top of page
Search

స్నేహం 2

  • murthydeviv
  • Jan 19, 2025
  • 2 min read

నేను ముందే వ్రాసినట్లు కొంత మంది తో బంధుత్వం వున్నా కూడా నాకు వాళ్ళ మధ్య వున్న స్నేహ బంధం వలన ఆత్మీయత పెరుగు తుందేమో అనిపిస్తుంది. వయసు తేడా వున్నా వాళ్ళు చూపించే ఆత్మీయత వలన మనకు దగ్గర అవుతారు అనిపిస్తుంది. మనం చిన్నప్పుడు విషయాలు రాయాలంటే మనకు గుర్తు వున్నప్పటి నుండీ రా స్తాము. అందుకే నేను నా ఊహ తెలిసినప్పటి నుండి అని రాస్తాను. మా పెద్ద నాన్న గారికి ఒక్కతే కూతురు, నా కంటే బాగా పెద్ద, అప్పటికే మా అక్కయ్య కు పెళ్ళి అయింది. ఇంట్లో ఈ అక్కయ్య వుండేది. ఒక్కతే కూతురు కదా తనకు కొంచెం గారాబం ఎక్కువే వుండేది. పెద్ద నాన్న గారు సినిమాలకు ఎక్కడికన్నా వెళ్ళినా అక్కయ్య తో పాటు నన్ను తీసుకొని వెళ్ళే వారు. తను సంగీతం నేర్చుకునేది, వయొలిన్ కూడా బాగా వాయించేది. పెద్దనాన్న గారు నన్నూ సంగీతము కు కూర్చో పెట్టే వారు కానీ నాకు అది అంత వంట పట్ట లేదు. ఇప్పటికీ గిరిరాజ సుత తనయా,, చల మెలరా,, అనే కృతులు వింటే అక్కయ్య గుర్తు వస్తుంది. నేను సా, పా లు. నేర్చు కోవటానికి తిప్పలు పడినపుడు అక్కయ్య వాయించిన కృతులు అలా జ్ఞాపకాలలో మిగిలి పోయాయి. సంగీతము రాలేదు కాబట్టి మా అమ్మ గారు ఎంబ్రాయిడరీ లో అక్కయ్య కు శిష్యరికం చేయమన్నారు. అక్కయ్య ఎంత సున్నితంగా గా మాట్లాడేదో అంత నాజూకు గా ఎంబ్రాయిడరీ చేసేది. అన్నీ పన్లు అంత నాజూకుగా చేసినా, నిదానముగా చేయటం వలన రావల్సిన మెప్పుదల రాలేదు అనిపిస్తుంది. తను ప్రేమ గా మాట్లాడినా పాట పాడినా చల్లటి గాలి వీచినట్లు హాయిగా అనిపించేది. అలా మా యిద్దరి మధ్య వయసు తేడా వున్నా ఒక స్నేహ బంధం ఏర్పడింది అని ఇపుడు అనిపిస్తుంది. మేము పెద్ద అయ్యాక కూడా చాలా సార్లు కలుసుకున్నాము. మా పిల్లల పెళ్ళిళ్ళ కు వచ్చి మా ఇంట్లో ఉన్నది. నా చిన్న తనంలో కొంచెం చిరాకు పడినా అలా ఉండకూడదు, ఓర్పు గా వుండాలి అని చెప్పేది. తను ఎపుడూ చాలా ఓర్పు గా వుండేది. ఏ ఆడవాళ్ళ కయినా వాళ్ళ టాలెంట్ తెలియాలంటే భర్త సహకారం వుండాలి అనుకుంటాను.e రోజు ఈ స్నేహం గురించి రాస్తుంటే అక్కయ్య గుర్తు వచ్చింది. అన్నట్లు తను మా అత్తయ్య తో కలిసి కీర్తనలు బాగా పాడేది. పురయ మమ కామం అని నారాయణ తీర్దుల కీర్తన చాలా బాగా పాడేది. అప్పట్లో సినిమా పాటలు తప్పితే వీటి గురించి తెలియదు కదా. ఇపుడు అత్తయ్య ను అక్కయ్య ను తలచుకుంటూ రోజూ వింటాను. మా పెళ్ళి లో కూడా పాడారు అని మా వారు చెప్పారు. మరి ఆపుడు సినిమాలే లోకము కదా. మాకు ఇవేమీ పట్టేవి కాదు.

 
 
 

Recent Posts

See All
పెళ్లి సంగీతం

ఈ రోజు ఉదయాన్నే ఎమ్ ఎస్ అమ్మ పాడిన అన్నమాచార్య గీతాలు వెతుకు తుంటె పూరయ మమ కామమ్ కీర్తన కనిపించింది. ఆ కీర్తన కృష్ణ లీలా తరంగిణి లో వింటుంటే చాలా ఆనందం తో పాటు అనేక పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్

 
 
 
బ్లాక్ అండ్ వైట్ టీ వీ

రోజూ లాగే లంచ్ అవగానే శయనించి , పాత రోజుల్లో అయితే నిద్ర పట్టిందాక ఏ పత్రిక, ప్రభ తిరగేసి కునుకు తీసే వాళ్ళం ఇప్పుడు అలాకాదు, మన అరచేతి స్వర్గం లో ముఖ పుస్తకం చూస్తే కాని నిద్ర పట్టదు ఏమయినా

 
 
 
మహా నగరం ముచ్చట్లు

ఈ మధ్య అనుకోకుండా రెండు మహా నగరాలు కి వెళ్ళాను. చెన్నై గా మారిపోయిన చెన్న పట్నం తో చిన్నతనం నుండి అనుభందం వుండేది. మా చిన్నతనం లో , మా నాయనమ్మ మా ఇంట్లో ఏ కొత్త వస్తువు తెచ్చినా పట్నం నుంచి మా అబ్బ

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page