సౌందర్య లహరి1
- murthydeviv
- Dec 21, 2024
- 1 min read
శ్రీఆదిశంకరచార్య రచించిన సౌందర్యలహరి స్తోత్రమ్ వంద శ్లోకా లతో కూడినది. మొదటి 41 శ్లోకాలలో తంత్రం, యంత్రము, మంత్రం చోటు చేసుకున్నాయి. మిగిలిన 59శ్లోకాల లో అమ్మ వారి సౌందర్యం వర్ణింప బడింది.. ఈ గ్రంథం మొత్తం ఒక మంత్ర శ్రా స్టం గా భావి స్తున్నారు. ప్రతి శ్లోకానికి ఒక ప్రత్యెక మైన యంత్రం వున్నది. ప్రతి శ్లోకం ఒక మంత్రం గా భావించి, నియమం తో , భక్తి శ్రద్ధలతో చదివిన వారికీ వాంచితార్థములు నెరవేరుతాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. నాకోసం ప్రత్యేకంగా ఏది ఇవ్వమని నేను అడగను నాకు ఏది మంచిది అనుకుంటావో దాన్ని నీవే నాకు ప్రసాదించు అనే భావము తో సౌందర్య లహరి చదివితే మన కామితా ర్దములు నెరవేరుతాయి.
సౌందర్య లహరి గురించి లోకములో ఒక జనశృతి ప్రచారంలో వున్నది. శంకర భగవత్పాదుల కైలాసము నకేగి ఐదు శివ లింగములను తెచ్చిరట.a ఐదు శివ లింగములే ఈ నాటి వరకు శ్రీ శంకరా చార్య లు స్థాపించిన ఐదు శంకర మఠం ములలో ఆచార్యుల చేత పూజలు అందుకొనుచున్నవి. ఆచార్యుల వారు కైలాస ము నకు వెళ్ళినపుడు శివుడే వారికి సౌందర్య లహరి ప్రసాదించి నట్లు ఒక జన శ్రుతి. ఆచార్యుల వారు దానిని గ్రహించి వచ్చుచుండగా నందికేశ్వరుడు ఆ గ్రంథమును లాగుకొనేనట. అపుడందలి 41శ్లోకములు ఆచార్యుల వారి చేతికి అందగా మిగిలిన 59శ్లోకము లు నందికేశ్వరునకు చిక్కెనట. ఆచార్యుల వారు భూలోకమునకు వచ్చి మిగిలిన 59శ్లోకము లను శ్రీదేవి అనుగ్రహముతో శివుడు రాసి నట్లే యథాతథంగా రచించి ఉన్నారట . సౌందర్య లహరి యందు శ్రీదేవి అజ్ఞ చేతనే జగత్ సృష్టి స్థితి లయ ములు జరుగు చుండు ననియు ఆమె సర్వ దేవతా రాధ్యు రాలని చెప్ప బడింది. ఆచార్యుల వారు విష్ణు సహస్ర నామము నకు లలితా త్రిశతి నామాలు లకు భాష్యము లు రాసి ఉన్నారు. మరి ఎందు చేతనో లలితా సహస్రనామ స్తోత్రము కు భాష్యం. వ్రాసి వుండలేదు.. కానీ ఆ లోపమును సౌందర్య లహరి రచనముచే పూరించి రని చెప్పవచ్చును . ఎలా అనిన లలితా సహస్రనామ స్తోత్రము లోని నామములు సౌందర్య లహరి శ్లోకములు లో వివరింప బడినవి. ఆ వివరాల తో రేపు కలుసుకుందాము
శ్రీమాత కృప మీ అందరికీ లభించాలని కోరుకుంటూ శ్రీ మాత్రేనమః.
Comments