మా ప్రయాణం
- murthydeviv
- Dec 19, 2024
- 2 min read
దిపావళి పండగ కు రమ్మని కొత్త అల్లుడి గారికి మా నాన్న గారు వ్రాసిన ఉత్తరానికి మావారు. బాంబు పేలుస్తూ రిప్లై వ్రాశారు తనకు పంజాబ్ లో యూనివర్సిటీ లో కొత్త ఉద్యోగం వచ్చింది అని పండగ కు వచ్చి భార్య మణి నైన వెంబడి తీసికొని వెళతానని ఆ ఉత్తరం సారాంశం వెంటనే మా అమ్మ గారు అయ్యో దగ్గర లో మన అబ్బాయి వున్నాడని కదా మనం
అమ్మాయిని ఇచ్చింది . ఇపుడు అల్లుడు గారు అంత దూరం వెళుతున్నారా అని కంగారు పడటం మొదలు చదువు అంటే చాలా ఇష్టం వున్న. మా నాన్న గారు మాత్రం ఆయన కు అక్కడ రీసెర్చ్ చెయ్యటానికి అవకాశం ఉంటుంది అంటున్నారు కదా అని సంతోషించారు . మావారు వ్రాసిన వూరు ఎక్కడ వుందో కూడా మాకు తెలియదు ఇప్పటిలాగా గూగుల్ తల్లి లేదుకదా . అట్లాస్ లో ఇండియా మ్యాప్ చూసి ఆ వూరు ఎక్కడ వున్నదో కని పెట్టాము . డిల్లీ దాకా రైల్లో వెళ్లి అక్కడ నుండి బస్ లో వూరు చేరాలి . ఎపుడూ వుదయం బయలుదేరితే సాయంకాలం చేరే మద్రాస్, తప్పితే అంత దూరం ఎప్పుడూ ప్రయాణం చేయలేదు .గ్రాండ్ ట్రంక్ ఎక్సప్రెస్ మా ఊర్లో ఆగదు కాబట్టి విజయవాడలో ఎక్కాలి . మా అన్నయ్య వచ్చి మాకు సెండ్ ఆఫ్ ఇచ్చాడు ఈ ప్రయాణం గురించి ఎందుకు వివరంగా రాస్తున్నానో చదివితే మీకు తెలుస్తుంది అర్ధరాత్రి ఎక్కాం కదా హాయిగా నిద్రపోయి మేము లేచే సరికి పాంట్రీ కార్ లో వాడు బ్రేక్ ఫాస్ట్ అయిపోయింది లంచ్ 1.30 కి ఇస్తాము అన్నాడు మా వారు సరే అని ఒక సిగరెట్ వెలిగించి పక్క వాళ్ళ దగ్గర పేపర్ తీసికొని చడవుతూ కూర్చున్నారు . యింట్లో ఉ దయం పది గంటలు కల్లా భోజనం చేసే అలవాటు వున్న నాకు ఏమి చేయాలో అర్ధం కాలేదు ఇంత లో నాగపూర్ స్టేషన్ వచ్చింది . అక్కడ ఏదో టిఫిన్ పట్టు కొస్తానని మా వారు దిగారు . ఆహా నేను అడగ కుండానే దిగారు కదా అని సంతోషించాను . ఆ సంతోషం లో వుండగానే రైలు కదిలింది . ఈయన ఎక్కారో లేదో అని టెన్షన్ . ఎవరినయినా అడుగు దామని అటూ ఇటు తిరిగాను ఒక పావు గంట తర్వాత మెల్లగా వచ్చారు రైలు కదలటం వలన వేరే కంపార్టుమెంట్ లో ఎక్కటం వలన. లేట్ అయింది అంటూ. సంజాయిషీ ఇచ్చారు. అలా మొదలైంది మా ప్రయాణం మర్నాడు ఉదయం డిల్లీ చేరాము డిల్లీ విశేషాలు రేపు
Comments