top of page
Search

శ్రీచక్రము 3

  • murthydeviv
  • Dec 18, 2024
  • 2 min read

శ్రీ చక్రము బ్రహ్మాండం తో పోల్చ బడింది. ఈ చరా చర జగత్తు అంతా శ్రీచక్రము లో ఇమిడి ఉంది. సృష్టి కి పంచ భూతములు తన్మాత్రలు మూలమై వున్నాయి. వాటి యొక్క తత్వాలు శ్రీచక్రము లో చేర్చబడ్డాయి. ఈ. రకంగా శ్రీచక్రము విశాల విశ్వం తో పోల్చబడింది. ప్రతి మానవుని దేహమూ ఒక దేవాలయం గానూ అందులోని జీవున్ని సదాశివుని గా భావించాలి . అలాగే మానవ దేహంలో వున్న కర్మేంద్రియాలు ఙ్ఞానేంద్రియాలు మనస్సు అనే 11ఇంద్రియాల తత్వాలు శ్రీ చక్రము లో చేర్చ బడటం చేత శ్రీచక్రము మానవ దేహం తో పోల్చ బడింది . అందుకనే శ్రీచక్ర పూజను చేసినట్లయితే ఛరా చర జగత్తు ను విశ్వ మానవాళినీ పూజించి నట్లు అవుతుంది. శ్రీచక్రము లోనీ తొమ్మిది ఆవరణలు మానవ దేహం లోని వివిధ భాగాలతో సమన్వయం ఇలా వుంటుంది. బిందువు బ్రహ్మ రంధ్రం, , అష్టకోణం లలాటం, అంత ర్దశా రము భ్రూ మధ్యము , బ హి ర్థ శారం కంఠం, ఛతుర్ద శా రము హృదయము , అష్ట దళ ము , నాభి ,, షోడశ దళ ము కటి ప్రదేశం ,, వృత్త త్రయం ,, వూరువులు భూ పురం పాదములు మానవ దేహం తొమ్మిది ధాతు వు లతో కూడి ఉన్నది నవ ధాతువులు

శక్తి ధాతువులు 1 చర్మం 2 రక్తము 3 మాంసం 4మెదడు 5 ఎముక లు

శివ ధాతువులు 1 ఎముక ల లోని గుజ్జు 2 వీర్యము 3 ప్రాణము 4 జీవము

శ్రీ చక్రము ను ధ్యానించి నందు వలన మనకు మన మానసిక శ క్తులను విశ్లేషించే శక్తి కలుగు తుంది

శ్రీచక్ర నిర్మాణం మూడు రకాలుగా ఉంటుంది

1 భూ ప్ర స్తారం 2. మేరుప్రస్తా రము 3 కై లాస ప్రస్తారం

భూప్ర స్తా రము .శ్రీ చక్రా న్ని బంగారు వెండి రాగి రేకుల మీద కానీ పట్టు వ్రస్త్రం మీద కానీ లిఖించి నట్లయితే దాన్ని

భూప్రస్తారం అంటారు శ్రీశైలము కాంచీ పురం ఆలయాల్లో రాతి మీద భూ ప్ర స్ట్రారము చెక్క బడి వున్నది

దేవాలయాల్లో శ్రీ చక్రాన్ని స్థాపించ టానికి మార్గ దర్శకులు జగద్గురువు శ్రీ ఆది శంకరాచార్యుల వారే ఆధ్యులు

కాంచీ కామాక్షి దేవాలయం లో అమ్మ వారి ముందు వున్న శ్రీ చక్రాన్ని , జంబు కేశ్వరంలో వున్న అఖిలాండేశ్వరి

అమ్మ వారి కి క ర్ణ ఆభరణములు గా విరాజిల్లుతున్న శ్రీ చక్ర తాటం కాలు ఆది శంకరాచార్యుల వారు ప్రతిష్టించిన వే

భూ ప్ర స్త్రారం లో వసిన్యాది వాగ్దేవతల తా ద్యా త్యం వుంటుంది .

మేరు ప్రస్త్రారం శంఖు ఆకారంలో తొమ్మిది అంతస్తు లు గా వుంటుంది పూర్ణ మేరువు అంటారు

విజయవాడ కనదుర్గమ్మ ఆలయంలో బంగారం చేసిన పూర్ణ మేరువు వున్నది

కైలాస ప్ర స్త్ర రము ఇది అరుదైన ది ఇది మూడు అంతస్తులు గా వుంటుంది పుష్పగిరి ఇక్కడ

శృంగేరి శారదా పీఠం వారి ఒక శా ఖ వున్నది ఇక్కడ వైద్య నాథ ఆలయంలో అమ్మ వారి దగ్గర

శిలా నిర్మితమైన కైలాస ప్రస్త్రరము వున్నది

కొన్ని శ్రీచక్రము లలో బీజ అక్షరములు లిఖించి వుంటాయి ఇవి సన్యాసుల దగ్గర వుండటం మంచిది

భూ స్త్ర ర మేరు ప్ర స్త్ర రము లు గృ హస్తుల దగ్గర వుండటం మంచిది

శ్రీ యంత్రము లేదా శ్రీచక్రము గురించి నా చేత రాయించిన శ్రీ మాత కు నమస్కారం లతో

 
 
 

Recent Posts

See All
అమృత హస్తం

ఈ మధ్య మా కోడలు పుట్టిన రోజున మా పిల్లలు హోటల్ కు డిన్నర్ కు తీసుకుని వెళ్ళారు. హోటల్ పేరు ఎర్ర కారం. గుంటూరు కారం సినిమా లాగానే ఆ పేరుకు...

 
 
 
పెళ్ళి పెట్టె

మా చిన్న తనం లో పెళ్ళి జరుగుతున్న పుడు పెళ్ళి మండపం లో ఎవరో ఒక పెద్ద వాళ్ళు ఒక పెట్టె పెట్టుకుని కూర్చుని వుండే వారు. ఏ బాబాయి గారో...

 
 
 
రూట్స్

ప్రస్తుతం ఉదయాన్నే పేపర్ చూడగానే ట్రంప్ గారు ఏమి సెలవు ఇచ్చారో, ఈ గొడవల్లో మనవాళ్ళు అంతా ఎలా వున్నారో అని ఒక అనుమానం వస్తుంది....

 
 
 

コメント


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page