శ్రీచక్రము 2
- murthydeviv
- Dec 17, 2024
- 2 min read
యంత్రాల అన్నిటిలోనూ శ్రీ యంత్రానికి ప్రత్యేక స్థానం ఉంది శ్రీయంత్రంలో. అనంతమైన శక్తి నిక్షి ప్తమై ఉంది యంత్రోపాసన అన్ని ఉపాసనలు కన్నా ఉన్నతమైనది అని ఆగమ శాస్త్ర అభిప్రాయం . శ్రీ యంత్ర నిర్మాణం అత్యంత శ్రద్ద తో జరగాలి యంత్రము లో నీ ప్రతి రేఖ ప్రతి కోణం నిర్ధిష్ట పరిణామం లో వుండాలి. ఎంత చిన్న లోపం వున్నా పరిణామం అత్యంత బాధాకరం గా వుంటాయి. యంత్ర పూజ చేసేటపుడు ఎక్కువ నియమం పాటించాలి. శ్రీచక్రము లో తొమ్మిది ఆవరణ లు వుంటాయి ప్రథమ ఆవరణ, భూపురము దీన్ని త్రైలోక్య మోహన చక్రము అంటారు . ద్వి తీయ ఆవరణము,, షోడ ష దల పద్మం , సర్వశా పరి పూ ర క చక్రం అంటారు. ఈ చక్రము చంద్ర కళా స్వరూ పం పదహారు దళ్లా లోనూ పదహారు కళ లు వుంటాయి వీటినే తిథి నిత్య దేవతలు అంటారు ఈ పదహారు కళ లను ఆకర్షణ దేవతలు అని కూడా అంటారు . తృతీయ ఆవరణ అష్ట దళ పద్మం దీన్ని సర్వ సంక్షో భినీ చక్రము అంటారు . ఆవరణ దేవతలు ఎనిమిది మంది . చ తుర్థ ఆవరణం సర్వ సౌభాగ్య దాయక చక్రము అంటారు . ఆవరణ దేవతలు పద్నాలుగు మంది ఉంటారు . పంచమ ఆవరణం సర్వార్థ సాధక చక్రము అంటారు ఆవరణ దేవతలు పదిమంది. . ష ష్ఠ ఆవరణ ము సర్వ రక్ష కర చక్రం అంటారు ఆవరణ దేవతలు పదిమంది . సప్తమ ఆవరణము సర్వ రోగ హర చక్రము అంటారు ఆవరణ దేవతలు వశి న్యాది వాగ్దేవతలు ఎనిమిది మంది. అష్టమ ఆవరణ సర్వ సిద్ధి ప్రద చక్రము అంటారు . ఆవరణ దేవతలు ముగ్గురు మనం మొదట చెప్పుకున్న కామేశ్వరి వజ్రేశ్వేరి భగ మాలిని.. నవమ చక్రము బిందువు. సర్వా నందమయ చక్రము అంటారు ఆవరణ దేవత శ్రీ చక్రేశ్వరి అమే శ్రీ మాత శ్రీ రాజ రాజేశ్వరీ పరా భట్టారిక . శ్రీ చక్రము లో నీ నవ ఆవరణ దేవత లను అర్చించటమే నవరణా ర్చన లేదా
శ్రీ చక్రార్చ న. ఈ దేవతలందరూ వామకేశ్వరి తంత్రము లోని దేవి ఖడ్గ మాలా స్తో త్రమ్ లో పేర్కొన బడ్డారు . అందువల్లనే శ్రీ విద్య లో ఈ స్తోత్రమ్ కి అంత్యత ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది . రోజూ ఖడ్గ మాల చదివితే శ్రీ యంత్ర పూజ చేసిన ఫలం దక్కుతుంది . శ్రీ యంత్రము గురించి మరి కొన్ని వివరాలు తర్వాత తెలిసికుందాము శ్రీ మాత్రేనమః
Comments