సంసారం లో సరిగమలు
- murthydeviv
- Dec 21, 2024
- 2 min read
మేము వూరు చేరేటప్పటికి రాత్రి అయిపోయింది. పగలు అయితే యూనివర్శిటీ లోకి బస్సులు తిరుగుతూ ఉంటాయి ట రాత్రిపూట వుండవుట. కానీ మావారి స్నే హితుడు అక్కడే కెమిస్ట్రీ రీడర్ గా వున్న తెలుగు ఆయన మా గురించి సెక్యూరిటీ గార్డులు కు చెప్పి క్వార్టర్ వరకు స్కూటర్ లో దింపమని చెప్పారుట. లోపల దాకా నడవాలోమోనని భయ పడిన నేను అమ్మయ్య అని కుదుట పడ్డాను . మెమ్ సాబ్ కో పహాలే చ్ఛో డు దూ ఆనుకుంటూ వాడు స్కూటర్ తెచ్చాడు. మావారు నీవు ముందు వెళ్ళు నేను తర్వాత వస్తాను చలి గావుంది కదా అన్నారు. భయము అని చెప్ప డానికి కొంచం అభిమానం అడ్డు వచ్చింది .కానీ ఆయనే గ్రహించి పర్వాలేదు వెళ్ళు యూనివర్సిటీ క్యాంపస్ కదా భయము ఉండదు అని క్వార్టర్ నంబర్ ఆ ఫ్రెండ్ పేరు చెప్పారు . కానీ ఆ ఫ్రెండ్ a రోడ్డు చివరే నుంచుని మా కోసం ఎదురు చూస్తున్నారు చిరునవ్వుతో రిసీవ్ చేసుకున్నారు. ఆయన శ్రీమతి కూడా మమ్మల్ని చాలా ఆప్యా యంగా రిసీవ్ చేసుకున్నారు. మర్నాడు ఉదయం a యూనివర్సిటీ క్యాంపస్ చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది కొత్తగా కట్టిన బిల్డింగ్స్ రోడ్డు కు పక్కాగా ఎన్నో గులాబి చెట్లు గులాబీ పూలు విరగబూసి వున్నాయి చలి కాలంలో అలా పూస్తాయేమో అనిపించింది . మా వారు కొత్తగా చేరారు కాబట్టి క్వార్టర్ అపుడే ఇవ్వలేదు .సో ఊర్లోనే తెలుగు ఫ్యామిలీస్ వున్న చోట ఇల్లు తీసికొని చేరాము. ఆరోజు రావుగారు తో కలసి సామాన్లు అన్నీ తీసుకొని యింట్లో చేరాము ఆరోజు నేను ఏదో. సహాయం చేస్తుంటే ఆవిడే వంట చేసింది . ఏమిటీ వంట గురించీ ఇంత గా రాస్తున్నది అనుకుంటున్నారు కదా. పుట్టి పెరిగింది అంతా జాయింట్ ఫ్యామిలీ పెద్ద గా వంట చెయ్యాల్సిన అవసరం లేదు .పోనీ నేర్చుకుందాం అని ఇంట్రెస్ట్ లేదు ఎపుడూ ఫ్రెండ్స్ సినిమాలు తిరగటం లాంటివి బాగా అలవాటు ఎందుకో మా అమ్మ గారు కూడా వంట నేర్చుకోమని బలవంతం చేయలేదు. మా వదిన ఎపుడయినా ఏదయినా నేర్చుకో అంటే చూద్దాంలే అని తప్పించు కోవడం వల్ల గట్టిగా ఏది ఎలా చేయాలి అని తెలియదు. మర్నాడు ఉదయమే మా వారు పేపర్ సీరియస్ గా చదువుతుంటే టీ పెట్టనా అని అడిగాను రెండు రోజుల రావు గారి ఇంట్లో అవిడ టీ నే యిచ్చింది. టీ వద్దు కాఫీ పెట్టు అంటూ పేపర్ లో నుంచే ఆన్సర్ వచ్చింది మరల ఆయనే నిన్న నెస్కేఫ్ తెచ్చాము. ఒక స్పూన్ ఆ పొడి. ఒక స్పూన్ షుగర్ వేడి పాలల్లో వేసి కలిపి ఇవ్వు అన్నారు. తూ ఛ తప్పకుండా అలాగే ఆ చిక్కటి పాలల్లో వేసి ఇచ్చాను . ఒకే ఒక సిప్ రుచి చూసి వంట రాదు అన్నావు కాఫీ కలపటం కూడా రాదు అనుకుంటా అన్నారు. నాకు డికేషన్ తో అయితే వచ్చు అని చెప్పాను. మీరు అంతా అనుకోవచ్చు . ఇది కూడా తెలియదా అని కానీ ఆరోజుల్లో మా ఊర్లో అసలు ఇంస్టెంట్ కాఫీ అని వుంటుంది అని తెలియదు ఇంక మా వారు ఏమి ఎక్సపెరిమెంట్స్ చేయకుండా దగ్గర లో వున్న తెలుగు వాళ్ళింట్లో వంట లో ఏ బి సి డి లు నేర్చు కోమని దింపి తను హాస్టల్ లో తింటానని యూనివర్సిటీ కి వెళ్లారు
Comments