top of page
Search

శ్రావణ భాద్రపదాలు

  • murthydeviv
  • Aug 14
  • 4 min read

ఈ రెండు నెలలు అందరికీ తెలిసినవే కదా రాయటానికి ఏముంటుంది అనుకుంటారేమో, కాదేది కవిత కి అనర్హం అన్నట్లుగా పెన్ చేతిలో ఉంటే, సారి ఇపుడు పెన్ను అక్కరలేదు కదా ఐ పాడ్ లో కొట్టుకుంటూ కూర్చోవచ్చు. చిన్నతనం లో మా నాయనమ్మ ఒక కథ చెప్పేది. ఆరోజుల్లో మనం పెద్దవాళ్ళు ఏమి చెప్పినా నోరు మూసుకుని బుద్దిగా వినేవాళ్ళం. ఇంతకీ ఆ కథ ఏమిటంటే ఒక బ్రాహ్మణుడు ఏదో ఊరు వెళ్తూ ఇంట్లో లోపము లేకుండా బియ్యం పప్పులు అన్నీ రెడీ గా పెట్టీ శ్రావణ భాద్రపదాలు వస్తాయి అన్నీ జాగ్రత్తగా వాడుకో, నేను పనుల చూసుకొని వస్తాను అని చెప్పి వెళ్ళాడుట. శ్రావణం కదా ఎదో పెళ్ళిలు చేయించటానికి అని ఇప్పుడు ఆ కథ గుర్తు వస్తే అనుకుంటాను. ఆయన అటు వెళ్లగానే ఇద్దరు దొంగలు వచ్చి మేమే శ్రావణ భాద్రపదాలము అని ఆ ఇంట్లో ఒక పది రోజులు ఉండి పోయారు. నాకు మాత్రం శ్రావణ మాసం రాగానే మా అమ్మ గారు గుర్తు వస్తారు. జూన్ నెలలో స్కూల్, కాలేజీ తెరవ గానే మా నాన్నగారు బట్టలు షాప్ నుండి కొత్త బట్టలు తీసుకోమనేవారు షాపు మాదే కాబట్టి ఆయన చెప్పిన వాటికంటే ఇంకా కొన్ని ఎక్కువగా తీసుకునే వాళ్ళం. ఆరోజుల్లో స్కూల్ డ్రెస్ గోల లేదు కదా, స్కూల్ తెరచిన రోజు నుండి కొత్త క్లాస్ కొత్త పుస్తకాలు కొత్త డ్రెస్ తో వెళ్ళాలని మహా కోరిక గా వుండేది. కానీ మా అమ్మ గారు మాత్రం శ్రావణ మాసంలో కొత్తవి వేసుకోవచ్చు,అని ఆబ్జెక్ట్ చేసేవారు. ఆరోజుల్లో ఏ మాసం ఎపుడు వస్తుందో తెలియదు కదా, ఆషాఢ మాసం గోరింటాకు పెట్టగానే హమ్మయ్య ఇంక శ్రావణమాసం వచ్చేస్తున్నది, ఇంక రోజూ కొత్త బట్టలు చూసి కాకుండా వేసుకుని సంతోషించవచ్చు అనుకునే వాళ్ళం. శ్రావణ మాసం రాగానే ప్రతి మంగళ వారం, శుక్రవారం తలంటి పోసుకుని కాళ్ళ కు పసుపు రాసుకుని తల లో ఇన్ని పూలతో స్కూలు కి వెళ్ళేవాళ్ళం. కొత్త బట్టలు కి పసుపు పెట్టీ దేవుడికి నమస్కారం చేసి వేసుకోవాలి. శ్రావణ మాసం లో ఇంట్లో అక్కయ్యలు ఎవరయినా నోములు నోచుకోవడం ఉంటే ఇంకొచెం హడావిడి వుండేది. ఆరోజుల్లో మన పెద్ద వాళ్ళు ఏ చిన్న పండుగ వచ్చినా ఇల్లు అంతా కడిగించి