top of page
Search

యజ్ఞము

  • murthydeviv
  • 8 hours ago
  • 3 min read

ఇలా రాయగానే నేనూ ఎదో యజ్ఞం చేశాను అనుకునేరు.ఇది ప్రతి ఎండాకాలంలో చేసే ఆవకాయ యజ్ఞము. ఒక వారం క్రితం కొత్త ఆవకాయ అంటూ ఒక బాటిల్ తెచ్చి ఇచ్చింది మా మరదలు.ఆరోజు సాయంత్రం మా కోడలు వాళ్ళ అమ్మ ఇచ్చిందని ఇంకొక సీసా ఆవకాయ మాగాయ తెచ్చి టేబుల్ మీద పెట్టింది. రాత్రికి మా అబ్బాయి రాగానే కొత్త ఆవకాయ లు చూసి చపాతీలు బదులుగా అన్నం తింటూ నీవు ఇంకా పెట్ట లేదా ఆవకాయ అన్నాడు. ఇంక నాకు పి టి ఉష లాగారన్నింగ్ రేస్ లో ఎక్కడ ఓడి పోతామో అన్నంత బెంగ వచ్చింది మర్నాడు డ్రైవర్ రాగానే ఎపుడూ మేము వెళ్ళే వాడికి ఫోన్ చేయరా అంటే నెంబర్ నాద గ్గర లేదమ్మా మీ ఫోన్ లోనే వున్నది అన్నాడు కాస్త చెయ్యరా ఇంకా పూజ కాలేదు అంటే లాక్ వేసి ఉంది అంటూ ఫోన్ అక్కడే పెట్టాడు ఆ లాక్స్ అన్నీ మన పెళ్ళి రోజులు పుట్టిన రోజులేగా వాళ్ళకి తెలియకుండా ఉండవు. అయినా మర్యాద కోసం అలా చెప్తారు. ఆ రోజు మధ్యాహ్నం కు ఆ కాయల వాడే ఫోన్ చేసి అమ్మా కాయలు అక్షయ తిథి నుండి పెడతాను రాండి అంటూ ఇన్వైట్ చేశాడు. అమ్మయ్య అనుకుంటా ఆవ పిండి కారం వాటి కోసం ఎపుడూ తెచ్చుకునే షాపు లో గుంటూరు కారం సినిమా కాదు నిజం కారం అన్నీ తెచ్చుకుని రెడీ అనుకుంటూ ఉదయం ఏడు గంటల కల్లా బయలు దేరాను ఆవకాయ గురించి ఇంత రాయటానికి ఏముంటుంది అనుకుంటారు మీరు కానీ నేను మార్కెట్లో కలిసే వాళ్లను చూస్తుంటే చాలా విచిత్రమైన విషయాలు కనబడుతూ ఉంటాయి. షాపు వాడు నాకు శని ఆది వారాల్లో రండి మంచి కాయలు వుంటాయి అన్నాడు. ఆరోజు సాఫ్ట్వేర్ వాళ్ళకు సెలవు కదా. షాపు వాడికి తెలుసు ఆరోజు ఎక్కువ సేల్ ఉంటుందని. అప్పటికే మార్కెట్ అంతా కిట కిట లాడుతున్నది నేను కారు దిగుతూ నే,షాపు వాడు అమ్మగారు ఎపుడూ నాదగ్గరే కొంటారు. నేను చాలా నమ్మకం గా ఇస్తాను అంటూ నన్ను చూపిస్తూ వాడి అడ్వర్టైజ్ టెక్నిక్ వాడుకున్నాడు. చిన్నప్పుడు మన పెద్ద వాళ్ళు చెప్పినట్లు చదువుకున్న వాళ్ళకన్నా చాకలి వాడు మేలు అన్నట్లుగా వాళ్ళ సేల్స్ టెక్నిక్ ముందు మన బ్రెయిన్ ఏమీ పని చేయదు. అంత క్రితమే కాయలు చూస్తున్న ముసలి దంపతుల్లో భర్త ఇక్కడ బాగానే ఉన్నాయి తీసుకుందాం అంటాడు, ఆవిడ మాత్రం ఒక పది రకాల మామిడికాయలు కోయించి పులుపు చూసి ఇంకో రెండు మూడు షాపుల్లో చూద్దాం రండి అంటుంది పాపం ఆ మానవుడు కోయించాము కదే మాగాయ కన్నా తీసుకో అంటాడు, అవిడ అప్పటికే ముందుకు వెళ్లి పోతూ ఉంటుంది. మా ఆవిడ కు ఏవీ త్వరగా నచ్చవు అనుకుంటూ వెనకాల సంచులు బకెట్ నీళ్లు మోసుకుంటూ వెళతాడు ఇవ్వన్నీ ఎందుకూ అనుకుంటున్నారా అక్కడే కాయలు కడిగి తుడిచి ముక్కలు చేయించు కోవటానికి ఈ సరంజామా అందరూ తెచ్చుకుంటారు ఇంక చిన్న జంటలు అయితే నాతో చాలా ప్రేమగా ఏ కాయలు బాగుంటాయి, ఎలా ముక్కలుగా చేయించాలి అని అడుగుతూ కాయలు కడుగుతూ ఉంటే హెల్ప్ చేస్తారు. ఆవకాయలో మాగాయ లో పాళ్ళు ఎలా కలపాలి అని అడుగుతూ వుంటారు. ఇంకో రకం అందరూ ఆడవాళ్లు ఒకే ఏరియా లో ఉండే వాళ్లు కలిసి వస్తారు అందరూ ఆంధ్రా లో ఒక జిల్లా వాళ్లయితే పర్వాలేదు లేకపోతే వాళ్ళ కు ఏ రకమైన కాయలు తీసుకోవాలి అనేది పెద్ద ప్రశ్న గుంటూరు జిల్లా ఒకరకం చెప్తేగోదావరి ఇంకో వెరైటీ చెప్తూ వుంటారు అది తేల్చుకుని కాయలు ఏరుతూ ఆ షాపు వాడు వాళ్ళు చేసే హడావిడీ జంధ్యాల సినిమా చూస్తున్నంత సరదాగా గా వుంటుంది. ఆ కాయలు కొనటం అయ్యాక ముక్కలు చేయటానికి బేరం కూడా బాగా చేస్తారు అతని కంటే ఘ నుండు ఆచంట మల్లన్న అన్నట్లే వాడు నాకు చెప్పిన రేటు కన్నా ఎక్కువ చెపుతాడు, మధ్యలో నాకూ మా డ్రైవర్ కు సైగలు చేస్తూ వుంటాడు. జనరల్ గా చిన్న దుకాణం లో బేరం చేయకూడదని నాకు ఒక ప్రిన్సిపల్. అదీగాక ఆ కాయల్ని ముక్కలు చేసే కత్తిపీట చూస్తునే అమ్మో అనిపిస్తుంది. జనరల్ గా చిన్న పిల్లలు కొడుతూ వుంటారు వాళ్ళ ను చూస్తే జాలి అనిపిస్తుంది. ఇంక ఇంకొక రకమైన బ్యాచ్ వియ్యంకులు ఆడ మగ కలిసి వస్తారు వాళ్ళ మాటల్లో వాళ్ళ పిల్లలు అమెరికా సంయుక్త రాష్ట్రాల లో ఎక్కడ ఉన్నారో ఎవరికి ఆవకాయ, మాగాయ లు ఏమి ఇష్టం ఎన్ని రకాలుగా పెట్టీ పంపించాలి అనే విషయాలు అన్నిటిలో మనకు జ్ఞానం కలుగుతుంది. వాళ్ళకు కాయలకు గొడవ రాదు కానీ కారం దగ్గర మాత్రం ఒకళ్ళు గుంటూరు కారం కావాలి అంటే రెండో వాళ్ళు వరంగల్ అంటారు అలా ఒక గంట వాదించుకుని రాజి కి వస్తారు. నేను వీళ్ళని చూస్తూ ఎందుకు కూర్చున్నాను అని మీకు అనుమానం రావచ్చు నేను తీసుకునేది వంద కాయలు