మన ఆరుద్ర:1
- murthydeviv
- Nov 8, 2024
- 1 min read
ధనురుమాసం మొదలుఅయాక పౌర్ణమి ముందు ఆరుద్ర నక్షత్రం రోజున శివుడు గుడి లో అభిషేకం చేస్తారు. చిదంబరం లో చేసే ఈ అభిషేకం చాల ప్రసిద్హి మా తాత గారు మా ఊరిలొ శివాలయం లో ఈ అభిషేకం మొదటి సారి గా ఈ అభిషేకం మొదలు పెట్టారు దాని తో పట్టు పార్వతి కళ్యాణం కూడా చేసేవారు త కానీ మా ఊహ తెలిసాక ఈ కళ్యాణం జరగలేదు తరువాత మా అన్నయ్యలు 1,2 సారులు పార్వతి కళ్యాణం చేసారు ఆ రుద్ర ఉత్సవం మా తాత గారు, నాన్న గారు చాల బాగా చేసేవారు. ఆ రోజు ఉదయం ఇంట్లో అభిషేకం అయ్యాక నాన్న వాళ్ళు ఉపవాసం ఉండేవారు. నాన్న చాల నిష్ఠగా ఉపవాసం చేసేవారు. కార్తీకసోమవారం పౌర్ణమి నాడు కూడా కనీసం మంచినీళ్లు కూడా తాగేవారు కాదు ఆ రుద్ర రోజు రాత్రి మేళ తాళాలు తో గుడికి బయలుదేరేవారు ఇంటి పురోహితులు తో పాటు ఇంకా కొంతమంది బ్రాహ్మణుల తో కూడా మహాన్యాసం పారాయణ చేస్తూ ఉరేగింపుగా గుడి కి చేరేవారు అక్కడ అర్ద రాత్రి వరుకు పదకొండు రుద్రాల అభిషేకం చేసేవారు. అమ్మవారి కి కూడా పూజ అయ్యాక తెల్లవారు జామున ఇంటికి వచ్చే వారు. వచ్చే దోవలో వేణు గోపాల స్వామి గుడి లో ఆగి అక్కడ పూజచేసేవారు.
ధనుర్మాసం ఆరుద్ర బాగుంది . భార్గవి