ముగ్గులు వేసి అంత మంది పిల్లలు ఉన్నా ఉదయాన్నే తయారు చేసేవాళ్ళు. ఇపుడు వుండేది ఒకరు ఇద్దరు అయినా వాళ్ళ ను లేపటానికి, తయారు చేయటానికి ఒక పెద్ద యజ్ఞము చేయాలి. శ్రావణ శుక్రవారం రోజు జడ వేయించడానికి యింకో యుద్ధం జరుగుతుంది. మధ్యలో నేను కొంచెం గొంతు పెద్దదిగా చేస్తే జడ తో లంగా తో వస్తారు. ఈ మధ్య మా మనవరాలు కి ఎదో ప్రైజ్ వస్తుంది అని వాళ్ళ స్కూలు కి వెళ్ళాము. అక్కడ వచ్చిన వాళ్ళు, ప్రిన్సిపాల్ తో సహా ఒక్కరూ జడ తో లేరు. అందరూజుట్టు విరబోసుకున్న వాళ్ళే. వాళ్ళు నీ చూస్తూ ఉంటే ముందు మన బామ్మలు గుర్తు వస్తారు అలా జడ వేసుకోకుండా ఒక నిమిషం అటూ ఇటూ తిరుగుతూ ఉంటే ఏమిటి అలా దయ్యం లాగా అనే వాళ్ళు . వాళ్ళని చూస్తే నాకు రెండు లలిత గీతాలు గుర్తు వస్తాయి తల నిండ పూ దండ దాల్చిన రాణి అనీ, చుక్కలు తో నొక్కసారి సూచింతును నా కన్నె యా నల్లని వా లు జడ లోపల మల్లీయ నై వెలగా లని అంటూ ఘంటసాల గారి పాటలు గుర్తు వస్తాయి. ఈ రోజుల్లో అలాంటి పాట లు లేవు ఎక్కడో తప్పితే అలాటి జడలు లేవు. శ్రావణ శుక్రవారం నోము మా ఇంట్లో ఎందుకో చేసే వారు కాదు కానీ అమ్మగారు మేము మా అత్తయ్య గారింట్లో చేసుకునే వాళ్ళం. మా అత్తయ్య గారు అమ్మవారిని పెద్ద విగ్రహం లాగా అలంకరించి పెట్టే వారు. ఇప్పుడు లాగా విగ్రహం కొనడం లేదు చేత్తో నే చేసి అలంకారం చేసే వారు. ఇప్పటికీ ఆ పెద్ద హాలు ఆ అలంకారం. ఆప్యాయత అన్నీ గుర్తు వస్తాయి. నేనూ హైదరాబాద్ వచ్చాక అలాగే అమ్మ వారిని అలంకారం చేయడం నేర్చుకున్నాను . మా ఇంటి చుట్టు పక్కలు అందరూ అమ్మ వారిని చేతితో చేసి అలంకరణ చేసే వారు. మా ఇంటి పక్కన ఒక పెద్ద ఆయన ఎంతో ఓపికగా అమ్మ వారి మొహం చేసి అలంకరణ చేసే వారు. ఆ రోజుల్లో ఆ పేరంటాలు తో చాలా హడావిడి వుండేది. కృష్ణా అష్టమి, అవీ అవగానే కొంచెం రిలాక్స్ అనుకుంటూ వుండ గానే చవితి పండుగ వచ్చేది.