సప్తశతి లోని కథ క్లుప్తంగా తెలుసుకుందాం. మన పురాణములలో కథలు చదివి ఈ కాలాన్ని బట్టి ఏవో అనుమానాలు వస్తూ వుంటాయి. మనకు ఇపుడు మన పురాణముల మీద అనుమానాలు ఎక్కువ కదా. మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మన పూర్వీకులు వాటిల్లో కొన్ని అంతరార్ధం వుంచారు.అని.అయితే మనకు ఆ అర్థం తెలియనంత మాత్రాన మన పురాణాలు అర్థం లేనివని మాత్రం అనుకోకూడదు. ఇంక. కధ గురించి తెలుసుకుందాం. సురధుడనే రాజు శతృవులు చేతిలో ఓటమి పాలయి, రాజ్యమును కోల్పోయి నాడు. అటులనే సమాధి అను వైశ్యుడు కూడా భార్యా బిడ్డలచేత బ హష్క్రించ బడినాడు.. ఆ ఇరువురూ వ్య క్తులు ను ఆరణ్యము లో మేధసుడను మునీశ్వరుని సందర్శిచిరి..వారు ఇరువురు మునినీ సమీపించి వారి యొక్క సమస్యలు వివరించారు.ఇన్ని సంకటములు వచ్చినా వారికి రాజుకు రాజ్యము మీద, వై శ్యు నకు భార్యా బిడ్డలు మీద మొహము విడవలేక పోవటానికి కారణం ఏమిటి అని అడిగారు..ఈ మోహము వలన అత్యంత
విచార గ్ర స్తులై న తమకు దారి చూపమని అడిగారు. వారు ఇరువురు ఆ మునీశ్వరుని తమ అజ్ఞానమును తొలగించి జ్ఞాన భిక్ష పెట్టమని ప్రార్ధించారు. అపుడు మేధ నుడు ఇదంతా మహామాయ శక్తి యొక్క లీల. ఆ మహా శక్తి యే బంధ విమోచనములు రెండిటికిని కారణ భూతురాలు అని పలికెను. సంసార స్థితి కా రిణి యగు a మహామాయ యొక్క
ప్రభావము చేత మానవులు మమత అను సుడిగుండములలో , మోహమను కూపములో త్రో యబడుచున్నారు.
ఈ మహామాయ జగత్పతి యగు అగు విష్ణుదేవుని యొక్క యోగ నిద్ర, విష్ణు దేవుని తామసిక శక్తి.. ఆమె చేతనే జగత్తు సమ్మోహితమగుచున్నది. ఆ మహా మాయ యే జ్ఞానులు మనస్సును కూడా ఆకర్షించి మోహ గ్రస్తుల గా ఒనర్చును
అపుడు ఆ ఇరువురు మరల ఆ మునీశ్వరుని ఆ మహా మాయ యొక్క వివరములు తెలుపమని ఫ్రా ర్ధించారు .అంత ఆ మునీశ్వరుడు ఆ దేవి ఆవిర్భావం గురించి వివిధ అసురలను సహంరించిన తీరును విశదీకరించారు..మహిషము మానవుని లోని పాశవిక లక్షణము నకు చిహ్నము. ఒక్కొక్క అపుడు ఆ లక్షణము విజృభించి దానిని అణచుట అత్యంత కష్ట సాధ్యమగును. దేవి సాధించ నట్లు అత్యంత సాధన తో దానిని అదుపులోనికి తేవ లే ను.చెడు ఎల్ల వేళల కృతిమ రూపమును దాల్చి వుండును ఒక్కొకపుడు మానవులు ఆశ, స్వార్ధము, మమత అను పాశములో చిక్కుకొని అంధకారంలో పడిపోదురు. దుర్గాదేవి ఉన్నత ఆశయములకు, కార్య దీక్ష కు, ఆశ్రిత దీన రక్షణ కు, భక్త జన రక్షణ కు, చిహ్నము. దుర్గా దేవి అద్భుతమైన చరిత్ర వినిన రాజు, వైశ్యుడు, మునీశ్వరుడు చెప్పిన విధముగా దేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధించి దేవి యొక్క కృప కు పాత్రులై వరములను పొందిరి. ఈ సప్తశతి పారాయణ కు అనేక విధానములు వున్నవి .ఇదివరకు చాలా నియమములు చెప్పే వారు.కానీ ఇపుడు అందరూ చేస్తున్నారు.రేపు పారాయణ గురించి ఇంకా తెలుసుకుందాము.
శ్రీమాత దయ , కరుణ అందరికీ లభించాలని ఆకాంక్షించు స్తూ శ్రీమాత్రే నమః.
Comentários