top of page
Search

మా మూడో అంతస్తు 3

  • murthydeviv
  • Dec 12, 2024
  • 2 min read

వేసవి కాలం అయినా ఒకొక్క సారి సన్నగా చినుకులు పడేవి అపుడు మా ఆనందం చూడాలి వెంటనే ఆ పరుపులన్ని ఎత్తి అక్కడే ఆ అవరణ కు అటూ ఇటూ వున్న గదుల్లో అస్తవ్యస్తం గా పడేసి కాసేపు ఆ చినుకుల్లో అడి ఎక్కువ తడవకుండా కిందికి పరిగెత్తే వాళ్ళం మర్నాడు మేము పైకి వెళ్ళే సరికి మాంత్రికుడు మంత్రం వేసినట్లు అన్నీ చక్కగా అమర్చి వుండేవి ఆ మాంత్రికుడు ఇంక ఎవరో కాదు మన ఆమ్మ లో పిన తల్లులో లేక మేనత్త లో అయివుంటారు మా పెద్ద మేనత్త అయితే చాలా గారాబం గా చూసేది పిల్లలందరినీ ఓకే విధంగా చూసేది ఆ క్రమ శిక్షణ ఎలా వచ్చిందో తెలియదు కానీ ఇంట్లో అందరూ పిల్లల మధ్యఏ భేదం చూపించే వారు కాదు మా చిన్న మేనత్త ను చూస్తే మాత్రం అందరికీ హడల్ అందరినీ క్రమ శిక్షణ లో పెట్టేది కొవ్వత్తి వెలిగిస్తే ఆ వెలుగు నే మనం చూస్తాము కరుగుతున్న ఆ కొవ్వాత్తి గురించి మనం ఆలోచించము ఆ రోజుల్లో ఇంతమంది పిల్లల కు ఎంతో ప్రేమ తో క్రమశి క్ష ణ తో పెంచటం కోసం వాళ్ళు ఎంత శ్రమ పడ్డారో తలచుకుంటే ఇపుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది మా నాన్న గారు ఎపుడూ బిజినెస్ పనులు మీద ఊర్లు తిరుగుతూ వుండేవారు నా మొట్ట మొదటి జ్ఞాపకం మూడో అంతస్తు లో అపుడు అన్ని అర్థం చేసికునే వయసు కూడా లేదు అనుకుంటాను రోజూ సాయంకాలం పిట్ట గోడ మీద కూర్చుని పిల్లల అందరి చేత రకరకాల ఆటలు ఆడించే వారు తర్వాత మా చేత చిన్న చిన్న నోటి లెక్కలు చేయించేవారు అపుడు నాన్న గారు రోజు ఆలా చేయిస్తూ వుంటే నాకు చాలా సంతోషం గా అనిపించేది నాన్న గారు రోజు ఇలా చేయించ వచ్చు కదా ఎందుకు వూరికి వెళతారు అనిపించే ది కొంచెం పెద్ద అయ్యాక తెలిసింది ఏమిటంటే తాతగారు చనిపోయారు అందువలన కొడుకులు అందరూ వుదయంఆ కార్యక్రమం అయ్యాక బయటికి వెళ్ళ కూడదు అని పిల్లల ఆడుతూ చదువు చెప్పే వాళ్ళు ఇపుడు నా అమాయకత్వం కి నవ్వు వస్తుంది కానీ మా నాన్న గారు కనుక ఊర్లో వుంటే ఆదివారం వస్తె అందరికీ హడల్ అందరినీ ఉదయాన్నే కూర్చో పెట్టీ లెక్క లు ఎక్కాలు ఇంగ్లీష్ గ్రామర్ చేప్పే వారు మేము గనుక సినిమా కి వెళ్లి వస్తె అందరం. ఆ సినిమా కథను ఇంగ్లీష్ లో రాసి ఆయనకు చూపించాలి అపుడు అయితే విసుగు అనిపిస్తూంది కానీ మనకు భాష బాగా రావటానికి బాగా ఉపయోగ పడుతుంది మా అత్తయ్య గారి పిల్లల అయితే ఆదివారం ఇంటికి రావటానికి మామయ్య చదువు చెప్తాడు అని భయపడే వాళ్ళు ఇంకొన్ని కబుర్లు తో రేపు కలుద్దాము

 
 
 

Recent Posts

See All
దీపావళి కొన్ని జ్ఞాపకాలు

అన్ని పండుగల్లో కి విశిష్టత గల పండుగ దీపావళి. దేశము మొత్తం జరుపుకునే పండగ , అంతే కాక ఈ మధ్య ఇతర దేశాలు సైతం , ఈ పండుగ సందర్భంగా కొంత ఉత్సాహం చూపిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు వ్యాపారాల్లో

 
 
 
ఆ పాత మధురాలు

కొన్ని పాటలు వింటూ ఉంటే ఎన్ని సార్లు విన్నా విసుగు రాదు అనిపిస్తుంది . అందులో హేమంత్ కుమార్ గారి స్వరం ఒక విధమైన మాధుర్యం తో వుంటుంది. లోకో భిన్న రుచి అనుకోండి. కొంత మందికి నచ్చక పోవచ్చు. పాత కాలంలో

 
 
 
డ్రెస్ కోడ్

.ఏదో స్కూల్ డ్రెస్ లాగా ఈ హెడ్డింగ్ ఏమిటో అనుకోకుండా కొంచెం ఓపికగా చదివితే మీకే తెలుస్తుంది కదా , దసరా హడావిడి పూజలు కోలాటాలు బతకమ్మ డాన్సులు అయినాయి పిల్లలు కు హాలిడేస్ అనిఅమ్మాయి ఉదయాన్నే బ్రేక్ఫాస

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page