ఆ రోజుల్లో పత్రీ కొనడం లేదు కదా, ఉదయాన్నే అన్నయ్యలు పత్రీ కోసం వెళ్ళే వారు , వాళ్ళు వచ్చే లోపల అన్నీ అమర్చి పెట్టడం మా ఆడపిల్లల వంతు. ఆరోజుల్లో నేను ముగ్గులు అవీ నేర్చుకోలేదు కానీ మా చెల్లెలు మాత్రం బాగా ముగ్గులు వేసేది. వినాయక చవితికి అప్పట్లో ఇన్ని చోట్ల గణేష్ విగ్రహాలు పెట్టే వాళ్ళు కాదు ఒక గణపతి గుడి దగ్గర నవరాత్రులు చేసే వారు. ఇప్పటి లాగా పాటలు తో, డీజే లతో హోరు వుండదు. చాలా ఆహ్లాదంగా వుండేది. మా ఇంటి దగ్గర గుడిలో వినాయక చవితి సినిమా లో పాటలు అయ్యాక నమో వేంకటేశ అనే ఘంటసాల గారి పాట, తర్వాత శేష శైల వా సా తో ముగించే వారు. మేము హైదరాబాద్ వచ్చాక కూడా ఎక్కువగా ఓల్డ్ సిటీ లో పెట్టే వారు. ఖైరతాబాద్ గణపతి అప్పటినుండి పెట్టే వారు. ఆ రోజుల్లో వినాయక మండపము లో చక్కటి డ్రామాలు, క్లాసిక్ డ్యాన్స్ లు పెట్టే వారు. ఒక్క సారి మాత్రమే ఓల్డ్ సిటీ లో అన్నీ వినాయకులు ను చూసి వచ్చాము. ఇపుడు అయితే పదకొండు రోజులు చేస్తున్నారు కానీ మా చిన్నతనం లో మూడో రోజు నే మట్టి వినాయకుడిని చెట్లు లో పెట్టే వాళ్ళం. ఎక్కువగా వినాయక చవితికి అన్నయ్య ల డ్యూటీ వుంటుంది. మేము మా పుస్తకాలు పెట్టుకోవటం పూజ చేసుకోవటమే. చవితి పండుగ అవగానే దసరా పండుగ హడావిడి చాలా వుండేది. ఆ పది రోజులు పెద్ద యజ్ఞం చేసినట్లు వుండేది నాకు. ఎలిమెంటరీ స్కూల్లో అయితే కోలాటం ఆడటం చాలా సరదాగా వుండేది. టీచర్లు అందరి ఇళ్లకు తీసుకుని వెళ్ళి కోలాటం ఆడించే వాళ్ళు ముందు నుండి ప్రాక్టీస్ చేయడం, పోటీలు పడుతూ వుండే వాళ్ళం.ఇప్పుడు అయితే దాండియా అని జోరు ఎక్కువగా ఉంది అనుకోండి అపుడు అయితే స్కూలు లో ముందు ప్రాక్టీస్ చేయడం తర్వాత ఇళ్ళకు వెళ్లి చేయటం ఆ పాట కూడా అందరూ గొంతు చించుకుని పాడే వాళ్ళు. అయ్యవారికి చాలు ఐదు వరహాలు, పిల్ల వాళ్ళ కు చాలు పప్పు బెల్లాలు , పాపం ఎంతో సింపుల్ గా వుండేది. పప్పు బెల్లాలు తో ఏవో పెప్పర్ మెంట్స్ ఇచ్చే వాళ్ళు, అప్పట్లో చాక్లెట్ లేవు కదా. ఇప్పుడైతే హాలోవీన్ అని మా మనవరాళ్ళు మనవడు నెలకి సరిపడా చాక్లెట్ కలెక్ట్ చేస్తారు. ఆ దసరా పదిరోజులు ఉదయాన్నే లేచి తయారయి నాన్న గారు పూజ పూర్తి చేసే సమయానికి హారతి పాట పాడటానికి రెడీ గా వుండాలి. ఆ తర్వాత దేవుడి ఊరేగింపు వచ్చే టైమ్ కి హారతి పళ్ళెం రెడీ చేసుకుని బయట వాకిట్లో రెడీ ఉండాలి.