ఎపుడో కాలేజీ లో వుద్యోగం చేస్తున్నపుడు నా స్మృతి పథంలో అనే ఆత్మ కథ బుక్ చదివాను. మాకు అంటే నాతో పాటే ఆ బుక్ చదివిన నా కొలీగ్ కి ఆ పుస్తకము చాలా నచ్చింది. అందులో కోటేషన్స్ కొన్ని ఇద్దరం నోట్ చేసి పెట్టుకున్నాము. ఆరోజుల్లో వుండే సున్నితమైన భావాలు కొందరికి జీవిత ప్రవాహము లో మాసి పోతాయి. ఆ పుస్తకం మరలా ప్రింట్ లోకి వచ్చిందని తెలిసి కొని దాదాపు 60ఏళ్ళ తర్వాత మరలా చదువుతున్నాను. ఇపుడు కూడా ఆ పుస్తకం చాలా బాగుంది అనిపిస్తున్నది. స్నేహం గురించి రాస్తాను అని ఇలా ఏదో రాస్తున్నాను అనుకుంటు న్నారు కదా. ఆ రచయిత స్నేహం గురించి చాలా బాగా రాశారు. సృష్టి లో తీయనిది స్నేహమేరా అని ఇంకో కవి కూడా పాట రాశారు. సరే ఈ రచయిత అయితే అన్నిటికన్నా గొప్ప స్నేహం భార్య భర్తల మధ్య ఉండే బంధం అని వ్రాశారు. అయితే ఈ రోజుల్లో ఇళ్ళల్లో పెళ్ళి చూపులు లేవు. తండ్రుల కన్నా తల్లులు ముందు సంప్రదాయం, కుటుంబం గురించీ కాకుండా సాఫ్ట్ వేర్ వుద్యోగం కావాలి అనుకుంటారు అమ్మాయిలు ఎంత పాకేజ్, ఇళ్ళు ఎన్ని వున్నాయి, యి. ఎమ్. ఐ.ఎన్ని కట్టాలి,హోటల్స్, ఫారిన్ ట్రిప్, హాలీడే ట్రిప్స్ వీటి గురించి మాట్లాడుకుని , పెళ్ళి ఎక్కడ ఎంత గ్రాండ్ గా జరగాలి ఇవే ముఖ్యాంశాలు. ఇంక వాళ్ళ పెళ్ళి అయ్యాక స్నేహం ఎక్కడ కలసి వుంటే అదే గొప్ప. అదీ ఈ నాటి పరిస్థితి. కానీ పూర్వం రోజుల్లో అయితే అన్నదమ్ముల తో అక్క చెల్లెళ్ళ బంధువులలో ఒక ఈడు పిల్లలు మధ్య స్నేహం ఏర్పడేది. ఆపుడు జాయింట్ ఫ్యామిలీ వుండేవి తరచూ కలుసుకునే వాళ్ళు. కొన్ని అలాంటి స్నేహాలు గురించి రాస్తాను. ఆ స్నేహం అన్నాచెల్లెళ్ల మధ్య కూడా ఉండవచ్చు. అయితే అపుడు అది స్నేహం అని తెలియదు. నా ఊహ తెలిసినప్పటి నుండి నేను, మా అత్తయ్య కూతురు, మా పెద్ద నాన్న గారి మనవ రాలు ముగ్గురము కలిసి తిరిగే వాళ్ళం. మా అత్తయ్య కూతురు అయితే తనకు ఎక్కువ ఫ్రెండ్స్ లేరు. నాతోనే ఎక్కువ క్లోజ్ గా ఉండేది. స్కూల్ లో గానీ కాలేజీ లో కానీ నేను ఎవరి తో నయినా ఎక్కువ క్లోజ్ గా వుంటే కొంచెం బాధ పడేది. నేను ఎపుడూ వాళ్ళ కన్నా నీవే నాకు ఎక్కువ అని ప్రూవ్ చేయాల్సి వచ్చేది. మేము ఎంతగా కలిసి తిరిగే వాళ్ళం అంటే ఒకళ్ళం ఎక్కడన్నా కనిపిస్తే రెండో వాళ్లు ఎక్కడ అని అడిగేవాళ్ళు. స్కూలు లో కాలేజీ లో కలిసి వున్నా రోజు మార్చి రోజు ఫోన్లో మాట్లాడుకుంటూ వుండేవాళ్ళం. అపుడు ల్యాండ్ లైన్ ఫోన్లు కదా, మధ్యలో ఆపరేటర్ కనెక్టు చేయాలీ. నేను ఫోన్ ఎత్తి హాల్లో అన గానే ఆ ఆపరేటర్ 14, నా 39 నా.