సౌందర్య లహరి 2
- murthydeviv
- Dec 21, 2024
- 1 min read
సాధారణంగా మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరులను త్రిమూర్తుల గా పేర్కొను చుందుము. ఆచార్యుల వారు బ్రహ్మ, విష్ణువు,, రుద్రుడు, ఈశుడు, సదాశివుడు అని పంచ మూర్తులను పేర్కొని ఉన్నారు. మొదటి శ్లోకం లో శ్రీ ఆచార్యుల వారు శివుడు
శక్తి తో కూడి వుండి ఈ చరా చర జగత్తు ను నడుపుతున్నారని, ఆమె హరి హర విరించా దులుకు కూడా ఆరాధ్యురాలని
చెప్పి యున్నారు.24,25,84, శ్లోకముల లో ఈ భావము నే వర్ణించి ఉన్నారు. ఆచార్యుల వారు దేవీ మహిమను, భావములను పెక్కు విధములు గా వర్ణించి ఉన్నారు. 8,9,10, 35, శ్లోకములలో, కుండలినీ శక్తి యొక్క ఆరోహణ అవరోహణ క్రమం ను వర్ణించ ఉన్నారు.. పదకొండవ శ్లోకము లో శ్రీ చక్ర వర్ణన,32 శ్లోకములో , పంచ దశా క్ష రీ మంత్రమును గూఢము గా
సంకేత పదము లలో చెప్పి ఉన్నారు. ఆచార్యుల వారు స్తోత్రములను రచించిను, మహా భాష్యము లను రచించినా అద్వైత తత్వము నే ప్రత్యక్ష ముగానో , పరోక్ష ముగనో సూచించు చుందురు.22 శ్లో కములో భవానీ త్వ దా సే, అను శ్లోకము లో
భవానీ నీవు నీ దాసుడనైన నా పై దయతో కూడిన దృష్టి ప్రసరింప చేయుమని నుతింప గోరుచు ఎవరు భవానీ నీవు అనిమాత్రం పలుకుదురో వారికి వెంటనే, విష్ణువు బ్రహ్మ ఇంద్రుడు, మున్నగు వారి ప్రకాశించు కిరీటములచే నీ రాజితములైన పదములు గల నీ సాయుజ్య పదవి నొసగుదవు అని, తత్వమసి అను మహా వాక్య అర్థము స్పురించు నట్లు అద్వైత భోధ చేసినారు. ఇందులోని మహా వాక్యము అంటే ఏమిటని మీకు అనుమానం రావచ్చు. నాకూ వాటి గురించి అంతగా తెలియదు. మహావాక్యాలు అని మా అత్త గారు కూడా జపము చేసే వారు . సౌందర్య లహరి గురించి ఇంకా కొన్ని విశేషాలు రేపు తెలుసుకుందాము . శ్రీ మాత్రేనమః
Comments