ఆ పనులన్నీ అలా ఎంతో శ్రద్ధగా చేసే వాళ్ళం. పెద్ద వాళ్ళు ఒక్క సారి చెపితే చాలు అన్నట్లు వుండేది. అంత ఉదయాన్నే లేవటం నాకు కొంచెం విసుగ్గా ఉండేది. కానీ అలాగే చేసే వాళ్ళం. ఆరోజుల్లో ఒక్క అమ్మ వారి గుడి లోనే రోజు ఒక అలంకరణ చేసి అమ్మ వారిని పెట్టే వారు. రోజూ సాయంత్రం గుడి కి వెళ్ళి వచ్చే వాళ్ళం. దసరా సందర్భంగా అమ్మ వారికి ఇన్ని రకాలుగా పూజలు చేస్తారని తెలియని రోజులు అవి. లలితా సహస్రము కూడా అందరూ చదివే వాళ్లు.కాదు. మా కజిన్ సిస్టర్ వాళ్ళ తాతయ్య గారి ఇంట్లో మాత్రం పది రోజులు అయ్యాక అందర్నీ భోజనాలు కు పిలిచే వారు. బహుశా ఆయన శ్రీ చక్రార్చన చేసే వారు అనుకుంటా. మా అత్త గారికి కూడా పండుగ లు అంటే చాలా శ్రద్ధగా పూజ లు చేసే వారు . ఇంక హైదరాబాద్ లో ప్రతీ షాపు లో నవమి నాడు ఆయుధ పూజ అని, దశమి రోజున గుమ్మడి కాయలు కొట్టి కార్లకు అన్నీ మెషిన్ లకు పూజ లు చేస్తారు. ఇక్కడ కి వచ్చాక ఆ పూజలు చేయడం అలవాటు అయిపోయింది. అలా ఏ పండుగ వచ్చినా మన చిన్న తనం లో మన పెద్ద వాళ్ళు రోజులు గుర్తు వస్తూ ఉంటాయి. మనకు మధురమైన బాల్యం నీ ఇచ్చిన మన పెద్ద వాళ్ళ ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ, దీపావళి, దీపోత్సవం లు, సంక్రాంతి సంబరాల తో ఇంకొక సారి. అలా పండుగ అనగానే ఎంత మంది పిల్లలు ఉన్నా ఓపిక గా మ్యానేజ్ చేస్తూ, ఇంటి నిండా ముగ్గులు వేసి, పిండి వంటలు చేసి కనీసం ఒక ముగ్గురు అమ్మాయిలు కయినా జడ లు వేసి ఆ మాతృ మూర్తులందరినీ తలచుకుంటే మనసుకు ఆనందం కలుగుతుంది. మరి మీకు కూడా మీ బాల్యం గుర్తు వచ్చింది కదా గుడ్ నైట్

 
 
 

Recent Posts

See All
పోస్ట్ బాక్స్

ఒక నాలుగు నెలల క్రితం యూ ఏస్ లో వున్న నా ఫ్రెండ్ కి లెటర్ రాసి మా డ్రైవర్ ను పోస్ట్ ఆఫీస్ కి పంపాను. స్టాంప్ లు వేసి పోస్ట్ లో వెయ్యమని,...

 
 
 
హిందుస్తానీ సంగీతం

అసలు సంగీతం లో ఇన్ని రకాలు వుంటాయి అని తెలుసుకోటానికి జీవితంలో ఒక పాతికేళ్ళు గడిచిపోయాయి. మా పెద్దనాన్న గారు బయటకు వెళ్లగానే సిలోన్,,...

 
 
 
నవలా పఠనం 2

ఆంధ్ర దేశం లో కి శరత్ బాబు గారు ఎలా వచ్చారో నాకు తెలియదు కానీ ఆ పుస్తకాలు అన్నయ్య తెస్తూ వుండేవాడు ఎక్కువగా నా పుస్తకాలు చదివే అలవాటు...

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page