top of page

వంటొచ్చిన మగాడు

murthydeviv

ఇదేమి చోద్యం ఈ కథ ఏమిటి అనుకోకండి. ఎపుడో ఒక 50 ఏళ్ళ క్రితం భమిడి పాటి రామ గోపాలం గారు ఈ కథ రాశారు. కథ చాలా బాగుంటుంది. నా దగ్గర ఆయన కథలు అన్నీ కలిపి ప్రింట్ చేసిన బుక్ కూడా వున్నది. ఎపుడయినా లైట్ గా ఏదయినా చదవాలి అనిపిస్తే ఈ కథలు చదువుతూ వుంటాను. ఈ మధ్య ఏదో మ్యాగజైన్ లో కూడా వంట చేయటం కూడా ఒక క్రియేటివిటీ,అది కూడా ఒక వృత్తి లాగా వుండటం వలనే ఇపుడు కాటరింగ్, హోటల్ మేనేజ్ మెంట్ కోర్స్ లు పాపులర్ అవుతున్నాయని రాశారు. మన పురాణాల్లో కూడా నలుడు,భీముడు, వంటలు గుఱించి గొప్పగా రాశారు అని కోట్ చేసాడు. అయితే బేసిక్ వంట రాని వాళ్ళు ఈ రోజుల్లో ఎవరూ వుండరు కదా, కారణం సింగిల్ ఫ్యామిలీ కుక్కర్లు గ్యాస్ స్టవ్ ఎలక్ట్రిక్ కుక్కర్ లు కూడా చాలా మంది వాడుతున్నారు. ఏదో అన్నం పప్పు, అందరూ చేయగలుగుతారు. ఇంక అదీ కాకపోతే స్విగ్గీలు అందరికీ అందుబాటులో వున్నాయి. ఒక 50ఏళ్ళ క్రితం జాయింట్ ఫ్యామిలీ లో పెరగటం వలన నాకూ వంట ఏమి వచ్చేది కాదు. బేసిక్స్ నాకు మా వారే నేర్పారు. ఎందుకంటే ఆయన సింగిల్ ఫ్యామిలీ లో నుంచి వచ్చారు. తర్వాత నేనూ చాలా నేర్చుకున్నాను. ఇంతకీ ఈ వంటల కథ ఎందుకు రాస్తున్నాను అంటే నిన్న మా అమ్మాయి తన స్నేహితురాలి నాన్న గారికి 80 ఇయర్స్ పుట్టిన రోజు సందర్భంగా పార్టీ ఇస్తున్నారు,అని నన్నూ తీసుకొని వెళ్ళింది. ఆయన I.I.T లో ప్రొఫెసర్ గా చేసీ రిటైర్ అయి హైద్రాబాదు లో సెటిల్ అయ్యారు. వాళ్ళకు ఇద్దరూ అమ్మాయిలు షరా మామూలుగా అమెరికా లో వుంటున్నారు. ఆ అమ్మాయి ఆమెరికా లోనే మా అమ్మాయికి పరిచయం, ఆ స్నేహం మా అమ్మాయి ఇండియా కి వచ్చేసినతర్వాత కూడా కంటిన్యూ అవుతున్నది. ఆ దంపతులు ఇద్దరూ చాలా ఆప్యాయంగా మాట్లాడారు. వాళ్ళ గార్డెన్ చాలా బాగుంది. అవిడ కూడా నాలుగు, ఐదు సార్లు ఆమెరికా వెళ్ళి వచ్చిందిట. ఇంక వెళ్ళలేము మేము ఇక్కడ హ్యాపీగా వున్నాము. మీరే మమ్మల్ని చూడాలంటే వచ్చి వెళ్ళండి అని చెప్పాను అన్నారు. చాలామంది తల్లితండ్రులు అయ్యో మీ అమ్మాయి ఎందుకు వచ్చేసింది, ఇండియాలో ఏముంది ఆంటూ వుంటారు. నాకు అవిడ అలా అననందుకు సంతోషం కలిగింది. ఆయన చాలాసేపు తను రాస్తున్న వేదిక్ మ్యాథ్స్ బుక్ గురించి చెప్పారు. తర్వాత నాకు వంట వచ్చు నాకు అది ఒక సరదా అన్నారు. నేను ఈ రోజుల్లో అందరూ చేస్తున్నారు కదా అన్నాను. ఆపుడు ఆయన అలా కాదమ్మా, నేను పులిహోర బొబ్బట్లు గారెలు చేగోడీలు అవీ కూడా చేస్తాను అన్నారు. అమెరికా లో వాళ్ళ ఆమ్మాయి యింట్లో గృహ ప్రవేశం కు కూడా ఆయనే అంతా వంట చేసాను అని చెప్పారు. పూజకు వచ్చిన పురోహితుడు పులిహోర చాలా బాగుందని ప్యాక్ చేయించుకొని వెళ్ళారు అని కూడా అన్నారు. ఆపుడు నేను కూడా నేను చదివిన కథ గురించి చెప్పి అందులో హీరో చివరికి అశోక హోటల్ లో చీఫ్ కుక్ గా సెటిల్ అవుతాడు. పెళ్ళి చూపులు కోసం కాకినాడ వచ్చీ ఫ్రెండ్ యింటికి వస్తాడు. అనుకోకుండా ఆ ఫ్రెండ్ మరదలు పెళ్ళి కూతురు, కొబ్బరి పచ్చడి, మద్రాసు రసం కాకుండా ఆంధ్ర చారు పెట్టీ రుచిలో పాస్ అయితే ఒకే చెప్తాను అంటాడు. కానీ నా ఐడియాలో ఆ రెండూ రుచిగా కుదరటం కొంచెం కష్టమే. ఆయన వంటలు గుఱించి చెప్తుంటే నాకు అమెరికాలో ఉంటున్న మా మరిది గారు గుర్తు వచ్చారు. ఆయనకు వంటలు చేయడం ఒక హాబీ. ఏ అధ్రవు అయినా రుచి గా వుంటే ఎలా చేశారు అని అడుగుతారు. నేను అక్కడ వున్నపుడు పులుసు పెడితే పల్లెటూరి పప్పు పులుసు లాగా బాగుంది అని మెచ్చుకున్నారు. నేను వంట పల్లెటూరి నుండి వచ్చిన మా అత్తగారు దగ్గర నేర్చుకున్నాను సో ఆ రుచి వచ్చి వుండచ్చు. నేను మొదటి సారి వెళ్ళినపుడు మన గుంటూరు జిల్లాలో నిమ్మకాయ ఊరగాయ ఎలా పెడతారు అని అడిగారు. గుంటూరు జిల్లా కి గోదావరి జిల్లా కు వంటల్లో చాలా తేడాలు ఉంటాయి. అయనకు నేను ఎలా చేస్తారో చెప్పాను. ప్రస్తుతం ఆయన ఆ ఊరగాయ పెట్టటంలో డాక్టరేట్ పొందారు. వాళ్ళు అమెరికా నుండి రాగానే అందరూ నిమ్మకాయ తెచ్చారా అంకుల్ అని అడుగుతారు. మేమూ మిగతా ఊరగాయలు ఇక్కడి నుంచి పంపినా నిమ్మకాయ మాత్రమ్ అమెరికా నుండి రావాల్సిందే. నిన్న ఆ ప్రొఫెసర్ గారి వంటల గురించి చెప్తుంటే నాకు ఇవ్వన్నీ గుర్తు వచ్చాయి. మా మరిది గారు సియా టెల్ లో మెక్సికన్ పనిమనిషి కి