అవి కొట్టడానికి కనీసము ఒక గంట పడుతుంది ఎండ లో మీరు ఎందుకు అని డ్రైవరు ఆ పని చేస్తాడు. షాపు వాడు తన అడ్వర్టైజ్ టెక్నిక్ కోసం నాకు నీడ లో ఒక కుర్చీ వేసి, చెరుకు రసం తో మర్యాద చేస్తాడు. నేనూ సరదాగా అందర్నీ చూస్తూ ఆనందిస్తూ మీతో చెప్తూ వుంటాను. మేము హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో మామిడి కాయలు సికింద్రాబాద్ మొండా మార్కెట్ లో చార్మినార్ లో మాత్రమే దొరికేవి. ఇపుడు చాలా మార్కెట్ లో దొరుకుతున్నాయి. ఆ మార్కెట్ పక్కనే నూనె లు ఆవ పిండి కారం అన్నీ రెడీ మేడ్ గా దొరుకుతున్నాయి వంద కాయలు ఆవకాయ తింటారా అని మీకు అనుమానం రావచ్చు. ఈ కాలం రాగానే నాకు చాలా ఫోన్లు వస్తాయి కొన్నాళ్ళు కిత్రం పని చేసి మాను కున్న పని వాళ్ళు ఫోన్ చేసి కుశలమా అని అడిగి ఆవకాయ పెట్టారా అమ్మా అంటారు. ఇంకా బంధువులు ల్లో, స్నేహితులు అలాంటి వాళ్ళు ఉంటారు కదా. అలా మే మొదటి వారంలో సాగే ఈ యజ్ఞం మనకు ఓపిక వున్నంతవరకు చేద్దాం అనుకుంటాను ఇపుడు అన్నీ రెడీ మేడ్ గా ఉన్నాయి కదా ఆవకాయ పెట్టడం ఈజీ నే అనిపిస్తుంది. అక్కడే ఇంకో చిన్న జంట వచ్చారు. ముచ్చట గా పదిహేను కాయలు తీసుకున్నారు నార్త్ ఇండియన్ అమ్మాయి అయినా తెలుగు మాటలు ఆవకాయ రుచి బాగా నచ్చింది. ఆ అబ్బాయి కి నాలాంటి బామ్మ గారు ఉన్నారుట సారంగ పాణి జాతకం అనే సినిమా చూడు బామ్మ అని చెప్పాడు. మనం సినిమాలు చూడటం మానేసి చాలా రోజులు అయింది. సరే ఆవకాయ మనవడు చెప్పాడు. కదా టీవీలో వచ్చినపుడు చుద్దాం అనుకున్నాను.

 
 
 

Recent Posts

See All
మాగాయ మహిమలు

రెండు రోజుల క్రితం మా అమ్మాయి చెట్టు కాయలు అంటూ మామిడి కాయలు పంపింది. మామూలుగా ఆవకాయ అయితే నేను ఎక్స్పరిమెంట్ ఏమీ చేయకుండా కాయలు ఒకే రకం...

 
 
 
మల్లె పూలు, మండు వేసవి

వేసవి కాలం ఎంత విసుగు గా ఉన్నా మల్లె పూలు, మామిడి పండ్లు చూస్తే మాత్రం వేసవి వేడి గుర్తు రాదు. ఇపుడు చాలా రకాలుగా మల్లె పూలు...

 
 
 
వెండి గ్లాసు

వుదయం పూట కాఫీ తాగుతూ పేపర్ చూడటం ఒక అలవాటు. మొదట్లో ఏమీ వుండేది కాదు కాఫీ తో పాటు శ్రీవారికి పేపర్ ఇవ్వడం కూడా ఆరోజుల్లో ఒక మర్యాద లాగా...

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page