top of page
Search

సంసారములో సరిగమలు 2

  • murthydeviv
  • Dec 23, 2024
  • 3 min read

అలా మొదలైంది సినిమా లాగా వుంది కదా ఈ కధ. నేను వంట పాఠం నేర్చుకున్న తెలుగు ఫ్యామిలీ ఆయన ఎస్కార్ట్ లో

జి మ్ గా పనిచేసే వారు దంపతులు ఇద్దరు చాలా స్నేహ భావము తో. వుండే వాళ్లు . ఆవిడ వంట బాగా చేసేది ఎపుడూ పార్టీలు ఇస్తూ వుండే వారు .నాకు ఆవిడ తో కన్నా వాళ్ళ పెద్ద అమ్మాయి తో స్నేహం బాగా కుదిరింది. ఆ అమ్మాయి పబ్లిక్ స్కూలు లో12 th క్లాసు చదివేది ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య ఇద్దరూ మా వారి దగ్గరకు మ్యాథ్స్ కూడా చెప్పించు కునే వారు . అమ్మాయి దగ్గర నేను స్వెట్టర్ అల్లటం నేర్చుకున్నాను ఇద్దరము కలసి సైకిల్ మీద డబుల్స్ సినిమాలకు కూడా వెళ్ళే వాళ్ళం. అక్కడ పంజాబీ ఆడవాళ్ళ ను ఒకందుకు మెచ్చుకోవాలి ఒక్క క్షణం కూడా వూరికే కూర్చునే వారు కాదు . ఇంటి పని అవగానే ఎండ లో నులక మంచాలు వేసికొని స్వెట్టర్ ఆల్లటం ఎంబ్రాయిడరీ చేయటం చేస్తూ వుండే వారు ఇళ్ళు కూడా చాలా క్లీన్ గా పెట్టే వాళ్ళు ఇంక ఇంట్లో ఇత్తడి సా మాను అయితే మెరుస్తూ వుండేవి .వాళ్లు ఉదయాన్నే ఒక ఛులా అనే పొయ్యి వెలిగించరంటే రాత్రి కి అదే చలికి హీటర్ లాగా పని చేసేది . ఇళ్లు చిన్న వైనా చుట్టూ పెద్ద స్థలం వుండేది . వాళ్ళు తప్పకుండా వేసే అవకూర , మొక్క జొన్న. చలి కాలం వచ్చిందంటేఆ చూల మీదా అవకూరా తో మన గోంగూర పులుసు కూర లాగా చేసే వారు. మొక్క జొన్న పిండి తో రొట్టె లు a చులా మీద కా లిస్తే వంట అయిపోయినట్టే. అబ్బ ఎంత హాయి మనకు లాగా పప్పులు కూరలు పచ్చడి ఇన్ని అక్కర్లేదు కదా అనిపించేది. ఇంత కి మొదటి రోజు న వంట చెప్ప లేదుకదా.

నెస్కేఫ్ ప్రహసనం అయ్యాక వున్న పాలు ఇంటావిడ ను అడిగి పెరుగు తీసికొని తోడు పెట్టాను . సాయంకాలం వంట పాఠం

నేర్చుకొని అన్నం కూర చేశాను . రాత్రి భోజనం చేసే టపుడు పెరుగు తీస్తే అది అలా పాల లాగానే వుంది . ఇప్పటి లాగా సెల్ఫోన్ వుంటే మా వారి రియాక్షన్ ను ఫొటో తీసే దాన్ని . నాకేం తెలుసు ఆ పెరుగు కు కూడా చలికి ఒక స్వెట్టర్ వేసి గోధుమపిండి డబ్బా లో పెట్టాలిట. ఒక పదిహేను రోజులు రోజు కొక రకంగా వసున్న అన్నం పప్పు ఆకారాలు చూసి పాపము మావారు ఒక కుక్కర్ కొన్నారు. అపుడే కొత్తగా కుక్కర్ లు వస్తున్నాయి. గ్యాస్ స్టవ్ అయితే డైరక్ట్ గా మార్కెట్ లో దొరికేది కాదు. ముందే అప్లై చేయాలి. ఆలూ తో కాలి ఫ్లవర్ తో పరోటా లు అయితే బాగా కుదిరేవి. కుక్కర్ తో వంట ప్రాబ్లెమ్ కాలేదు కానీ ఆ కుక్కర్ కి కొంచెం మసి వచ్చినా ఫిజిక్స్ చదివావు స్టవ్ లో బ్లూ ఫ్లేమ్ ఎలా రావాలో తెలియదా అని అడిగే వారు

