల్లలు తో బెనారస్ వెళ్ళాను. యాత్ర లు అనేవి ఎపుడూ కొంచెం మధ్య వయసులో మన కాళ్ళ లో శక్తి వున్నపుడు చేయాలి. గంగా హారతి చూడటానికి అసి ఘాట్ వెళ్ళాము. ఎలాగో నడిచి ఆ హరతి చూశాను. ఆ మర్నాడు ఇంకా ఏవో గుడులు చూసి అందరూ కేదార్ ఘాట్ కి బయలు దేరారు. అదంతా నేను నడవ లేను అని టాక్సీ లోనే వున్నాను. నాకు ఎక్కడికి వెళ్ళినా మావారు పనుల మీద బయటకి వెళ్ళినా, ఆ హోటల్ వాళ్ళ టాక్సీ తీసుకుని ఆ ఊరు లో విశేషాలు చూడటం షాపింగు చేయడం అలవాటు. అలాగే నేను ఆ టాక్సీ డ్రైవర్ ను బిస్మిల్లా ఖాన్ గురించి అడిగాను. ఆ డ్రైవరు పేరు తివారి, చాలా మటుకు బొంబాయి లో ఢిల్లీ లో టాక్సీ డ్రైవర్ లు ఇలాగే తివారి లు మిశ్రాలు, శర్మ లు వుంటారు. ఇంతకీ అతను నా ప్రశ్న కు ఆశ్చర్యం పోయాడు. మీకు తెలుసా అంటూ, నేను ఆయన ఇల్లు చూపించమని అడిగాను. అక్కడ వాళ్లందరూ ఆయనను దేవ లోకము నుంచి వచ్చిన ఒక గంధర్వుడు గా అనుకుంటారు. ఆ మర్నాడు ఆయన ఉన్న వీధి మాత్రమే చూడ గలిగాము ఆ కాశీలో అన్ని వీధులు చాలా ఇరుకుగా ఉంటాయి నడవటానికి కష్టం. అలా వీధులు వుండటానికి కారణాలు కూడా చెప్పాడు. లోకల్ గా ఉండే అలాంటి వాళ్ళ తో మాట్లాడుతూ ఉంటే చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఆ కాశీ మందిరము రిపేర్ చేస్తున్నపుడు జరిగిన సంఘటనలు కూడా చెపుతూ నే ఉన్నాడు. ఎపుడు నార్త్ ఇండియా వెళ్ళినా వాళ్లకు వున్న దేశభక్తి మనకు లేదు అనిపిస్తుంది. హిందుస్తానీ సంగీతంలో సితార్ వాయిస్తూ మధ్యలో గజల్స్ పాడుతూ వుండే ఉస్తాద్ సౌజత్ ఖాన్ కూడా చాలా మధురంగా ఉంటుంది. ఆయన వంశం లో పూర్వీకులు కూడా సంగీత పండితులు. ఎపుడైనా తీరిక దొరికితే వినండి. హిందుస్తానీ సంగీతం అనగానే భమిడిపాటి వారి కథ ఒకటి గుర్తు వస్తుంది. కానీ హిందుస్తానీ సంగీతాన్ని కూడా ఆస్వాదించండి. అలాగే బిస్మిల్లా ఖాన్ విలాయత్ ఖాన్ జుగల్ బంది కూడా చాలా బాగుంటుంది వినండి.

 
 
 

Recent Posts

See All
దీపావళి కొన్ని జ్ఞాపకాలు

అన్ని పండుగల్లో కి విశిష్టత గల పండుగ దీపావళి. దేశము మొత్తం జరుపుకునే పండగ , అంతే కాక ఈ మధ్య ఇతర దేశాలు సైతం , ఈ పండుగ సందర్భంగా కొంత ఉత్సాహం చూపిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు వ్యాపారాల్లో

 
 
 
ఆ పాత మధురాలు

కొన్ని పాటలు వింటూ ఉంటే ఎన్ని సార్లు విన్నా విసుగు రాదు అనిపిస్తుంది . అందులో హేమంత్ కుమార్ గారి స్వరం ఒక విధమైన మాధుర్యం తో వుంటుంది. లోకో భిన్న రుచి అనుకోండి. కొంత మందికి నచ్చక పోవచ్చు. పాత కాలంలో

 
 
 
డ్రెస్ కోడ్

.ఏదో స్కూల్ డ్రెస్ లాగా ఈ హెడ్డింగ్ ఏమిటో అనుకోకుండా కొంచెం ఓపికగా చదివితే మీకే తెలుస్తుంది కదా , దసరా హడావిడి పూజలు కోలాటాలు బతకమ్మ డాన్సులు అయినాయి పిల్లలు కు హాలిడేస్ అనిఅమ్మాయి ఉదయాన్నే బ్రేక్ఫాస

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page