కారప్పూస చేయటం కూడా నేర్పారు. కొస మెరుపు ఏమిటంటే నేను మా అమ్మాయిలకు వంట నేర్పలేదు. వాళ్ళు టీ కూడా పెట్టుకునే వాళ్ళో లేదో నాకు గుర్తు లేదు. పెళ్ళి అయ్యాక అత్త గారి ఇంట్లో వాళ్ళ అభిరుచులకు తగ్గట్లు నేర్చుకున్నారు. మా మనవడు, మనవ రాళ్ళ కు మాత్రం నేను చేసే పప్పు, ఆవకాయ చాలా ఇష్టం. యిపుడు మీకూ ఈ హెడ్డింగ్ ఎందుకు పెట్టానో అర్ధం అయింది కదా ఇంకొక సారి ఇంకో జీవిత చిత్రమ్ తో

 
 
 

Recent Posts

See All

గూగుల్ తమాషాలు

గూగుల్ లాంటి వరల్డ్ వైడ్ కంపనీ తో మనకు ఏమీ తమాషాలు వుంటాయి ,అని మీరు అనుకుంటారు. కానీ నాకు మాత్రం చాలాసార్లు అమ్మో గూగుల్, ఆన్ లైన్ లో...

మరపురాని స్నేహం

కొంత మందితో స్నేహితులతో ఎక్కువ రోజులు గడపక పోయినా వాళ్ళ ప్రభావము మన మీద చాలా వుంటుంది. తర్వాత ఎక్కువ సార్లు కలుసుకోక పోయినా ఆ స్నేహం...

ఇష్ట కామేశ్వరీ

ఈ మధ్య శ్రీశైలము గురించి చెప్తూ అందరూ ఇష్ట కామేశ్వరీ దేవాలయము గుఱించి చెపుతున్నారు. మేము చాలా సార్లు శ్రీశైలము వెళ్ళాము. కానీ మొదట్లో...

3 Comments


murthydeviv
20 hours ago

😊😄

Like

murthydeviv
20 hours ago

అవును మాధవి చెప్పింది మీ హాస్టల్ అనుభవాలు కూడా చెప్పారు

Like

Ramakrishnarao Lakkaraju
Ramakrishnarao Lakkaraju
2 days ago

ప్రస్తుతం సియాటిల్ లో వారం రోజులకు వచ్చాము . పూర్వం సియాటిల్ లో తిరిగిన రోజులు గుర్తుకు వస్తున్నాయి . మీరు వెళ్లిన ఇంటాయన ప్రొఫెసర్ గారు కూడా నాకు తెలుసు . ఆంధ్ర యూనివర్సిటీ లో మా ల్యాబ్ నుంచి వచ్చిన వాడే . వంట చేయటం మా లాబ్ మహత్యం .

Like

Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page