మన ఆరుద్ర:2
- murthydeviv
- Nov 9, 2024
- 1 min read
ఆ పద్దతి అంతా తాత గారూ మొదలు పెట్టారు అని నాన్న చెప్పేవారు. ఇంటికి వచ్చాక మరల అభిషేకాలు చేసి అందరికి అన్న సంతర్పణ చేసే వారు. ఇ దంతా చేయటానికి డబ్బు ఖర్చు ఎలా ఉన్నా నిర్వహించి చేయటానికి ఎంత ఓర్పు, నేర్పు ఉండాలి. ఈ ఆరుద్ర అభిషేకం గురించి ఎంత రాసినా ఇంకా ఏదో చెప్పలేక పోయాను అని పిస్తుంది చిన్న తనం లో ఆరుద్ర రోజున ఆ గుడి మండపం లో పిల్లలం,అందరం వెన్నెల లో కూర్చొని కబుర్లు చెప్పుకోవటం తప్పితే ఆ అభిషేకం గురించి, ఆ నిష్ఠ గురించి ఏమీ తెలియదు. ఇపుడు మాత్రం అది ఎంత సత్కార్యమో అని పిస్తుంది. మనము ఎంత డబ్బు సంపాదించినా అలాంటి గొప్ప సంతర్పణ లు ఒకటి కూడా చేయలేక పోయాము అనిపిస్తుంది వాళ్ళు చేయగలిగారు అంటే ఎంత పూర్వ జన్మ పుణ్యం ఉండీ ఉంటుంది అనిపిస్తుంది ఆరుద్ర ఉత్సవం మా జీవితాలలో ఒక మరపు రాని గొప్ప ఉత్సవం. మా మేనత్త, మా తాత గారు ఆరుద్ర చేసే రోజుల్లో ఒకటి చక్కటి పాట శివుడు మీద రాసారు ఆ పాట కూడా చివరిలో రాస్తాను. ఈ ఆరుద్ర ఉత్సవం చిదంబరం లో చేస్తారని నేను చదివాను. ఆ క్షేత్రము చూడాలని చాలా రోజులుగా కోరుకొని ఈ మధ్య నే వెళ్లగలిగాను మా పెద్దమ్మ అక్కడ అమ్మవారి మీద పాటలు రాసారు, ఆ పాటలు కూడా అక్కడ పాడుకున్నాను. చాల సంతోషం అనిపించింది
చిన్ననాటి మన "ఆరుద్ర " ముచ్చట్లు బాగున్నాయి . భార్గవి