top of page
Search

మరపురాని స్నేహం

  • murthydeviv
  • Mar 7
  • 2 min read

కొంత మందితో స్నేహితులతో ఎక్కువ రోజులు గడపక పోయినా వాళ్ళ ప్రభావము మన మీద చాలా వుంటుంది. తర్వాత ఎక్కువ సార్లు కలుసుకోక పోయినా ఆ స్నేహం మధురిమ అలాగే వుంటుంది. రెండు రోజులు క్రితమే ఎవరో చిరంజీవులు లోని పాత పాట ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు ఆ పాట వినగానే తను గుర్తు వచ్చింది. తనపేరు పద్మ. నేను గ్రాడ్యుయేషన్ అవగానే మా వూరులోనే కొత్తగా పెట్టిన లేడీస్ కాలేజ్ లో డెమానిస్ట్రేటర్ గా ఉద్యోగం లో చేరాను. ఆ కాలేజీ లో అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్లు లెక్చరర్స్ గా అందరూ వేరే ఊర్ల నుండి అక్కడకి వచ్చారు. ఇద్దరు అమ్మాయిలు కొత్తగా చదువు అయిపోయి జాబ్ కు వచ్చారు. ఒకరు మ్యాథ్స్ ఇంకొకరు ఎకనామిక్స్ మేము కలుసుకున్న క్షణం ఎలాంటిదో కానీ మా ముగ్గురికీ మంచి స్నేహం ఏర్పడింది. ముగ్గురము ఎపుడూ కలిసి తిరుగుతూ వుండేవాళ్ళం. ఆ ఉద్యోగంలో మేము కలిసి వున్నది ఒక సంవత్సరము కూడా లేదు కానీ మా మధ్య చిరకాల స్నేహం ఏర్పడింది. అంతదాకా నేను ఎపుడూ తెలుగు నవలలు వార పత్రిక లు , జ్యోతి యువ ఇవే చదివే దాన్ని. వాళ్ళ స్నేహం వలన ఇంగ్లీష్ సాహిత్యం లో క్లాసిక్ బుక్స్ చదవటం అలవాటు అయింది. సినిమా పాటలు తప్పితే లలిత సంగీతము గురించి అంతగా తెలియదు వాళ్ళతో కలిసి ఎంకి పాటలు ఇంకా లలిత సంగీతం పాటలు చాలా నేర్చుకున్నాను. ఎపుడూ కొత్త పాటలు నేర్చుకోవటం, నవలలు గురించి కబుర్లు చెప్పుకోవటం అదే పని గా వుండేది. తనకు ఆరోజుల్లో నే కొత్త సినిమాలు నచ్చేవి కాదు ఎపుడూ పాత విజయావారి సినిమాలు చూడటం అందులోని పాటలు పాడుతూ వుండేది. ఇంక యిప్పటి సినిమాలు చూస్తే ఏమంటుందో. తనకు ఆ తర్వాత కాకినాడ ఇంజినీరింగ్ కాలేజ్ లో ఉద్యోగం వచ్చి వెళ్ళింది. కాకినాడలో కూడా తనను, వాళ్ళ అమ్మగారి నీ కలుసుకున్నాను. హైదరబాద్ లో ఇద్దరము సంసార బాధ్యతలతో అంతగా కలుసుకోకపోయిన ఒకరి గురించి ఒకరం మధ్యలో తెలుసుకుంటూ వుండేవాళ్ళం. తను రిటైర్ అయి ఢిల్లీ వాళ్ళ అబ్బాయి దగ్గరకు వెళ్ళినప్పుడు కలుసుకున్నాను. చివరిగా మా ఇంకో ఫ్రెండ్ కొడుకు పెళ్ళి లో కలుసుకున్నాను. ఈ రోజు అనుకోకుండా ఫేస్ బుక్ లో తన వాల్ మీద పోస్ట్ చేసినవన్నీ కనిపించాయి. అవ్వన్నీ ఆపుడు చూశాను కానీ ఇపుడు మరలా చూస్తే చాలా హ్యాపీ గా అనిపించింది. మన తెలుగు సినిమాల్లోని సంఘటనలు తో మహాభారతము, భాగవతము కధలు తను ఇంగ్లీష్ లో చెపుతూ పోస్ట్ చేసింది. ఇంక మన పండగలకు తగ్గట్లు పాటలు కూడా పోస్ట్ చేసింది. ఉదాహరణ కు తోడికోడళ్ళు సినిమాలో దసరా పాట వినగానే మన చిన్న తనంలో అందరి ఇళ్ళకు వెళ్ళి కోలాటం వెయ్యటం అయ్యవారికి చాలుఅయిదు వరహాలు పిల్లవాళ్ళకు చాలు పప్పు బెల్లాలు పాట గుర్తు వచ్చి కళ్లలో నీళ్ళు తిరిగాయి. ఇంకా దసరా పండగ కు అమ్మవారిని అలంకరించి మంచి పాటలు పెట్టటం తన అభిరుచిని తెలియ చేస్తుంది. రిటైర్ అయ్యాక అంత ఉత్సాహంగా తను చేసిన ఈ అద్భుతమైన పోస్టులు చూస్తే చాలా భాదగా, అనిపించింది. తను ఢిల్లీ వెళ్ళాక ఫోన్ లో మాట్లాడుతూ వుండేది. ఒక్కసారి నాకు ఫ్రాక్చర్ అయింది అని మెసేజ్ పెట్టింది. తర్వాత ఒక నెల రోజుల తర్వాత వాళ్ళ వారు తను పోయినట్లు మెసేజ్ పెట్టారు. ఎపుడు, ఎక్కడ పాత పాటలు విన్నా విజయా వారి సినిమాలు చూసినా వెంటనే గుర్తు వస్తుంది. చక్కటి అభిరుచి, ఆప్యాయత వున్న స్నేహితురాలు ఏ లోకము లో వున్నా నివాళి ఇస్తూ, సృష్టి లో తీయనిది స్నేహమే నోయి. ఆంటూ పద్మ వాళ్ళింట్లో అందరూ చిన్నారి అనేవారు కు అంకితము

 
 
 

Recent Posts

See All
మాగాయ మహిమలు

రెండు రోజుల క్రితం మా అమ్మాయి చెట్టు కాయలు అంటూ మామిడి కాయలు పంపింది. మామూలుగా ఆవకాయ అయితే నేను ఎక్స్పరిమెంట్ ఏమీ చేయకుండా కాయలు ఒకే రకం...

 
 
 
మల్లె పూలు, మండు వేసవి

వేసవి కాలం ఎంత విసుగు గా ఉన్నా మల్లె పూలు, మామిడి పండ్లు చూస్తే మాత్రం వేసవి వేడి గుర్తు రాదు. ఇపుడు చాలా రకాలుగా మల్లె పూలు...

 
 
 
వెండి గ్లాసు

వుదయం పూట కాఫీ తాగుతూ పేపర్ చూడటం ఒక అలవాటు. మొదట్లో ఏమీ వుండేది కాదు కాఫీ తో పాటు శ్రీవారికి పేపర్ ఇవ్వడం కూడా ఆరోజుల్లో ఒక మర్యాద లాగా...

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page