నేను అనుకునే దాన్ని ఈ ఫ్లేమ్ కి నా చదువుకు ఏమిటీ సంబంధం.అని . అసలే ఆ చలి మనకు అలవాటు లేదు సంక్రాంతి నెల వచ్చిదంటే పళ్ళు తోముకోవటానికీ కూడా వెన్నీళ్లు తీసికునే దాన్ని. ఇక్కడ చలి కి సాక్స్ యింట్లో కూడా వేసుకోవాలి పని మనిషి కూడా వెన్నీళ్ళు ఇవ్వాలి.. ఆ అమ్మాయి మాట్లాడే పంజాబీ మనకు అర్ధం కాదు . మొదటి రోజు నే యూనివర్సిటీ ఫ్రెండ్ చెప్పింది ఇక్కడ ఎవర్నీ తుమ్ అనకూడదు అప్ అనాలి అని. సో పని మనిషి నీ కూడా అప్ అని హ్యాంజీ అంటూ గౌరవిస్తూ వుండేదాన్ని ఎందుకంటే చలి ఎక్కువ గా వుంటే ట్యాప్ లో నీళ్ళు సరిగా వచ్చేవి కాదు.అపుడు ఈ హ్యాంజి గారే బోరింగ్ నీళ్ళు కొట్టి ఇవ్వాలి కదా. ట్యాప్ లో నీళ్ళు ఎందుకు రావూ అని మా వారిని అడగలేదు. ఎందుకంటే మరల నా ఫిజిక్స్ , గ్రాడ్యుయేషన్ గుర్తు వస్తుందని. నాకూ ఈ మాత్రం హిందీ ఏలా వచ్చిందంటే మా వదిన కి ఎపుడూ ఏదో ఒకటి చేయాలి అని వుండేది. సరే ఒక శుభ ముహూర్తాన మన ఇద్దరము హిందీ పరీక్షలు రాద్దము అని అన్నది. అపుడే న గ్రాడ్యుయేషన్ అయింది. అబ్బా ఇపుడు ఏం రాస్తములే అంటే నీవు చదవ వద్దులే వూరికే నాకు తోడుగా రా అని బలవంతం చేసింది . మా వదిన కి మా అమ్మ ఎపుడూ సపోర్ట్ వుండేది. సరే అనుకుంటూ మరలా ఎగ్జామ్ కి వెళ్ళి తప్పితే బాగుండదు కదా అందుకని పరీక్ష ముందు ఎలాగో చదివి రాష్ట్ర భాష వరకు చదివి పాస్ అయ్యాము ఇద్దరము. ఇంక ఆ తర్వాత నాకు వుద్యోగం వచ్చింది మా వదిన కు హోదా పెరిగి ఒక పాపాయి మా యింటికి వచ్చేసింది.. అలా నాకు హిందీ పరిజ్ఞానం కలిగింది. మొదట్లో ఇంటికి త్వరగా వచ్చే మావారు మెల్లగా ఏడు. గంటలకు వీలైతే ఇంకొంచెం లేట్ గా రావటం మొదలయింది. కాలేజీ లో క్లాసులు అయ్యాక ప్రొఫెసర్ తో ఏవో రీసెర్చ్ గురించి డిస్కషన్స్ వుంటాయి అనే వారు. పగలంతా యింట్లో ఒక్క దాన్ని ఉండాలి. లేదా ఆ తెలుగు వాళ్ళింట్లో ఎండ లో కూర్చుని స్వెట్టర్ లు అల్లాలి . నేనూ ఏదయినా జాబ్ లో చేరుతాను అని గొడవ మొదలు పెట్టాను . సో రేపు ఉద్యోగ పర్వము.

 
 
 

Recent Posts

See All
అమృత హస్తం

ఈ మధ్య మా కోడలు పుట్టిన రోజున మా పిల్లలు హోటల్ కు డిన్నర్ కు తీసుకుని వెళ్ళారు. హోటల్ పేరు ఎర్ర కారం. గుంటూరు కారం సినిమా లాగానే ఆ పేరుకు...

 
 
 
పెళ్ళి పెట్టె

మా చిన్న తనం లో పెళ్ళి జరుగుతున్న పుడు పెళ్ళి మండపం లో ఎవరో ఒక పెద్ద వాళ్ళు ఒక పెట్టె పెట్టుకుని కూర్చుని వుండే వారు. ఏ బాబాయి గారో...

 
 
 
రూట్స్

ప్రస్తుతం ఉదయాన్నే పేపర్ చూడగానే ట్రంప్ గారు ఏమి సెలవు ఇచ్చారో, ఈ గొడవల్లో మనవాళ్ళు అంతా ఎలా వున్నారో అని ఒక అనుమానం వస్తుంది....

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page