top of page
Search

మా మూడో అంతస్తు 4

  • murthydeviv
  • Dec 13, 2024
  • 2 min read

ఆ రోజుల్లో సినిమా చూసీ వస్తె ఆ సినిమా అంతా డ్రామా లాగా ఎనాక్ట్ చేసే వాళ్లం మా మూడో అంతస్తు మాకు థియేటర్ లాగా వుండేది అప్పట్లో వచ్చిన అన్నీ పౌరాణిక చారిత్రక సినిమాలు మా చేతి నుండి తప్పించు కోలేదు అన్ని సినిమాల ను మా కళ పోషణ తో పోషించే వాళ్లం ఏ పాత్ర ఎవరు వేయాలి అని కొంచెం పోటీలు వుండేవి మా అత్తయ్య కూతురు నాజూకుగా అందం గా వుండేది తను వుంటే హీరోయిన్ వేషం తనకే ఎలాట్ చేసే వాళ్ళం ఆలా మా కళ పోషణ మేము హైస్కూల్ కి వచ్చిన దాకా జరిగింది ఇంక ఉండ్రాళ్ళ తద్దె ఆట్ల తదియ పండగ కు తెల్ల వారు జామున లేచి అన్నాలు తిని పైకి వెళ్లి వెన్నల ఆటలు ఆడాల్సిందే నాకెందుకో a పండగ లు రెండూ అంత నచ్చేవి కాదు తెల్లవారు ఝమున లేవాలి నేను ఇప్పటికీ చేయలేని పని అదొక్కటే అయిన అందరితో చేయాలి కదా ఊయాల ఊగటం ఆటలు పాటలు ఇంక ఆ సందడి అంతే వుండేది కాదు మా పెద్ద అన్నయ్య పెళ్ళి అయ్యాక రిసెప్షన్ మా మూడో అంతస్తు లోనే చాలా గ్రాండ్ గా చేశారు ఇంక మేము కాలేజీ కి వచ్చిన తరువాత ఏ ఫ్రెండ్స్ వచ్చిన మా మూడో అంతస్తు లోనే కబుర్లు పాటలు సాయంకాలం అయితే చాలు పైకి చేరి పోయే వాళ్ళం చిన్న పిల్లల వుంటే వాళ్ళనీ బాల్కనీ వైపు కు వెళ్లకుండా చూడడం ఒక పెద్ద పని ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా ఫోటో షూట్ కు పైకి వెళ్ళాల్సిందే కాలేజి రోజుల్లో ఎపుడూ మూన్ లైట్ డిన్నర్ లు చేసుకుంటూ వుండేవాళ్ళం మా వదిన కు అపుడు చిన్న పాప పాపకు కావాల్సిన సరంజామా అంతా పైకి తీసుకొని వెళ్లే వాళ్ళం ఒక వేళ తనకు కొంచెం లేట్ అయితే నేను వచ్చిన దాకా మీరూ ఏమి కబుర్లు పాటలు మొదలు పెట్టకండి అనేది

ఇంక పరీక్ష లు టైంలో అయితే ప్రశాంతం గా వుంటుంది అని పైకి చేరి చదువుకునే వాళ్ళం చల్లటి గాలి అస్తమించే సూర్యుడు నీ చూస్తూ ఒంటరిగా వున్నా అందరితో వున్నా రాత్రీ పూట విశాలమైన ఆకాశము చూస్తూ పడుకున్నా మా మూడో అంతస్తు అందాలు వర్ణించలేము. అలా ఎన్ని వెన్నెల రాత్రులు హాయిగా ఆనందం గా గడిపామో అనిపిస్తుంది ఆ పిట్ట గోడ లు ఆ ఆకాశము. ఆ కొబ్బరి ఆకులు చెట్లు ఆలా ఆరోజు లను ఆ సందడిని తలచుకుంటూ వుంటాయేమో మా మధురమైన బాల్యాన్ని జ్ఞాపకము చేసే మా అత్తయ్య గారి తోట గురించి రేపు కలుద్దాము

 
 
 

Recent Posts

See All
అమృత హస్తం

ఈ మధ్య మా కోడలు పుట్టిన రోజున మా పిల్లలు హోటల్ కు డిన్నర్ కు తీసుకుని వెళ్ళారు. హోటల్ పేరు ఎర్ర కారం. గుంటూరు కారం సినిమా లాగానే ఆ పేరుకు...

 
 
 
పెళ్ళి పెట్టె

మా చిన్న తనం లో పెళ్ళి జరుగుతున్న పుడు పెళ్ళి మండపం లో ఎవరో ఒక పెద్ద వాళ్ళు ఒక పెట్టె పెట్టుకుని కూర్చుని వుండే వారు. ఏ బాబాయి గారో...

 
 
 
రూట్స్

ప్రస్తుతం ఉదయాన్నే పేపర్ చూడగానే ట్రంప్ గారు ఏమి సెలవు ఇచ్చారో, ఈ గొడవల్లో మనవాళ్ళు అంతా ఎలా వున్నారో అని ఒక అనుమానం వస్తుంది....

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page