మన సంక్రాతి:2
- murthydeviv
- Oct 29, 2024
- 1 min read
ఈ గొబ్బమ్మలు పెట్టె రోజుల్లో ఆ ఊరులోనే ఉన్న. మా మేనత్త గారి ఇంటికి మేము, మా ఇంటికి వాళ్ళు రావటం మేము వెళ్ళటం జరిగేది. చాలా మటుకు ఒక ఈడు వాళ్లము అవటం వలన చాలా సరదాగా గడపటం ఎవరి ఇంట్లో బాగా పెట్టాము అని పోటీ ఉండేది మా మేనత్త గారి ఇంట్లో పెద్ద తోట ఉండేది మా ఇంట్లో అన్ని రకాల పూలు లేక పోయినా మా చెల్లెళ్ళ బాగా అలంకరించి వాళ్ళు. ఈ రోజులు అయితె ఒక రోజు పెట్టి చాల ఫోటోలు తీసి ,ఫోన్లో అందరికి పెట్టటం, ఫేసుబుక్లో పెట్టటం జరుగుతుంది. ఇంకా సంక్రాతి బొమ్మలు పెట్టటం అనేది చాలా శ్రద్ధ గా చేసేవాళ్ళం. నా ఊహ తెలిసినపుడునించి బొమ్మలు పెడుతూనేఉన్నాము బొమ్మలు పెట్టటంలో మా కజిన్స్ మధ్య చాలా పోటీ ఉండేది. ప్రతి సంవత్సరం కొత్తగా పెట్టెవాళం. బొమ్మలు పెట్టటంలో మా అన్నయ్యలు మాకు సహాయము చేసేవాళ్ళు
Comments