అని అడిగే వాడు. వాడికి తెలుసు ఆ రెండూ నా స్నేహితులు ఫోన్ నెంబర్ లు అని, ఇంక మా అత్తయ్య కూతురు అయితే నా ఫోన్ కనెక్ట్ చేసేవాడు. వాడికి తెలుసు నా తోనే మాట్లాడుతుంది అని. పెళ్ళిళ్ళు లో మా యింకో ఫ్రెండ్ మా అక్కయ్య కూతురు కూడా కలిసేది ముగ్గురము కలిసి తిరిగే వాళ్ళం పాటలు పాడే వాళ్ళం. భోజనాల దగ్గర కూడా మాలో ఒకరు ఎక్కడైనా కూర్చుంటే యింకో రెండు సీట్లు వదిలి మిగతా వాళ్ళు కూర్చునే వారు. మా పెళ్ళి అయ్యాక కూడా మా స్నేహం అలాగే కంటిన్యూ అయింది. నేను జాయింట్ ఫ్యామిలీ అయినా ఎలాగో వీలు చూసుకుని కలుసు కుంటు వుండేవాళ్ళం. తను చాలా సిస్టమాటిక్ గా ఉండేది. అన్ని పనులూ టైమ్ ప్రకారం చేస్తూ ఎపుడూ ఇల్లు నీట్ గా ఉంచేది. ఎపుడూ హిందీ పాటలు వింటూ పనులు చేస్తూ వుండేది. తను ఫోన్ చేసింది అంటే ఇంక టైమ్ చూడక్కర్లేదు సాయంత్రం నాలుగున్నర అయినట్లు, హాల్లో అనగానే ఏమిటే ఫోన్ అన్నా చేయవు అనే మాట తో మొదలు, నేను ఏవో సాకులు చెబుతూ నేను జాయింట్ ఫ్యామిలీ కదే అని సానుభూతి పొందటానికి ట్రై చేసేదాన్ని. ఎంత బిజీగా ఉన్నా నెల కొకసారి అయినా ఇద్దరము కలసి సినిమా కో, హోటల్ కో వెళ్ళేవాళ్ళం. ఎపుడు మా యింటికి వచ్చినా నేను చాలా బాగా కలిపాను అనుకుంటూ కాఫీ ఇచ్చేదాన్ని. కానీ నీకు కాఫీ కలపటం రాదే అనే సర్టిఫికేట్ ఇచ్చేది. నేనూ నవ్వుతూ అవునే నేను నీ లాగా చిన్నప్పటి నుండీ కాఫీ తాగేదాన్ని కాదు కదా అనే దాన్ని. ఇద్దరము నవ్వుకునే వాళ్ళం. అనూహ్యమైన పరిస్థితుల్లో భగవంతుడు నుండి పిలుపు వచ్చి నా చిన్ననాటి స్నేహితురాలు నాకు దూరం అయింది. చివరి దశలో కూడా నేను చాలా సార్లు కలిసి దైర్యం చెప్పాను కానీ, భగవంతుని నిర్ణయం వేరే గా వున్నది. ఇప్పటికీ నాలుగున్నర అయితే తన ఫోన్ గుర్తు వస్తుంది తను ఆచ్చు వైజయంతి మాల లాగా వుండేది ఏ పాట విన్నా సినిమా చూసినా మనసులో మెదుల్తూ వుంటుంది. మేము ఇద్దరం కలిసి చూసిన ఆఖరి సినిమా లా గాన్ అమీర్ ఖాన్ సినిమా. ఈ రోజు తన కూతురు నన్ను కలవటానికి వచ్చింది. మనసు అంతా తన జ్ఞాపకాలతో నిండి పోయింది. ఇప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాలి అనిపిస్తుంది.
స్నేహం
murthydeviv
Comments