శ్రీచక్రము
- murthydeviv
- Dec 17, 2024
- 2 min read
నేను ఈ విషయాలన్నీ కూడా శర్మ గారి పుస్తకం లో చదివి వ్రాస్తున్నాను. ఎక్కువ పుస్తకాలు చదవడం అలవాటు లేని వాళ్ళకు చదవటానికి అవకాశం లేనివారు అయినా కూడా తెలుసు కోవాలి అని వుద్దేశం వున్నవాళ్ళ కోసం కొంచెం క్లుప్తంగా రాస్తున్నాను ఎక్కడైనా తప్పులు ఉంటే క్ష మించ గలరు. ప్రళయ కాలంలో పంచభూతాలు అన్నీ ఒకదాని లో ఒకటి లయం అయిపోతాయి. సృష్టి లోని జీవరాశి అంతా నాశనం అయిపోతుంది . ప్రారబ్ధ కర్మ ఇంకా వున్న జీవులు తప్ప మిగిలిన వన్నీ ముక్తి నీ పొందుతాయి . ఆ ప్రారబ్ధ కర్మ వున్న జీవులు మాయ లో లీన మై పోతాయి. ఆ మాయా శ క్తి చిచ్చక్తి గా మారి బ్రహ్నందానుభూతి నీ పొందుతూ పరబ్రహ్మ యందు సామ రస్యం పొందుతుంది అట్టి స్థితి లో పరబ్రహ్మ పూర్ణ స్వరూపుడై ప్రకాశిస్తూ వుంటాడు . ఆ పరబ్రహ్మ కు పునః సృష్టి చేయాలనీ ఇచ్ఛ కలిగినపుడు తన్ను తాను రెండు భాగాలుగా విభజించు కున్నాడు . ఆ రెండు భాగాలే శివ శక్తులు, పరమేశ్వరి పరమేశ్వరుడు లేదా కామేశ్వరి కామేశ్వరుడు . ఆ పరా శక్తి యే మాయా స్వరూపిణి . ఆమె యే యావత్ సృష్టి కి మూలకారణం. ఈ రకంగా పరబ్రహ్మ విడివడిన తరువాత స్ప్రరణ తో సృష్టి ఆరంభం అవుతుంది. స్ప్ర రణ అంటే ఇంతవరకు తనతో ఉన్న క్రియా శక్తి నీ విక్షిచంటం అన్నమాట. అంటే క్రియాశక్తి జ్ఞా న శక్తి తో కలవడం వలన సృష్టి జరుగుతుంది ఈ సమయంలోనే 36తత్వము లతో కూడిన జగత్తు ఏర్పడుతుంది.. జగత్తు తో పాటే శ్రీచక్రము ఉద్భవించింది . అందుకే జగత్తు కు శ్రీ చక్రము నకు ఒకే రూపము చెప్పబడింది. సృష్టి కార్యక్రమాన్ని పరమేశ్వరి నిర్వహిస్తుంది . పరమేశ్వరుడు లోకాలను ప్రకాశవంతం చేస్తూ ఉంటారు. ఆయన తో సమానమైన వారు కానీ అధికులు కానీ లేరు . పరమేశ్వరుడు లేదా కామేశ్వరుడు లోకాలలో శ్రీవిద్య ను ప్రచారం చెయ్యటానికి ఆమె కు వివరించాడు . కామేశ్వరి లేక శ్రీదేవి యొక్క యంత్ర మంత్ర విధానాలే శ్రీవిద్య అని పిలవ బడతాయి . దీనినే ఆత్మ విద్య మహా విద్య అని కూడా అంటారు . ఈ శ్రీవిద్య ను త్రిపురో పనిసషత్తు వివరించినా యి . శ్రీ విద్య ను లోకము లో వ్యాప్తి చేయటం కోసం కామేశ్వరుడు ఊర్ధ్వ నంద నాథ అనే దీక్ష నామం ధరించి కామేశ్వరిదేవి కి శ్రీవిద్య ను ఉపదేశించి ఆమె కు మిత్రేశ దేవ నాథ అనే దీక్షా నామం నామకరణము చేశారు. ఈ రకంగా కామేశ్వరి కామేశ్వరులు దీక్షా నామం ధరించి సర్వానందమైన ఓ డ్యాణ పీఠం లో. పురాణ దంపతులు గా ఉన్నారు తరువాత పరమేశ్వరుడు లక్ష్మి నారాయణులకు వాణి హిరణ్య గర్బులకు శ్రీవిద్య ను ఉపదేశించి వారికీ దీ క్ష నామములు ఇచ్చారు బిందు మండల వర్తినియైన కామేశ్వరి దేవి త్రికోణం లోని ఉత్తర కోణం లోని శక్తి . . శ్రీచక్రము లో ఉన్న వజ్రేశ్వరి భగ మాలిని లక్ష్మీ వాణి స్వరూపాలే . దీక్ష నామములు ధరించిన నారాయణుడు హిరణ్య గర్భుడు శ్రీవిద్య ను దివ్యు లైన ఇంద్రాది దేవతల కు ఉపదేశించారు . వారు సనక సనంద నాదులకు వారు క్రమం గా మానవులకు ఉపదేశించారు . ఈ విధముగా గురు పరం పరం గా శ్రీవిద్య భూలోకం లో వ్యాప్తి చెందింది శ్రీవిద్య చాలా pరహస్యమైనది గురుముఖం గానే తెలుసుకోవాలి . ఈ పంచ దశి మంత్రం ఇప్పటికీ దీక్షా నామం తోనే ఇస్తారు . ఈ దేవీ ఊపా సుకులలో 12 మంది ముఖ్యు లు వారు చంద్రుడు, మనువు, కుబేరుడు, లోపాముద్ర, మన్మథుడు , అగస్త్యుడు, అగ్ని సూర్యుడు, ఇంద్రుడు, ష న్ముఖుడు దుర్వాసుడు, ఈశ్వరుడు . ప్రతి దేవతకు ఒక ప్రత్యెక మైన యంత్రము వుంటుంది సాధరనంగా శివ పూజలో విష్ణు పూజ లో యంత్రము లో వాడరు దేవాలయాల్లో ప్రతిష్ట చేసేటపుడు మూలవిగ్రహం కింద దిగువ భూమి లో యంత్రము లను ప్రతిష్ట చేస్తారు ఒక్క పరమేశ్వరి ఆలయం లోనే యంత్రము కు మూలవిగ్రహానికి పూజ చేస్తారు . అంబా రూపమైన శ్రీ యంత్రము కు చేసే పూజ విశిష్టమైనది మిగతా విశేషాలు రేపు తెలుసుకుందాము. శ్రీ మాత్రేనమః
Comments