top of page
Search

మా ప్రయాణం 2

  • murthydeviv
  • Dec 20, 2024
  • 1 min read

Updated: Nov 14, 2025

ఢిల్లీ స్టేషన్ లో దిగి అక్కడ నుండి బస్ స్టాండ్ కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళగానే తెలిసింది ఏమిటంటే బస్ అయితే ఇక్కడి నుండే బయలు దేరుతుంది కానీ టికెట్ లు వేరే చోట ఇస్తారుట ఆ బస్ స్టాండ్ ల పేర్లు కూడా నాకు వింతగా అనిపించాయి ఒకటి ఉంటుంది ఆజాద్ గేట్ రెండో బస్ స్టాండ్ పేరు కాశ్మీర్ గేట్ . ఆ ట్రంకు పెట్టెలు తో ఇద్దరము వెళ్ళటం కష్టం కాబట్టి నన్ను అక్కడే వుంచి మా వారు టిక్కెట్స్ కోసం వెళ్ళారు . చాలా ధైర్యం గా అక్కడ వుంటాను అని చెప్పాను . శ్రీవారి ముందు భయ పడ్డట్లు కనిపించకూడదు కదా. మా వారు ఈ ఢిల్లీ ఉద్యోగం గురించి చెప్పగానే నేను మా నాన్న గారు ఫరిదాబాద్ లో వర్క్ చేస్తున్న మా కజిన్ బ్రదర్ కు ట్రెయిన్ వివరాల తో ఉత్తరం రాశా ము బయలు దేరే ముందు టెలిగ్రామ్ కూడా ఇచ్చాము . అన్నయ్య కు స్టేషన్ కు రావటానికి వీలు కాక బస్టాండు కు వచ్చాడు అన్నయ్య ఎస్కార్ట్స్ కంపెనీ లో పని చేస్తాడు ఆ కంపెనీ బ్రాంచ్ మేము వెళ్ళే వూరులో వున్నది అన్నయ్య కు ఈ టికెట్ల బుకింగ్ గొడవ కూడా తెలుసు . ఒక్క దాన్నే వున్న నా దగ్గరికి వచ్చాడు. ఆ క్షణం లో అన్నయ్య ను చూడగానే నాకు కలిగిన అనుభూతి నీ మాటల్లో చెప్పలేను. స్టేషన్ కు రాలేనందుకు సారీ చెపుతూ ఇంకో పది రోజుల్లో అవూరు వచ్చే పని వుందని, తనకు దగ్గర గా మేము వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని కబుర్లు చెప్తున్నాడు. ఇంతలో టికెట్స్ తీసుకుని వస్తున్న మావారు ఎవరో నన్ను గొడవ పెడ్తున్నారేమో అని కంగారు గా పరిగెత్తుకుంటూ వచ్చారు. దగ్గరికి రాంగానే మా అన్నయ్య అని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు . ఇద్దరూ కలుపుగోలుగా వుండేవాళ్ళు కాబట్టి తర్వాత కూడా ఎంతో స్నేహం గా వుండే వాళ్లు. అన్నయ్య ఎపుడూ మావారి తో అనే వాడు నన్ను చూసి రౌడీ అని ఎందుకు అనుకున్నావు బావా అని , దానికీ మా వారి సమాధానం నీవు గళ్ల షర్ట్ స్వెట్టర్

వేసు కున్నావురా అందుకే అలా అనుకున్నాను అని . అలాంటి కన్ఫ్యూషన్ తో మొత్తానికి ఆరోజు రాత్రికి మేము 5 ఏళ్లు అమాయకంగా, ఆనందంగా గడిపిన ఆ వూరు చేరుకున్నాము. ఆ రోజు అన్నయ్య మనవైపు స్వెట్టర్ లు గట్రా వుండవని తెలిసి ఒక శాలువా ఇచ్చి వెళ్ళాడు


 
 
 

Recent Posts

See All
మధుర గీతాలు తలత్ మొహమ్మద్

మొన్న సురయ్యా పాటలు సెర్చ్ చేస్తూ ఉంటే రాహి మత్ వాలే అంటూ ఒక చక్కటి పాట కనిపించింది. ట్రైన్ లో పాట సో స్పీడ్ గానే వుంది మ్యూజిక్ పాడుతున్న ది తలత్ మొహమ్మద్ అనీ కనుక్కున్నా గాని యాక్ట

 
 
 
పడక కుర్చీ

భావుక లో పోయిన వారం ఇచ్చిన పదాలు లో వున్న పడక కుర్చీ అనే పదం చూడగానే ఏభయి ఏళ్ల క్రితం జరిగిన కొన్ని సంఘటన లు గుర్తు వచ్చాయి. కానీ నాకు ఏమిటో మొన్నీ మధ్య జరిగినట్లు అనిపిస్తుంది. ఆ రోజు

 
 
 
శ్రీ రామ నవమి

శ్రీరామ నవమి శుభాకాంక్షలు. రాముల వారి కళ్యాణం ఆంటే అందరూ పెద్దలే అని చెప్పేవారు మా బామ్మ గారు. మన చిన్నతనం లో ఈ వసంత నవరాత్రులు గురించి అంతగా తెలియదు. రాములువారి కళ్యాణం అని వీధి వీధికి

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page