మా మూడో అంతస్తు 2
- murthydeviv
- Dec 11, 2024
- 2 min read
ఇంకా మా మూడో అంతస్తు కు గార్డెన్ లేదు అనుకుంటారేమో ఒక చిన్న సైజ్ రూఫ్ గార్డెన్ వుండేది ఎలా అనుకుంటున్నారేమో చాలా కుండీ లు పెట్టీ కొత్త రకాల పూలతో మా గార్డెన్ కళ కళ లాడు తూ ఉండేది అప్పట్లో మా అన్నయ్య బెనారస్ లో ఇంజనీరింగ్ చదివే వాడు. అక్కడ నుండి చెల్లెళ్ళ కోరిక తీర్చటానికి. రక రకాలు పూల చెట్లు విత్తనాలు తెచ్చే వాడు అవి జినియా డాలియా ఇంకా పేర్లు కూడా. తెలియని విత్తనాలతో తొట్ల ల్లో పెంచే వాళ్ళము ఒక పెద్ద తొట్టె లో చమేలి చెట్టు కూడా పెంచా ము ఇంకా గులాబి చేమంతి చెప్పక్కర్లేదుగా ఆ జీనియా డా లియా పూలు బాగా పూస్తే పిట్ట గోడ మీద పెట్టీ చుట్టుపక్కల వాళ్ళకి కన్నుల పండుగ చేసేవాళ్ళం a పూల చెట్లు కు నీళ్లు కింద నుంచి. వంతులవారిగా పైకి తెచ్చి పొసే వాళ్లం ఆ పూల చెట్లు చూస్తే ఎంత సంతోషం గా వుండేది శ్రమ అనిపించేది కాదు ఇప్పటికయినా మా మూడో అంతస్తు ఒక రిసార్ట్ లాంటిది అని నమ్ము తారు కదా ఆ మూడో అంతస్తు తో ఎన్నో రకాల జ్ఞాపకాలు వున్నాయి మా చిన్న తనంలో లో మాది పెద్ద ఉమ్మడి కుటుంబం నాన్న గారు వాళ్ళ అన్న దమ్ములు మేనత్త లు అందరికీ పిల్లలు వేసవి సెలవలు వచ్చాయంటే పెద్ద వానర సైన్యం లాగా ఇల్లంతా హడావిడిగా వుండేది ఆడపిల్లలు కు ఎవరు జడలు వేస్తున్నారో తెలియదు మగ పిల్లల అల్లరిని కంట్రోల్ చేయాలంటే మా పెద్ద నాన్న గారు ముందు వుండే వారు ఉదయాన్నే అన్నాలు తినటం ఆడుకోవటం తప్ప మరో పని లేదు పగలు ఎండ తీవ్రత ఎక్కువ గా వుంటే రెండో అంతస్తు లో గవ్వలు చింతపిక్కలు క్యారమ్ బోర్డు ఇలాంటి ఆటలు ఆడాలి సాయంత్రం చల్ల పడ్డాక మా రిసార్ట్ వుంది కదా అక్కడ ఎన్ని ఆటలు అడే వాళ్ళ మో లెక్కలేదు రాత్రి పూట అన్నాలు తిని పైకి వెళ్లే టప్పటికి ఎన్నో పరుపులు వాటి మీద మల్లె పూల లాంటి తెల్లటి మంచి సువాసన తో తెల్లటి దుప్పట్లు దిండ్లు కప్పుకోవటానికి వేరే దుప్పట్లు కా ళ్ళ ద గ్గర వేసిఉండేవి సాయంత్రం కొంచెం చల్ల పడ్డాక నే ల వేడిగా వుంటుందని నీళ్లు చ ల్లించి బాగా ఆరాక పక్కల వేయించే వారు పైకి వెళ్లే టప్పటికి a పక్కల అన్నీ మమ్మల్ని ఆహ్వానిస్తూ వుండేవి a పక్కల మీదే వెన్నల ఆటలు పాటలు కబుర్లు చెప్పుకుంటూ ఏదో సంతొషం తో వుండే వాళ్ళం యింకా చాలా కబుర్లు తో రేపు కలుద్దాము
Comments